టీమిండియాను ఓడించాలంటే.
.కాన్పూర్:భారత క్రికెట్ జట్టును వారి స్వదేశంలో ఓడించడం అంత ఈజీ కాదని న్యూజిలాండ్ వికెట్ కీపర్ ల్యూక్ రోంచీ అభిప్రాయపడ్డాడు. భారత్ జట్టుతో సుదీర్ఘ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడుతున్న న్యూజిలాండ్ విజయాలు నమోదు చేయాలంటే తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉందన్నాడు. ముంబైతో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్ నుంచి అనేక విషయాలను నేర్చుకున్నట్లు రోంచీ పేర్కొన్నాడు.
' ఆ మ్యాచ్లో మూడో రోజు నుంచి వికెట్లో మార్పు కనిపించింది. ఎక్కువ స్పిన్ను ఎదుర్కొవడం మాకు సవాల్గా అనిపించింది. ముంబై బౌలింగ్లోనూ, బ్యాటింగ్లోనూ ఆకట్టుకుంది. ఆ మ్యాచ్ మాకు ఓ పాఠంలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాఆ సమయంలో మా ప్రణాళికలను కూడా సరిగా అమలు చేయలేకపోయాం. చివరి సెషన్లో మాపై ముంబై జట్టు పైచేయి సాధించింది. ఇక్కడ కొంతవరకూ ప్రతికూలత ఎదురుకాగా, చాలా వరకూ అనుకూలతను చూశాం. భారత్తో జరిగే అతి పెద్ద సిరీస్ జరుగుతుంది. ఇందులో ఎత్తు పల్లాలు అనేవి ఉంటాయి. మా పూర్తిస్థాయి ఆటను ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది'అని రోంచీ పేర్కొన్నాడు.