ప్రపంచంలోనే అత్యధిక ధర గల లగ్జరీ ఫోన్
నోకియా కంపెనీకి చెందిన లగ్జరీ ఫోన్ బ్రాండ్ విర్చూ ప్రపంచంలోనే అత్యధిక ధర గల లగ్జరీ ఆన్‌డ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర అక్షరాల 7వేల డాలర్లపై మాటే. అంటే మన కరెన్సీలో ఈ ఫోన్ ధర 5లక్షల 70వేల రూపాయలు.
ఇంగ్లాండ్‌లోని హామ్షేర్లో ఈ ఫోన్‌ను రూపొందించారు. 5.1 అగుళాల స్ర్కీన్ చుట్ఠూ 100 సఫైర్ క్రిస్టెల్స్తో డిజైన్ చేశారు. అంతేకాదు ఫోన్ బాడీ మొత్తం టైటానియంతో డిజైన్ చేయడం వలన స్టీల్ కంటే గట్టిగా ఉండటమే కాదు. వేయిట్లెస్గా ఉంటుందని కంపెనీ చెపుతోంది. కేవలం లగ్జరీ క్లాస్ వినియోగదారుల కోసమే ఈ ఫోన్‌ను తయారు చేసినట్లు కంపెనీ చెపుతోంది.