Luke ronchi
-
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజం.. !?
పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు ల్యూక్ రోంచి బాధ్యతలు చేపటనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రోంచి కూడా పీసీబీ ఆఫర్‌పై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోంచి ప్రస్తుతం న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఒకవేళ పీసీబీ ఆఫర్‌ను అతడు అంగీకరిస్తే న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు. కాగా వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. బాబర్ ఆజం పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ సైతం తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో గత డిసెంబర్, జనవరిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల కోసం మహమ్మద్ హఫీజ్ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు ముందు తమ జట్టు హెడ్‌కోచ్ పదవిని భర్తీ చేసే పనిలో పీసీబీ పడింది. ఇప్పటికే ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్, విండీస్ మాజీ కెప్టెన్ డారన్ సామిని హెడ్‌కోచ్ పదవి కోసం పీసీబీ సంప్రదించింది. కానీ పీసీబీ ఆఫర్‌ను వారిద్దరూ రిజక్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ల్యూక్ రోంచితో పీసీబీ చర్చలు జరపుతోంది. Luke Ronchi in talks with PCB for Pakistan's head coach position.#PakistanCricket pic.twitter.com/nelmZvVm2b — Nawaz 🇵🇰🇦🇪 (@Rab_Nawaz31888) March 26, 2024 -
ల్యూక్ రోంచీ అనూహ్య నిర్ణయం..
వెల్లింగ్టన్:న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో పించ్ హిట్టర్ గా పేరొందిన ల్యూక్ రోంచీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. మూడు ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. తన కెరీర్ కు ముగింపు ఇదే సరైన సమయమంటూ 36 ఏళ్ల రోంచీ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఆడటంతో తన కల నెరవేరినట్లు పేర్కొన్న రోంచీ..ఒకే సమయంలో మూడు ఫార్మాట్లకు ప్రాతినిథ్యం వహించడం మధురమైన జ్ఞాపకంగా అభివర్ణించాడు. తన వన్డే కెరీర్ ను 2008లో ఆరంభించిన రోంచీ 85 మ్యాచ్ లు ఆడి 1397 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. వన్డేల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 170 నాటౌట్. 32 అంతర్జాతీయ ట్వంటీ 20 లు ఆడిన రోంచీ ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ట్వంటీ 20ల్లో అతని అత్యధిక స్కోరు 51 నాటౌట్. ఇక టెస్టు కెరీర్ లో నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 2015లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోంచీ..8 ఇన్నింగ్స్ ల్లో 319 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 88. -
టీమిండియాను ఓడించాలంటే.
.కాన్పూర్:భారత క్రికెట్ జట్టును వారి స్వదేశంలో ఓడించడం అంత ఈజీ కాదని న్యూజిలాండ్ వికెట్ కీపర్ ల్యూక్ రోంచీ అభిప్రాయపడ్డాడు. భారత్ జట్టుతో సుదీర్ఘ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడుతున్న న్యూజిలాండ్ విజయాలు నమోదు చేయాలంటే తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందన్నాడు. ముంబైతో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్ నుంచి అనేక విషయాలను నేర్చుకున్నట్లు రోంచీ పేర్కొన్నాడు. ' ఆ మ్యాచ్‌లో మూడో రోజు నుంచి వికెట్లో మార్పు కనిపించింది. ఎక్కువ స్పిన్‌ను ఎదుర్కొవడం మాకు సవాల్‌గా అనిపించింది. ముంబై బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకుంది. ఆ మ్యాచ్ మాకు ఓ పాఠంలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాఆ సమయంలో మా ప్రణాళికలను కూడా సరిగా అమలు చేయలేకపోయాం. చివరి సెషన్లో మాపై ముంబై జట్టు పైచేయి సాధించింది. ఇక్కడ కొంతవరకూ ప్రతికూలత ఎదురుకాగా, చాలా వరకూ అనుకూలతను చూశాం. భారత్‌తో జరిగే అతి పెద్ద సిరీస్ జరుగుతుంది. ఇందులో ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయి. మా పూర్తిస్థాయి ఆటను ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది'అని రోంచీ పేర్కొన్నాడు. -
రోంచీ సెంచరీ
న్యూఢిల్లీ: ముంబైతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్సలో ఆకట్టుకున్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్సలో తడబడింది. ఈ మూడు రోజుల మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా... చివరి రోజు ఆదివారం స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆ జట్టు బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. ఫలితంగా రెండో ఇన్నింగ్సలో కివీస్ 235 పరుగులకే ఆలౌటైంది. ఎదురుదాడి చేసిన ల్యూక్ రోంచీ (112 బంతుల్లో 107; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా, వాట్లింగ్ (43) ఫర్వాలేదనిపించాడు. తొలి టెస్టు ఆడే జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న మార్టిన్ గప్టిల్ (0) మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ విశాల్ దభోల్కర్ వేసిన తొలి ఓవర్లోనే అతను డకౌట్‌గా వెనుదిరిగాడు. కివీస్ ఇన్నింగ్సలో తొమ్మిది వికెట్లను స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. పరీక్షిత్ వల్సాంగ్‌కర్ 3 వికెట్లు తీయగా, సిద్దేశ్ లాడ్, విజయ్ గోహిల్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు ముంబై తమ తొలి ఇన్నింగ్‌సను 8 వికెట్ల నష్టానికి 464 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చివరి రోజు ఉదయం 11 ఓవర్లు ఆడిన ముంబై సిద్దేశ్ లాడ్ (99 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ పూర్తికాగానే ఇన్నింగ్స్ ముగించింది. తొలి ఇన్నింగ్సలో 140 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై విజయలక్షాన్ని రెండో ఇన్నింగ్సలో 9 ఓవర్లలో 96 పరుగులుగా నిర్ణయించారు. అయితే ముంబై బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. -
లూక్ రోంచీ మెరుపులు
డ్యునెడిన్: సరిగ్గా 20 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోరు 93/5. ఈ దశలో ఎవరైనా ఆ జట్టు 200 పరుగులు చేస్తే గొప్పే అనుకోవడం సహజం. కానీ ఏడో నంబర్ బ్యాట్స్‌మన్ లూక్ రోంచీ (99 బంతుల్లో 170 నాటౌట్; 14 ఫోర్లు; 9 సిక్సర్లు) అసాధారణ ఆటతీరును ప్రదర్శించాడు. తనకు గ్రాంట్ ఇలియట్ (96 బంతుల్లో 104 నాటౌట్; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) చక్కటి సహకారం అందించడంతో కివీస్ జట్టు 50 ఓవర్లలో ఐదు వికెట్లకు ఏకంగా 360 పరుగులు సాధించి ఔరా అనిపించింది. ఈ క్రమంలో వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 267 పరుగులు జత చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.ఫలితంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో కివీస్ 108 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. ఏడు వన్డేల ఈ సిరీస్‌లో ఆతిథ్య జట్టు 3-1తో ఆధిక్యంలో ఉంది. 42.3 ఓవర్ల వద్ద కెరీర్లో తొలి సెంచరీ సాధించిన రోంచీ... లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ చివరి 45 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో ఏడో నంబర్ బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కివీస్ వికెట్ కీపర్‌గానూ రోంచీ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డు నెలకొల్పాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 43.4 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ దిల్షాన్ (116; 17 ఫోర్లు; 1 సిక్స్) సెంచరీ చేయగా... తిరిమన్నె (65 బంతుల్లో 45; 3 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. కేవలం 41 పరుగులకే చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయిన లంక దారుణ పరాజయం పాలైంది. బౌల్ట్‌కు నాలుగు వికెట్లు, సౌతీ, మెక్లింగన్, ఇలియట్లకు రెండేసి వికెట్లు దక్కాయి.