నేనే పెద్ద పెప్పర్ స్ప్రేని.. | I am a big pepper Spree, TDP leader motkupalli narsimhulu | Sakshi
Sakshi News home page

నేనే పెద్ద పెప్పర్ స్ప్రేని..

Published Fri, Nov 21 2014 10:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

నేనే పెద్ద పెప్పర్ స్ప్రేని.. - Sakshi

నేనే పెద్ద పెప్పర్ స్ప్రేని..

సమయం ఉదయం 8.30 గంటలు... ప్రాంతం.. బంజారాహిల్స్...కేబీఆర్ పార్కులో వాకింగ్...

సమయం ఉదయం 8.30 గంటలు... ప్రాంతం.. బంజారాహిల్స్...కేబీఆర్ పార్కులో వాకింగ్ ముగించుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్తున్న సమయం. అప్పుడే వాకింగ్ ముగించుకొని బయటికి వస్తున్న టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు ఓ పెప్పర్ స్ప్రే సేల్స్‌మెన్ ఎదురుపడి ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే తీసుకోండి సార్ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేశాడు. అందుకు స్పందించిన మోత్కుపల్లి ‘అరె నాకెందుకురా భయ్ గది... గదేదో ఆ లగడపాటికి ఇచ్చుకో పో... నేనే పెద్ద పెప్పర్ స్ప్రే.. నా జోలికి ఎవరొస్తర్రభయ్’ అంటూ బదులిచ్చాడు. దీంతో అక్కడున్న వాకర్లంతా గొల్లుమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement