రాష్ట్రం నీ అయ్య జాగీరు కాదు: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: ‘సచివాలయాన్ని ఛాతీ ఆసుపత్రికి తరలించి ఆకాశమెత్తు భవనాలు కడ్తడట. ఛాతీ ఆసుపత్రిని వికారాబాద్ పంపిస్తాడట. నీ ఇష్టమొచ్చినట్లు చేయడానికి తెలంగాణ నీ అయ్య జాగీరు కాదు’ అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని వికారాబాద్‌కు తరలించి, సచివాలయాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ టీడీపీ నేతలు సోమవారం ఆసుపత్రిని సందర్శించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు ఆసుపత్రిలో కలియతిరిగారు. వాస్తు దోషం పేరుతో వందల కోట్లు విలాసాలకు ఖర్చు చేస్తున్న కేసీఆర్‌కు ప్రజల ఉసురు తగులుతుందని ఎల్.రమణ ధ్వజమెత్తారు.