సాక్షి, హైదరాబాద్: ఉజ్వల (దీపం) పథకం వంట గ్యాస్ లబ్దిదారులకు శుభవార్త. గృహోపయోగ వంట గ్యాస్ ధర చుక్కలు చూపిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల వినియోగదారులకు ఊరట కలిగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. వంట గ్యాస్ ధరల పెరుగుదల నేపథ్యంలో వరుసగా మూడు నెలలు పాటు ఉజ్వల వినియోగదారులకు ఉచితంగా సిలిండర్ రీఫిల్ సరఫరాల చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిసింది. ఇప్పటికే మూడు నెలల వ్యవధిలో గృహోపయోగ సిలిండర్ రీఫిల్‌పై రూ.225 పెరిగి ధర రూ. 871.50కు చేరింది. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తుల ధరలకు అనుగుణంగా మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
1.42 లక్షల మంది..
హైదరాబాద్ మహానగర పరి«ధిలో సుమారు 26 లక్షల వంట గ్యాస్ వినియోగ కనెక్షన్లు ఉండగా, అందులో 1.42 లక్షల కుటుంబాలు ప్రధాన మంత్రి ఉజ్వల పథకం లబి్ధదారులుగా ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఆరి్థక సవంత్సరం (2021–22)లో మూడు నెలల పాటు 3 ఉచిత సిలిండర్లు అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. .
కరోనా కాలంలో సైతం..
గత సంవత్సరం కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద ఉజ్వల పథకం లబి్ధదారులందరికీ మూడు నెలల పాటు ఉచిత ఎల్íపీజీ సిలిండర్లు పంపిణీ చేశారు. తిరిగి అధిక ధరల నేఫథ్యంలో ఉచితంగా సరఫరా చేసి చేయూత అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో మాదిరిగానే వినియోగదారులు ఇంటి వద్దకు వచి్చన ఎల్íపీజీ సిలిండర్ల రీఫిల్‌ను బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి బదిలీ కానుంది.
గ్రేటర్‌లో ఉజ్వల (దీపం) వంట గ్యాస్ కనెక్షన్లు ఇలా
హైదరాబాద్- 81,083
మేడ్చల్- 20,231
రంగారెడ్డి- 40,766
Comments
Please login to add a commentAdd a comment