17న ఓటరు పండుగ విజేతలకు బహుమతులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ స్మితా సబర్వాల్ నిర్వహించిన ‘ఓటరు పండుగ’లో విజేతలుగా నిలిచిన వారికి ఈనెల 17న బహుమతులు ప్రదానం చేయనున్నారు. పోలింగ్ 95 శాతం నమోదైన గ్రామాలకు రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేయడానికి ప్రణాళిక రూపొందించి ఆ మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఓటరు పండగను ఘనంగా నిర్వహించారు. గత నెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 92 శాతానికిపైగా పోలింగ్ నమోదైన గ్రామాలు జిల్లా వ్యాప్తంగా 102 ఉన్నాయి.
ఆయా గ్రామాల్లో పది మంది చొప్పున లక్కీడిప్ ద్వారా విజేతలను ఈనెల 8న కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఎంపిక చేశారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ సమక్షంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీప్రియ ఓటర్ల సమక్షంలో డ్రా తీశారు. డ్రాలో ఎంపికైన వారికి సుమారు రూ.1,300 నుంచి రూ.1,400 విలువ చేసే బహుమతులను ఈనెల 17న సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆడిటోరియలో నిర్వహించే ఓటరు పండుగ కార్యక్రమంలో అందజేస్తారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,020 మంది విజేతలుగా ఎంపికయ్యారు. ఇందులో ఐదుగురికి బంపర్ బహుమతులతోపాటు ఒకరికి మెగా బహుమతి కింద నానో కారు అందజేస్తారు.
నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతం వివరాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నియోజకవర్గాల వారిగా పోలైన ఓట్ల వివరాలు రిటర్నింగ్ అ‘దికారుల నుంచి శనివారం రాష్ట్ర ఎన్నికల ప్ర‘దాన కార్యాలయూనికి అందార వివరాలు ఇలా ఉన్నార.
మెదక్ జిల్లా
1. సిద్ధిపేట 74.20
2. మెదక్ 77.57
3. నారాయుణఖేడ్ 77.18
4. ఆం‘దోల్(ఎస్సీ) 79.35
5. నర్సాపూర్ 85.97
6. జహిరాబాద్(ఎస్సీ) 70.66
7. సంగారెడ్డి 73.68
8. పటాన్చెరు 67.67
9. దుబ్బాక 82.52
10. గజ్వేల్ 83.85