పార్కులో ఏర్పాటు చేసిన బోర్డు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని కేబీఆర్ పార్కును కేవలం వాకింగ్‌కు మాత్రమే వినియోగించుకోవాలని... ఇక్కడ రన్నింగ్, జాగింగ్ చేయరాదంటూ జిల్లా అటవీ శాఖాధికారి సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. ఈ మేరకు పార్కు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నోటీసు బోర్డులో రన్నింగ్, జాగింగ్‌ను నిషేధించినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 3వేల మందికి పైగా, సాయంత్రం 1500 మందికి పైగా వాకర్లు పార్కులో వాకింగ్ చేస్తుంటారు.
అయితే ఇటీవల కాలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులను ట్రైనర్లుగా నియమించుకొని పార్కులో రన్నింగ్, జాగింగ్ చేస్తున్నారు. దీంతో అసలే ఇరుగ్గా ఉండే వాకింగ్ ట్రాక్‌పై వాకర్లకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ పార్కులో వెయ్యి మందికి పైగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తుంటారు. వేగంగా పరుగెత్తుకొస్తున్న వారితో వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొన్నిసార్లు పరుగెత్తుకొస్తున్న వారు పొరపాటున వీరికి తగులుతుండడంతో కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీనియర్ సిటిజన్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాగింగ్, రన్నింగ్‌ను అధికారులు నిషేధించారు.
Comments
Please login to add a commentAdd a comment