సంపన్న దేశాల సరసన భారత్
యూత్రాజీనీ క్యాబ్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి వెంకయ్య
వెంకటాచలం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ సంపన్నదేశాల సరసన చేరనుందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కోమిట్ల బస్సు సర్వీస్ వారి యూత్రాజీనీ క్యాబ్‌ను కాకుటూరులోని హర్షా టయోటా షోరూం ఆవరణలో శనివారం రాత్రి ప్రారంభించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంపదను సృష్టించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. మహానగరాల తరహాలో నెల్లూరు వాసులకు కోమిట్ల సంస్థ క్యాబ్‌లను అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు.
ప్రయూణికుల భద్రతపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యూదవ్ మాట్లాడుతూ మెట్రో సిటీలకే పరిమితమైన క్యాబ్‌ను నెల్లూరు వాసులకు అందుబాటులోకి తెస్తున్న కోమిట్ల సంస్థ నిర్వాహకులు అభినందనీయులన్నారు. బస్సు సర్వీసుల నిర్వహణలో అగ్రగామిగా నిలిచిన కోమిట్ల క్యాబ్‌ల ద్వారా కూడా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో సేవలు అందించాలన్నారు. రూరల్ ప్రాంతంలో పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధికి కోమిట్ల సంస్థ సహకరించాలన్నారు. కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, కోమిట్ల సంస్థ ప్రతినిధులు సత్యనారాయణరెడ్డి, రమ, హర్ష టయోటా అధినేత ముప్పవరపు హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.