m venkayyanayudu
-
‘న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు 3 కోట్లకు పైగానే’
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు పెరిగిపోతున్న అపరిష్కృత (పెండింగ్) కేసుల విషయంలో ప్రభుత్వంతోపాటు, కోర్టులు, న్యాయ మంత్రిత్వ శాఖలు దృష్టిసారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని స్థాయిల్లో 3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండటం విచారకరమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయకళాశాల (ఆంధ్రయూనివర్సిటీ) 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వెబినార్‌లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసులపై ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల సంఖ్య పెరుగుతున్నందున కీలకమైన కేసుల్లో తీర్పు కూడా ఆలస్యమవుతోందన్నారు. తద్వారా సామాన్యులకు న్యాయప్రక్రియ చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అన్న మాటను ప్రస్తావిస్తూ.. కొన్ని సందర్భాల్లో అనవసరంగా కేసులను పొడగించడం, వాయిదా వేయడం జరుగుతోందని చెప్పారు. ఈ విషయంపై న్యాయవాదులతోపాటు ఈ రంగంతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముందన్నారు. (ఆ రెండు యాప్‌లు ప్లే స్టోర్ నుంచి మాయం! ) దీంతోపాటు క్లిష్టమైన చట్టాలను సరళీకృతం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. వినియోగంలో లేని 1600కు పైగా చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని గుర్తుచేశారు. చట్టాల రూపకల్పన కూడా నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా, స్పష్టంగా ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) ఇటీవల ప్రయివేటు (వ్యక్తిగత) ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. దీని వల్ల న్యాయస్థానాల విలువైన సమయాన్ని వ్యర్థం చేసినట్లే అవుతుందన్నారు. సమాజంలోని పేద, అణగారినవర్గాలకు న్యాయపరమైన సహాయం చేయాలని, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషిచేయాలని లా విద్యార్థులకు, యువ న్యాయవాదులకు ఉపరాష్ట్రపతి సూచించారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో న్యాయవాదుల పాత్ర కీలకమనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ టి.రజని, జస్టిస్ బట్టు దేవానంద్, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి సహా పలువురు న్యాయకోవిదులు, న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు పాల్గొన్నారు. (‘ముంబై మానవత్వం కోల్పోయింది’) -
జైట్లీ సంస్కరణలు ప్రశంసనీయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ హితాన్ని తన ప్రథమ కర్తవ్యంగా భావించి చివరిదాకా అదే సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అరుణ్ జైట్లీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఉపరాష్ట్రపతి నివాసంలో ‘ద రినైసన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. తర్వాత వెంకయ్య మాట్లాడారు. ‘జైట్లీ దశాబ్దాలుగా నాకు ఆత్మీయ మిత్రుడు. ముఖ్యమైన సమయాల్లో ఆయన విలువైన సూచనలు ఇచ్చేవారు. అలాంటి జైట్లీ ఇకలేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నా’అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన జైట్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కలుపుకొని ఏకాభిప్రాయ సాధనతో కీలకమైన జీఎస్టీ వంటి పన్ను సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు. పుస్తకాన్ని వెంకయ్య కొడుకు హర్షవర్ధన్, కూతురు దీప తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జైట్లీ భార్య సంగీత, లోక్‌సభ స్పీకర్ బిర్లా, కేంద్ర మంత్రి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు. -
సంపన్న దేశాల సరసన భారత్
యూత్రాజీనీ క్యాబ్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి వెంకయ్య వెంకటాచలం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ సంపన్నదేశాల సరసన చేరనుందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కోమిట్ల బస్సు సర్వీస్ వారి యూత్రాజీనీ క్యాబ్‌ను కాకుటూరులోని హర్షా టయోటా షోరూం ఆవరణలో శనివారం రాత్రి ప్రారంభించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంపదను సృష్టించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. మహానగరాల తరహాలో నెల్లూరు వాసులకు కోమిట్ల సంస్థ క్యాబ్‌లను అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. ప్రయూణికుల భద్రతపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యూదవ్ మాట్లాడుతూ మెట్రో సిటీలకే పరిమితమైన క్యాబ్‌ను నెల్లూరు వాసులకు అందుబాటులోకి తెస్తున్న కోమిట్ల సంస్థ నిర్వాహకులు అభినందనీయులన్నారు. బస్సు సర్వీసుల నిర్వహణలో అగ్రగామిగా నిలిచిన కోమిట్ల క్యాబ్‌ల ద్వారా కూడా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో సేవలు అందించాలన్నారు. రూరల్ ప్రాంతంలో పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధికి కోమిట్ల సంస్థ సహకరించాలన్నారు. కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, కోమిట్ల సంస్థ ప్రతినిధులు సత్యనారాయణరెడ్డి, రమ, హర్ష టయోటా అధినేత ముప్పవరపు హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.