Two Persons Injured In Explosion At Hyderabad Lower Tank Bund Dumping Yard, Details Inside - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌ సమీపంలో భారీ పేలుడు

Published Thu, Dec 15 2022 4:50 PM | Last Updated on Thu, Dec 15 2022 6:41 PM

Explosion In Hyderabad Lower Tank Bund Dumping Yard - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీనగర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ సీఐ మోహన్‌రావు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన చంద్రన్న , ఆయన కుమారుడు సురేష్‌గా గుర్తించారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


చదవండి: కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement