రోంచీ సెంచరీ
న్యూఢిల్లీ: ముంబైతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్‌సలో ఆకట్టుకున్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్‌సలో తడబడింది. ఈ మూడు రోజుల మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా... చివరి రోజు ఆదివారం స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆ జట్టు బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. ఫలితంగా రెండో ఇన్నింగ్‌సలో కివీస్ 235 పరుగులకే ఆలౌటైంది. ఎదురుదాడి చేసిన ల్యూక్ రోంచీ (112 బంతుల్లో 107; 15 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా, వాట్లింగ్ (43) ఫర్వాలేదనిపించాడు. తొలి టెస్టు ఆడే జట్టులో స్థానాన్ని ఆశిస్తున్న మార్టిన్ గప్టిల్ (0) మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు.
లెఫ్టార్మ్ స్పిన్నర్ విశాల్ దభోల్కర్ వేసిన తొలి ఓవర్లోనే అతను డకౌట్‌గా వెనుదిరిగాడు. కివీస్ ఇన్నింగ్‌సలో తొమ్మిది వికెట్లను స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. పరీక్షిత్ వల్సాంగ్‌కర్ 3 వికెట్లు తీయగా, సిద్దేశ్ లాడ్, విజయ్ గోహిల్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు ముంబై తమ తొలి ఇన్నింగ్‌సను 8 వికెట్ల నష్టానికి 464 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
చివరి రోజు ఉదయం 11 ఓవర్లు ఆడిన ముంబై సిద్దేశ్ లాడ్ (99 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ పూర్తికాగానే ఇన్నింగ్స్ ముగించింది. తొలి ఇన్నింగ్‌సలో 140 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై విజయలక్షాన్ని రెండో ఇన్నింగ్‌సలో 9 ఓవర్లలో 96 పరుగులుగా నిర్ణయించారు. అయితే ముంబై బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.