LPG Gas Supply
-
ఇక.. నేటి నుంచి మరో రెండు గ్యారంటీలు ప్రారంభం
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం నుంచి ఈ రెండు పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు పంపించింది. తెల్ల రేషన్‌కార్డు (ఆహార భద్రతా కార్డు) ప్రామాణికంగా ఈ రెండు పథకాలను వర్తింపజేయనున్నారు. వీటి ద్వారా జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందడంతో పాటు, నగదు బదిలీ పద్ధతిన గ్యాస్ వినియోగదారులకు రూ.500లకే సిలిండర్ అందనుంది. జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులు జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులున్నాయి. జిల్లాలో 3,11,415 గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ప్రజాపాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం 2,30,412 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్యాస్ వినియోగదారులు ముందుగానే మొత్తం డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తరువాత ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.500పోను మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేస్తుంది. తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతి రీఫిల్‌కు రూ.500సబ్సిడీ అందనుంది. గడిచిన మూడు సంవత్సరాల్లో వినియోగదారులు గృహ అవసరాలకు వాడిన గ్యాస్ సిలిండర్ల ఆధారంగా గ్యాస్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేకంగా లెక్కలు తీశారు. మార్చి1 అనంతరం జీరో బిల్లులు.. జిల్లాలో ఉచిత కరెంట్ కోసం 2,09,899 మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 200 యూనిట్ల లోపు వాడే గృహ విద్యుత్ వినియోగదారులు 1,61,099 మంది ఉన్నారు. వీరి వివరాలను విద్యుత్ శాఖ సేకరించింది. లబ్ధిదారుల స్థానికత గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఆహార భద్రతా కార్డు, ఫోన్‌నంబర్లు సేకరించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబంలో ఒక నెలలో 200 యూనిట్ల వరకు జీరో బిల్లును ఇస్తారు. మార్చి 1 అనంతరం వచ్చే విద్యుత్ బిల్లులతో జీరో బిల్లు పథకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇవి చదవండి: లక్ష కోట్లు.. 5 లక్షల ఉద్యోగాలు -
ఊరట: మూడు నెలలు వంట గ్యాస్ ఫ్రీ?
సాక్షి, హైదరాబాద్: ఉజ్వల (దీపం) పథకం వంట గ్యాస్ లబ్దిదారులకు శుభవార్త. గృహోపయోగ వంట గ్యాస్ ధర చుక్కలు చూపిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల వినియోగదారులకు ఊరట కలిగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. వంట గ్యాస్ ధరల పెరుగుదల నేపథ్యంలో వరుసగా మూడు నెలలు పాటు ఉజ్వల వినియోగదారులకు ఉచితంగా సిలిండర్ రీఫిల్ సరఫరాల చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిసింది. ఇప్పటికే మూడు నెలల వ్యవధిలో గృహోపయోగ సిలిండర్ రీఫిల్‌పై రూ.225 పెరిగి ధర రూ. 871.50కు చేరింది. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తుల ధరలకు అనుగుణంగా మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 1.42 లక్షల మంది.. హైదరాబాద్ మహానగర పరి«ధిలో సుమారు 26 లక్షల వంట గ్యాస్ వినియోగ కనెక్షన్లు ఉండగా, అందులో 1.42 లక్షల కుటుంబాలు ప్రధాన మంత్రి ఉజ్వల పథకం లబి్ధదారులుగా ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఆరి్థక సవంత్సరం (2021–22)లో మూడు నెలల పాటు 3 ఉచిత సిలిండర్లు అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. . కరోనా కాలంలో సైతం.. గత సంవత్సరం కరోనా లాక్డౌన్ సమయంలోనూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద ఉజ్వల పథకం లబి్ధదారులందరికీ మూడు నెలల పాటు ఉచిత ఎల్íపీజీ సిలిండర్లు పంపిణీ చేశారు. తిరిగి అధిక ధరల నేఫథ్యంలో ఉచితంగా సరఫరా చేసి చేయూత అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో మాదిరిగానే వినియోగదారులు ఇంటి వద్దకు వచి్చన ఎల్íపీజీ సిలిండర్ల రీఫిల్‌ను బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి బదిలీ కానుంది. గ్రేటర్లో ఉజ్వల (దీపం) వంట గ్యాస్ కనెక్షన్లు ఇలా హైదరాబాద్- 81,083 మేడ్చల్- 20,231 రంగారెడ్డి- 40,766 -
‘డిమాండ్‌కు తగ్గట్టు గ్యాస్ సిలిండర్ల పంపిణీ’
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండటంతో వంటగ్యాస్ వినియోగం పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శ్రవణ్ ఎస్. రావు తెలిపారు. లాక్డౌన్ ప్రారంభంలో సిలిండర్ బుకింగ్ బాగా పెరిగిపోయినప్పటికీ.. ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డిమాండ్‌కు తగినట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సకాలంలో సిలిండర్లు అందించేందుకు ఇండియన్ పంపిణీదారులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై సరఫరా యంత్రాంగానికి అవగాహన కల్పిస్తూ, గ్యాస్ నింపే ప్రదేశాల్లోనూ యాజమాన్యం అన్నివిధాలా అవసరమైన చర్యలు తీసుకుందని తెలిపారు. (రైతులకు తీపికబురు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అన్ని ట్రక్కుల పరిశుభ్రతపైనా శ్రద్ధ వహిహస్తున్నామని తెలిపారు. ఖాళీ సిలిండర్లతో వచ్చే వాహనాలు తిరిగి గ్యాస్ నింపిన సిలిండర్లు తీసుకెళ్లేదాకా అన్ని స్థాయిల్లోనూ అత్యంత అప్రమత్తత పాటిస్తుమన్నారు. జిల్లా యంత్రాంగంతో సంప్రదిస్తూ వాహనాల రాకపోకలు, సిలిండర్ల సరఫరా కార్యకలాపాలను సజావుగా నిర్వహిస్తోందన్నారు. సిలిండర్ల బిల్లు చెల్లింపు నిమిత్తం కరెన్సీ నోట్లకు బదులుగా సాధ్యమైనంత వరకూ డిజిటల్ పద్ధతిని ఉపయోగించే విధంగా ఐఓసీఎల్ ఖాతాదారులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒక్కొక్క ఉచిత సిలిండర్ అందజేయదానికి వీలుగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 73000 ఇండియన్ సిలిండర్లను (14.2 కేజీలు), 468 మంది లబ్దిదార్లకు 5 కేజీల సిలిండర్లను.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంచితంగా పంపిణీ చేసిందన్నారు. (ఏపీ డీజీపీకి విజయసాయిరెడ్డి లేఖ ) శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో ఒకవైపు వేలాది ప్రాణాలు బలికాగా, మరోవైపు ఆర్థిక వ్యవస్థలన్నీ మందగించాయి. ఈ భారీ ఆరోగ్య సంక్షోభంలో దేశమంతా దిగ్బంధమైన వేళ అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దేశానికి, ప్రజలకు మద్దతుగా ఐఓసీఎల్ సిబ్బంది శక్తివంచన లేకుండా తమవంతు కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు.ఈ పరీక్షా సమయంలో పెట్రో ఉత్పత్తుల సరఫరా క్రమం కుంటుపడకుండా పలు చర్యలు తీసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వినియోగదారులకు సంతృప్తికరంగా సేవలందించేందుకు ఐఓసీఎల్ సిబ్బంది పూర్తి వ్యక్తిగత రక్షణ సరంజామాతో విధులు నిర్వర్తిస్తున్నారు’’. (ఏపీ పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారు.. ) ‘‘ప్రాంతీయ కార్యాలయాలు, పంపిణీదారు ప్రాంగణాల వద్ద పూర్తిస్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేశాము. వలస కార్మికుల వంటి అన్నార్తులకు ఆహారం, నీరు, పాలు తదితర నిత్యావసరాలను మానవతా దృష్టితో సరఫరా చేస్తున్నాము. వాహనాల డ్రైవర్లు సొంతంగా వంట చేసుకునేందుకు వీలుగా కూరగాయలు, కిరాణా సరకులు, వంటగ్యాస్ తదితరాలన్నీ ఉచితంగా అందిస్తున్నాము. అనూహ్య సంఘటనల్లో దురదృష్టవశాత్తూ సిబ్బందికి, కార్మికులకు ప్రాణనష్టం వాటిల్లితే రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించే ఏర్పాటు కంపెనీ చేసింది. వివిధ ప్రభుతరంగ సంస్థల తరహాలో ‘పీఎం కేర్స్’ సహాయ నిధిసహా ఇతర సహాయ నిధులకూ ఐఓసీఎల్ సంస్థతోపాటు ఉద్యోగులు, సిబ్బంది తమ జీతాల నుంచి విరాళమిచ్చారు’’. అని శ్రవణ్ తెలిపారు. (ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ సడలింపు) -
వేగంగా వంటగ్యాస్ సరఫరా
చెన్నై, సాక్షి ప్రతినిధి: వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో తరచూ ఏర్పడుతున్న జాప్యానికి చెక్పెట్టబోతున్నారు. బుక్ చేసుకున్న వారం రోజుల్లోనే ఇంటికి సిలిండరు సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సిద్ధమవుతోంది. రాష్ట్రం మొత్తం మీద 1.12 కోట్ల గ్యాస్ సిలిండర్లు సరఫరాలో ఉండగా, ఒక్క చెన్నైలోనే రూ.12 లక్షలు ఉన్నాయి. అట్టడుగు వర్గాలు సైతం వంటగ్యాస్ వినియోగానికి అలవాటుపడిన తరుణంలో సక్రమంగా సరఫరా జరగని పక్షంలో సతమతమవుతున్నారు. వంటగ్యాస్ కంపెనీల నిబంధనల ప్రకారం బుక్ చేసుకున్న వారం రోజుల్లోగా గ్యాస్ సిలిండర్ చేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 20 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటున్నారు. చెన్నైలో ఇటీవల ఒక మహిళ ఎంతకూ గ్యాస్ సరఫరా జరగక పోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీస్ జోక్యంతో సిలిండరు పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ జాప్యానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. కాలం చెల్లిన వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్య పెరిగిపోవడం, వాటి స్థానంలో కొత్త సిలిండర్లు లేకపోవడం వంటివి కొన్ని కారణాలు. అయితే కొన్ని ఏజన్సీల్లోని ఉద్యోగులు సిలిండర్ల సరఫరాలో గోల్‌మాల్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లోడు రాలేదు, ఇంకా జాప్యం కావచ్చు వంటి మాటలతో గ్యాస్ కంపెనీలపై నిందలు మోపి తమకు నచ్చిన వారికి సిలిండర్లు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. సిలిండర్ల సంఖ్యలో తగ్గుదల ఏజెన్సీలకు అవకాశంగా మారకుండా ఐవోసీ దృష్టి సారించింది. పదేళ్ల వినియోగకాలాన్ని దాటిన సిలిండర్లను ముందుగా తనిఖీ చేసే పనిలో పడింది. ఐవోసీ చెన్నై మండలం పరిధిలోని తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోని పాత సిలిండర్లను సేకరించి రోజుకు 5 వేల నుంచి 10 వేల చొప్పున తనిఖీలు నిర్వహిస్తోంది. సరఫరాలో జాప్యానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఒక వైపు కాలం చెల్లిన సిలిండర్లను లెక్కకడుతూనే రెండు లక్షల కొత్త సిలిండర్లను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంపై ఐఓసీ అధికారి ఒక మీడియాతో మాట్లాడుతూ, వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఏర్పడిన డిమాండ్ మరో రెండు వారాల్లో సర్దుకుంటుందన్నారు. బుక్ చేసిన వారంలోగా సిలిండర్లు చేరేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్యాస్ ఏజెన్సీలు మోసానికి పాల్పడుతున్నట్లు రాతపూర్వక ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెన్నై ఆళ్వారుపేటకు చెందిన ఒక గృహిణి ఇటీవల ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి గ్యాస్ ఏజన్సీపై క్రమశిక్షణ చర్యను చేపట్టామని అన్నారు.