lucky scheme
-
రూ. 3000 ఖరీదైన చీర రూ.300 కే!!
సుమతి (పేరు మార్చడమైనది) ఆన్లైన్లో పండగ ఆఫర్ల కింద వచ్చిన అప్లికేషన్స్ చూస్తూ ఉంటే మంచి కలర్ కాంబినేషన్ ఉన్న పట్టు చీర కనపడింది. ‘మూడు వేల రూపాయల చీర, మూడు వందలకే’ అని ఉండటంతో క్లిక్ చేసింది. ఆ చీర బుక్ అవ్వాలంటే అందులో ఇచ్చిన అకౌంట్లో డబ్బులు జమ చేయడంతోపాటు వివరాలన్నీ పొందుపరిచిన ఒక ఫారాన్ని నింపాలి. డబ్బు కట్టడంతోపాటు వివరాలన్నీ ఇచ్చింది. కానీ, ఎన్ని రోజులైనా ఆ చీర మాత్రం రాలేదు. ‘మా లక్కీ స్కీమ్‌లో పాల్గొనండి, ఐ ఫోన్ గెల్చుకోండి’ అని ఉన్న అప్లికేషన్‌ను శేఖర్ (పేరు మార్చడమైనది) క్లిక్ చేశాడు. ఆ లక్కీ డిప్లో పాల్గొనాలంటే రెండు వేల రూపాయలు చెల్లించి, స్కీమ్‌లో చేరాలని ఉంది. తన వివరాలతో పాటు, రెండు వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించి, ఆ స్కీమ్‌లో చేరాడు. కానీ, శేఖర్‌కి ఫోన్ రాలేదు. ఆ డబ్బులూ తిరిగి రాలేదు. సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవడానికి ఆఫర్లు లైక్స్, కామెంట్స్, సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడానికి కొందరు ‘ఉచితం లేదా డిస్కౌంట్’ అనే పదాలను ఎరగా వేస్తుంటారు. ‘50,000 రూపాయల ధర పలికే గడియారాన్ని 5,000కే అమ్ముతున్నాను’ అనే ఆఫర్లు వస్తుంటాయి. మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం.. ‘ఆఫర్’ని ఎరగా వేసి వివరాలన్నీ సేకరించి, ఆ తర్వాత మోసానికి పాల్పడే వారుంటారు. వివరాలన్ని ‘డార్క్’వెబ్సైట్లలో పెడుతూ, మరో ఆన్లైన్ మోసాలకు ఉపయోగించడానికి ఆ డేటాను వాడుతుంటారు. ఒరిజినల్ అని చెప్పి, అమ్మడం ఇది మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం. బ్రాండెడ్ వస్తువులా అనిపించే రెప్లికా ఐటమ్ చూపించి అసలైనదే అని చూపుతారు. మీతో పాటు మరికొంతమందిని తమ స్కీమ్‌లో చేర్చితే ‘50,000 రూపాయల వస్తువు 5000 కు సొంతం చేసుకోవచ్చు అనే ఆశను చూపెడతారు. నాణ్యతలేని వస్తువులతో ఎర రెప్లికా వస్తువుల్లోనూ గ్రేడ్స్ ఉంటాయి. అవి చూడటానికే బాగుంటాయి కానీ, ఏ మాత్రం పనిచేయవు. అలాంటి వస్తువులను చూపి, డబ్బులు రాబట్టి మోసం చేస్తారు. ఆఫర్ల వర్షం దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ముఖ్యమైన పండగల సమయంలో జనాల బలహీనతను దృష్టిలో పెట్టుకొని, బంపర్ ఆఫర్, వీల్ తిప్పడం, స్క్రాచ్ కార్డ్‌లు.. వంటి వాటితో ఆన్లైన్ మోసానికి దిగుతుంటారు. ఈ షాపింగ్ మోసాలు ఢిల్లీ చుట్టుపక్కల నుంచి అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీటిల్లో ఎక్కువగా ఫోన్లు, వాచీలు, చీరలు, డ్రెస్సుల విషయాల్లో జరుగుతుంటాయి. ఆన్లైన్ షాపింగ్ మోసానికి ముందే హెచ్చరికలు ► ఒక వస్తువులు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరతో ప్రచారం చేయబడుతుంది అంటే ఆలోచించాలి. మోసానికి ముందు ఇదొక హెచ్చరిక అనుకోవాలి. ► ఆన్లైన్ చెల్లింపులు కాకుండా వస్తువు ఇంటికి వద్దకు వచ్చాకే చెల్లింపు అనే ఎంపిక మంచిది. ► డిస్కౌంట్ ఆఫర్‌ని పొందడానికి తమ వోచర్ కోసం ముందే చెల్లించాలనే ఎంపికలు ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ► నకిలీ సోషల్ మీడియా ఆధారిత కథనాలు కొత్తగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్ లైన్ లో చాలా తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి, అనేది నిజం కాదు. ► విక్రేత విదేశాల్లో ఉన్నప్పుడు పే మనీ లేదా క్రెడిట్/ డెబిట్ కార్డ్ లావాదేవీ వంటి సురక్షిత చెల్లింపు సేవ ద్వారా చెల్లింపును అనుమతించరు. వారు మిమ్మల్ని ౖఖ్కీ ని చెప్పమని లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్స్ లేదా చిన్న లింక్‌లను పూరించమని అడుగుతారు. ► కొత్తగా పుట్టుకు వచ్చిన వెబ్సైట్లలో నిర్ధారణకు రాకుండా కొనుగోళ్లు చేయకూడదు. వాటి తాలూకు ఫౌండర్స్ ఎవరనేది కూడా చూసుకోవాలి. బ్రాండ్ పేరుతో ఉన్న వెబ్‌సైట్స్ కూడా నకిలీ పేరుతో వస్తాయి. పండగల సమయాల్లో ఈ– తరహా మోసాలు ఎక్కువ. కాబట్టి, వాటి వాడుక, హెచ్టిటిపిఎస్, యుఆర్ఎల్ చెక్ చేసుకొని కొనాలి. షాపింగ్ మోసాల నుండి రక్షణ ► మీరు తీసుకోవాలనుకున్న వస్తువు ‘సమీక్ష (రివ్యూ)లు చదవండి. వాటి నాణ్యత, రిటర్న్ పాలసీల వంటివి ఉన్నాయేమో చూడండి. ► ఎప్పుడైనా (యాప్) అప్లికేషన్ అంతర్నిర్మిత సాధనాలతోనే కమ్యూనికేట్ చేయండి. అప్లికేషన్ వెలుపల కమ్యూనికేట్ చేయవద్దు. ► సురక్షిత నగదు చెల్లింపు కోసం https://URL చూడండి. ► అమ్మకం దారుకి మీ బ్యాంక్ OTP / PIN నంబర్లను ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. ► మీరు ఫోన్ మాట్లాడే సమయంలో చెల్లింపు లావాదేవులను ఎప్పుడూ చేయవద్దు. ► అమ్మకం దారు అందించిన ఏవైనా షార్ట్ లింక్‌లను క్లిక్ చేసి, వాటిని పూరించవద్దు. గూగుల్ లింక్ ద్వారా వచ్చిన ఫామ్‌లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుంది. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ముంచేసే స్కీమ్
అక్రమ సంపాదనకు కొందరు పక్కా స్కెచ్ వేశారు.. బహుమతుల పేరిట అమాయకులను మోసం చేసే ‘స్కీం’కు తెర లేపారు.. అందమైన బ్రోచర్లు ముద్రించి బుట్టలో దింపుతున్నారు. కొద్ది మొత్తం కడితే చాలు, పెద్ద బహుమతులు సొంతం చేసుకోవచ్చని వందలాది మందికి ఆశ చూపి, మాయలో పడేస్తున్నారు. ఇలా నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసి, ఒకరిద్దరికి బహుమతులు కట్టబెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మిగతా వారికి ఏదో నామమాత్రపు వస్తువు అంటగట్టి, పెద్ద మొత్తంలో వెనుకేసుకుంటున్నారు. ప్రజలను ముంచే ఈ ‘స్కీం’ల దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, బహిరంగంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని నియంత్రించాల్సిన పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ఎంటర్ప్రైజెస్ల పేరిట అక్రమ స్కీంలు జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి.. ప్రజలను నిండా ముంచే ఇలాంటి ‘పథకాలు’ విచ్చలవిడిగా నడుస్తున్నాయి. స్కీంలు, లక్కీ డ్రా పేరుతో ప్రజల డబ్బును కొందరు అక్రమంగా వెనుకేసుకుంటున్నారు. ‘‘నెలకు కేవలం రూ.1,100 చొప్పున పది నెలలు చెల్లించండి.. కారు గెలుచుకోండి.. ఒక్క కారే కాదు, రూ.80 వేల విలువ చేసే బైక్, బంగారం, ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మిషన్, ఫ్రిజ్ వంటి గృహోపకరణాలను కూడా పొందవచ్చు..’’ అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. అందమైన బ్రోచర్లను ముద్రించి బుట్టలో వేసుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని నందిపేట్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్, వర్నిల కేంద్రంగా ఇలాంటి దందాలు నడుస్తున్నాయి. నిజామాబాద్ నగరంలో కూడా ఈ అక్రమ స్కీంలు గుట్టుగా నడుస్తున్నట్లు సమాచారం. పేద, మధ్య తరగతి ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని రూ.కోట్లలో టర్నోవర్ నిర్వహిస్తున్నారు. పరిసర గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని వందలాది మందిని సభ్యులుగా చేర్చుకుంటున్నారు. రూ.కోట్లల్లో దందా.. స్కీంలు, లక్కీ డ్రాల పేరుతో ప్రతి నెలా రూ.కోట్లల్లో దందా కొనసాగుతోంది. ఒక్కో స్కీంలో సుమారు 500 నుంచి వెయ్యి మందిని చేర్చుకుంటున్నారు. పది నెలలు, 15 నెలలు, 20 నెలలు, 25 నెలలు.. ఇలా వివిధ కాల పరిమితితో స్కీంలు నడుపుతున్నారు. ఈ స్కీంలలో సభ్యులుగా చేరిన వారు ప్రతి నెల రూ.వెయ్యి నుంచి రూ.నాలుగు వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రూ.వెయ్యి చొప్పున వెయ్యి మంది సభ్యులు కలిగిన స్కీంలో ప్రతి నెలా రూ.10 లక్షలు పోగేస్తున్నారు. స్కీం కాల పరిమితి పది నెలల్లో రూ.కోటి వరకు టర్నోవర్ చేస్తున్నారు. ఇలా ఒక్క స్కీంలోనే రూ.కోటి టర్నోవర్ జరుగుతోందంటే.. అన్ని స్కీంలలో కలిసి ఏ స్థాయిలో అక్రమ దందా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. భారీ బహుమతులను ఆశ చూపి.. వందల సంఖ్యలో సభ్యులను చేర్చుకుంటున్న స్కీం నిర్వాహకులు.. లక్కీ డ్రా నిర్వహించి ఒకరిద్దరికి కారు, బైక్‌లు అందజేస్తున్నారు. మిగిలిన వారికి చిన్న చిన్న గృహోపకరణాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. స్కీంలో చేరిన ప్రతి సభ్యుడికి బహుమతి వస్తుందని ఆశ చూపి, కన్సోలేషన్ బహుమతుల పేరుతో నామమాత్రపు విలువ కలిగిన బహుమతులను అంటగడుతున్నారు. ఇలా సభ్యుల వద్ద వసూలు చేసిన మొత్తంలో కనీసం సగం విలువ చేసే బహుమతులను కూడా ఇవ్వడం లేదు. అదృష్టం ఉంటే కారు, బైక్, గృహోపకరణాలు గెలుచుకోవచ్చనే ఆశతో అమాయక ప్రజలు ఈ స్కీంల్లో చేరుతున్నారు. వీరి ఆశను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రూ.లక్షలు దండుకుంటున్నారు. గతంలో కేసులు నమోదు.. నిబంధనల ప్రకారం ఇలాంటి స్కీంలు నిర్వహించడానికి అనుమతులు లేవు. ఇలాంటి స్కీంల పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతున్న వారిపై నిఘా ఉంచి సుమోటోగా కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ తమకు ఫిర్యాదులు అందలేదంటూ సంబంధిత పోలీసులు దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ఇలాగే స్కీంల పేరుతో అక్రమ దందా కొనసాగించిన వారిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అలాగే, మోర్తాడ్, కమ్మర్పల్లి ఠాణాల పరిధిలోనూ గతంలో కొందరు స్కీం నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇలాంటి స్కీం నిర్వాహకుల వైపు చూడడమే మానేశారు. స్కీంలు చట్ట విరుద్ధం.. స్కీంలు, లక్కీ డ్రాలు నిర్వహించడం చట్ట విరుద్ధం. ఇలాంటివి నడుస్తున్నట్లు మా దృష్టిలో లేదు. స్కీముల పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – మంత్రి సుదర్శన్, ఏసీపీ -
లక్కీ స్కీం ముంచింది!
- తక్కువ మొత్తానికి విలువైన వస్తువులను ఎర - డబ్బులు కట్టించుకుని ఉడాయించిన నిర్వాహకులు - ఆందోళనల్లో లబ్ధిదారులు చిలమత్తూరు : ‘తక్కువ మొత్తం.. విడతల వారీగా చెల్లిస్తే చాలు... విలువైన వస్తువులు మీ సొంతం’ అంటూ వల విసిరారు. ఇది నిజమని నమ్మిన అమాయకులకు చివరకు కుచ్చు టోపీ పెట్టారు. లక్కీ స్కీమ్ పేరుతో ప్రజలను బురిడీ కొట్టించిన ఓ సంస్థ నిలువునా ముంచి బోర్డు తిప్పేసిన ఉదంతం చిలమత్తూరులో వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు... హిందూపురం షిరిడీసాయి నగర్, శ్రీకంఠపురం, ఆర్.వి.రెడ్డి పేరుతో కొన్ని కార్డులు ముద్రించి హిందూపురం సహా పరిసర మండలాల్లోని గ్రామాల్లో లక్కీ స్కీం గురించి విస్తృత ప్రచారం చేశారు. స్కీం ఏంటంటే... మొదటి రోజు రూ.2, రెండో రోజు రూ.3, మూడో రోజు రూ.4, ఇలా రోజుకో రూపాయి వంతున పెంచుకుంటూ నెల రోజల పాటు చెల్లించాలి. మూడో రోజు డబ్బు కట్టకపోతే డ్రాలో పేరు ఉండదు. స్కీమ్ మధ్యలో ఏ కారణంగా డబ్బులు కట్టకపోతే అప్పటి వరకు కట్టిన మొత్తం వాపసు ఇచ్చేది ఉండదు. ఇదీ ఆ స్కీం కథ. రెండ్రోజులకోసారి డ్రా తీసినప్పుడు విజేతలకు విలువైన స్టీల్ సామానులు, కాపర్ డిష్ సెట్, ప్రెషర్ కుక్కర్, సీలింగ్ ఫ్యాన్, రైస్ కుక్కర్, అల్యూమినియం పాత్ర... ఇలా ఇస్తామని నమ్మ బలికారు. డ్రాలో లక్కీగా రాని వారికి నెల రోజుల్లో సామానులు ఇస్తామని మాటిచ్చారు. 1, 2, 3, 4 రూపాయాలే కదా చెల్లిద్దామనుకుని పేద, మధ్య తరగతి వర్గాల వారు వేలాది మంది ఎగబడ్డారు. నమ్మకంతో ఉంటూనే.. మొదట్లో ప్రజలను నమ్మించడానికి కొంత మందికి విలువైన సామానులను నిర్వాహకులు పంపిణీ చేశారు. ఇలా చేయడంతో మరింత మంది నమ్మి డబ్బులు కట్టేందుకు ముందుకు వచ్చారు. అంతే ఆ తరువాత స్కీమ్ నిర్వాహకులు అదృశ్యమయ్యారు. తామంతా మోసపోయామని బాధితులు గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
లక్కీ స్కీమ్ పేరిట కుచ్చుటోపీ
=భీమవరం వాసి సత్యనారాయణరాజు నిర్వాకం... = జిల్లాలో 2,500మంది బాధితులు =146 మందికి రూ.12 లక్షలు బాకీ ఉన్నానంటూ నోటీసులు! గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : లక్కీ స్కీమ్ పేరు తో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెం దిన పి.సత్యనారాయణరాజు మోసగించాడం టూ గుడ్లవల్లేరు ప్రాంతవాసులు గురువారం పో లీసులకు ఫిర్యాదు చేశా రు. స్కీమ్ నిర్వాహకుడు కైకలూరు, హనుమాన్‌జంక్షన్, గుడ్లవల్లేరు, తిరువూరు, ఉ య్యూరు ప్రాంతాల్లో నాలుగేళ్లగా చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గృహోపకరణాలు సులభ వాయిదాల్లో ఇస్తామంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లు ముద్రించి జిల్లాలో 250మంది ఏజెంట్లతో 2,500 మందిని ఆకట్టుకుని స్కీములో చేర్చుకున్నాడు. లక్కీడిప్‌లు తీస్తూ తనకు అనుకూలమైన కొంతమంది సభ్యులకు అప్పుడపుడూ బహుమతులు ఇవ్వటంతో పలువురు మహిళలు ఆకర్షితులయ్యారు. ఒక్క గుడ్లవల్లేరు మండలంలోనే 50 మంది ఏజెంట్లతో 500 మంది సభ్యులను స్కీమ్‌లో చేర్పించాడు. వాయిదాలు పూర్తిగా చెల్లించిన తరువాత వస్తువులు ఇవ్వకుండా ఉడాయిం చాడు. ఇటీవల ఉయ్యూరులో బోర్డు తిప్పేసిన పద్మావతి సేవింగ్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ ఈ ప్ర బుద్ధుడిదే. జిల్లావ్యాప్తంగా నష్టపోయిన పలు వురు సభ్యుల నుంచి కోట్లాది రూపాయలు ఈ స్కీమ్ కింద నిర్వాహకుడు దండుకున్నట్లు గుడ్లవల్లేరు పోలీసులకు ఏజెంట్లు, బాధితులు ఫిర్యా దు చేశారు. స్థానిక జేమ్స్‌పేటలో ఒక ఇంటిలో గృహోపకరణాలు ఉంచాడని, వాటిని తమకు ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. పోలీస్‌స్టేషన్‌కు చేరిన ఐపీ నోటీసులు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలుసుకున్నసత్యనారాయణరాజు ముందు జాగ్రత్త తీసుకున్నాడు. తాను ప్రాంసరీ నోట్లపై 146 మంది వద్ద రూ.12 లక్షలు రుణంగా తీసుకున్నానని గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌కు ఇన్సాల్వెన్సీ పిటిషన్(ఐపీ)లో ఆయా వ్యక్తుల జాబి తాను పంపటం గమనార్హం. తన వద్ద సొమ్ము లేదని, అందుకే ఐపీ దాఖలు చేసినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ జాబితా ను పరిశీలిస్తున్నామని ఎస్సై ఎ.ఫణిమోహన్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సత్యనారాయణరాజుపై కేసు నమోదు చేయనున్నామన్నారు. గృహోపకరణాల నిల్వను పరిశీలించిన ఎస్సై నిర్వాహకుడు లక్కీ స్కీమ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇంటిని ఎస్సై ఫణిమోహన్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు డోకాల కనకరత్నారావు ఆయనను కోరారు. ఈ కేసు కోర్టుకెళ్లాక పోలీసు ఉన్నతాధికారులు, న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ప్రకారం గుడ్లవల్లేరులో స్కీమ్ నిర్వాహకుడు నిల్వ చేసిన గృహోపకరణాలతో బాధితులకు ఎలా న్యాయం చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఎస్సై సమా ధానమిచ్చారు.