Wealthy countries
-
సంపన్నుల వలసబాట.. ఆ దేశాలకే ఎందుకు?
భద్రమైన జీవితాన్ని వెతుక్కుంటూ ఎంతోమంది భారతీయ సంపన్నులు విదేశాలకు పయనమవుతున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. మెరుగైన శాంతిభద్రతలు, కాలుష్యానికి తావులేని చక్కటి వాతావరణం, సంపదపై తక్కువ పన్నులు వారిని ఆకర్శిస్తున్నాయి. ఈ ఏడాది భారత్ నుంచి 6,500 మంది అత్యంత సంపన్నులు విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును విశ్లేషించే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్–2023 తాజాగా వెల్లడించింది. 2022లో భారత్ నుంచి 7,500 మంది ధనవంతులు విదేశాలకు వెళ్లి స్థిరపడినట్లు అంచనా. ► మిలియన్ డాలర్లు(రూ.8.2 కోట్లు), అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల సంపద ఉన్నవారిని అల్ట్రా రిచ్(హెచ్ఎన్డబ్ల్యూఐ)గా పరిగణిస్తారు. ► శాశ్వతంగా స్థిరపడడానికి సంపన్నులను విశేషంగా ఆకర్షిస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ► ఇక 2023లో చైనా, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్(యూకే), రష్యా, బ్రెజిల్ నుంచి ఎక్కువ మంది ధనవంతులు విదేశాలకు వెళ్తారని అంచనా వేస్తున్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధక సంస్థ చీఫ్ ఆండ్రూ ఆమోయిల్స్ చెప్పారు. ► భారత్ నుంచి మిలియనీర్లు వెళ్లిపోతున్నా పెద్దగా నష్టం లేదని, దేశంలో అంతకంటే ఎక్కువ మంది మిలియనీర్లు తయారవుతారని ఆమోయిల్స్ తెలిపారు. ► ఈ ఏడాది చైనా నుంచి 13,500 మంది ధనికులు వలస వెళ్తారని అంచనా. ► 2022 ఆఖరు నాటికి టాప్–10 ధనిక దేశాల జాబితాలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ దేశాలు మొదటి 9 స్థానాలో ఉన్నాయి. ► భారత్‌లో మొత్తం జనాభా 142 కోట్లు కాగా, వీరిలో 3,44,600 మంది అల్ట్రా రిచ్(మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అస్తి), 1,078 మంది సెంటి–మిలియనీర్లు(100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి), 123 మంది బిలియనీర్లు(బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తి) ఉన్నారు. ► చైనా జనాభా 141 కోట్లు కాగా, వీరిలో 7,80,000 మంది అల్ట్రా రిచ్, 285 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికా జనాభా 34 కోట్లు కాగా, వీరిలో 52,70,000 మంది అల్ట్రా రిచ్, 770 మంది బిలియనీర్లు ఉన్నారు. అనువైన దేశం కోసం అన్వేషణ ► విదేశాలకు వలస వెళ్లడానికి సంపన్నులు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రాజకీయ స్థిరత్వం, తక్కువ పన్నుల విధానం, వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ► ఆరోగ్యకరమైన జీవనం సాగించేందుకు అనువైన దేశం కోసం అన్వేషిస్తున్నారు. ► పిల్లలకు నాణ్యమైన చదువులు, వైద్య సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందాలని కోరుకుంటున్నారు. ► తమ సంపదకు, ఆస్తులకు రక్షణ కల్పించే దేశాన్ని ఎంచుకుంటున్నారు. ► చట్టబద్ధ పాలన ఉండడంతోపాటు ఆర్థిక స్వేచ్ఛకు హామీ ఇచ్చే దేశాలకు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ► ప్రైవేట్ సంపద వెళ్లిపోవడం దేశాలకు నష్టదాయకమేనని నిపుణులు చెబుతున్నారు. ► భారత్‌లో పన్ను నిబంధనలు కఠినంగా ఉండడంతో ధనవంతులు తమ డబ్బును విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నల్ల ధనవంతుల గుట్టురట్టు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) ఆదివారం బహిర్గతం చేసింది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద లీక్ అని భావిస్తున్నారు. వీరిలో భారతదేశానికి చెందిన బడా బాబులు ఉండడం గమనార్హం. ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించిన 12 మిలియన్ల (1.20 కోట్లు) పత్రాలను తాము సేకరించినట్లు ఐసీఐజే వెల్లడించింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ తదితర దేశాల్లో వారు నల్ల ధనాన్ని దాచుకోవడానికి, రహస్యంగా ఆస్తులు పోగేసుకోవడానికి డొల్ల కంపెనీలను సృష్టించారని తెలిపింది. వీరిలో అమెరికా, ఇండియా, పాకిస్తాన్, యూకే, మెక్సికో తదితర దేశాలకు చెందినవారు ఉన్నారని స్పష్టం చేసింది. ► జోర్డాన్ రాజు, ఉక్రెయిన్, కెన్యా, ఈక్వెడార్ దేశాల అధ్యక్షులు, చెక్ రిపబ్లిక్ ప్రధాని, యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ఆస్తులు, ఆర్థిక వ్యవహారాల వివరాలు పండోరా పత్రాల్లో ఉన్నాయి. ► పండోరా లీక్డ్ డాక్యుమెంట్లలో 300 మందికిపైగా భారతీయుల వివరాలున్నాయి. వీరిలో చాలామంది ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలే కావడం విశేషం. వీరు ఇప్పటికే దర్యాప్తు సంస్థల నిఘా పరిధిలో ఉన్నారు. ► ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 18 దేశాల్లో ఆస్తులు ఉన్నట్లు వార్తలొచ్చాయి. ► బయోకాన్ సంస్థ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా భర్త ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేశాడు. భారత్‌లో బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరి ట్రస్టును ఏర్పాటు చేసింది. అతడు పారిపోవడానికి నెల రోజుల ముందు ఈ ట్రస్టును నెలకొల్పారు. ► 2016లో వెలుగులోకి వచి్చన పనామా పేపర్ల లీకు తర్వాత నల్ల ధనవంతులు అప్రమత్తమయ్యారు. విదేశాల్లోని తమ ఆస్తులపై నిఘా సంస్థల కన్ను పడకుండా పునర్వ్యస్థీకరించుకున్నారు. అంటే ఆస్తులను చాలావరకు అమ్మేసుకొని, నగదుగా మార్చుకున్నారు. వీరిలో మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. ► జోర్డాన్ రాజు అబ్దుల్లా2 అమెరికా, యూకేలో 10 కోట్ల డాలర్ల ఆస్తులను కూడబెట్టాడు.. ► పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు, ఆయన కేబినెట్ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయి. ► ఇమ్రాన్ ఖాన్ మిత్రుడు, పీఎంల్–క్యూ పార్టీ నేత చౌదరి మూనిస్ ఎలాహీకి అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంది. ► రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మొనాకోలో ఖరీదైన ఆస్తులున్నాయి. ► యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిన్, ఆయన భార్య లండన్‌లో కార్యాలయం కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో 3,12,000 పౌండ్ల మేర స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టారు. ఐసీఐజే ట్వీట్ తాము సేకరించిన 1.2 కోట్ల పత్రాల ఆధారంగా సంపన్నుల ఆర్థిక రహస్యాలను బహిర్గతం చేస్తామని ఐసీఐజే ఆదివారం ఉదయం ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లో 600 మందికిపైగా పాత్రికేయులు ఈ ‘పండోరా పత్రాలను’సేకరించారని వెల్లడించింది. ఎంతో శ్రమించి పరిశోధన సాగించారని, ధనవంతుల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక రహస్యాలను తెలుసుకున్నారని వివరించింది. -
టీకా డోసుల్లో అగ్రభాగం సంపన్న దేశాలకే
న్యూయార్క్ : సంపన్న దేశాలు కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా త్వరలో రానున్న కరోనా వైరస్ 100 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోస్‌లను తమ దేశాల కోసం బుక్ చేసుకున్నారు. దీంతో మిగిలిన ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని తరిమికొట్టడంలో వెనుకబడిపోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ దిశగా అమెరికా, బ్రిటన్, సనోఫి, గ్లాక్సో స్మిత్క్లైన్ల నుంచి ఈ డోస్‌లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. అలాగే జపాన్, ఫైజర్లతో కూడా ఈ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వ్యాక్సిన్‌ని సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులో ఉంచుతామని అంతర్జాతీయ సంస్థలు, దేశాలు హామీ యిస్తున్నాయి. అయితే 780 కోట్ల ప్రపంచ జనాభా అంతటికీ ఈ డోస్‌లన్నీ సరఫరా చేయగలుగుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2009లో స్వైన్ ఫ్లూ ప్రబలినప్పుడు కూడా సంపన్న దేశాలు భారీ స్థాయిలో టీకా సరఫరాను తమ అధీనంలో ఉంచుకోవడం పేదదేశాలను ఆందోళనలోకి నెట్టింది. లండన్‌కి చెందిన ఎయిర్‌ఫీనిటీ సంస్థ అంచనా ప్రకారం 130 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, జపాన్‌లు ఇప్పటికే కొనుగోలు చేశాయి. ప్రపంచం మొత్తానికి సరిపడిన వ్యాక్సిన్లను తక్షణం సరఫరా చేయడం కష్టంతో కూడుకున్నపనేనని ఆ సంస్థ తెలిపింది.(కోవిడ్‌కు చికిత్స లేకపోవచ్చు: డబ్ల్యూహెచ్‌వో) -
సంస్కరణలతోనే ఐరాసపై నమ్మకం
-
సంస్కరణలతోనే ఐరాసపై నమ్మకం
* సవాళ్లను ఎదుర్కోవాలంటే ఐరాస శక్తిమంతం కావాలి * సంస్కరణలు తప్పనిసరి..పేదరికాన్ని నిర్మూలిస్తేనే సుస్థిర అభివృద్ధి * టెక్నాలజీని సంపన్న దేశాలు ఇతరులకు పంచాలి * ఉద్గారాల తగ్గింపులో సంపన్న దేశాలు తమ బాధ్యతలను నెరవేర్చాలి * ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశంలో ప్రధాని మోదీ న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలను అమలు చేస్తేనే దానికి విశ్వసనీయత కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరాస ఏర్పడిన కాలం నాటి పరిస్థితులకు, ఊహించని స్థాయిలో ప్రపంచం మారిపోయిన నేటి పరిస్థితులకు చాలా తేడా ఉందని.. ఈ నేపథ్యంలో సంస్కరణలు తప్పనిసరి అని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 70వ భేటీలో మోదీ కీలక ప్రసంగం చేశారు. ‘‘ఈరోజు మనం ఒక కొత్త దిశానిర్దేశాన్ని నిర్ణయించటానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రస్తుతం ప్రపంచంలోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థ అయిన ఐరాస శక్తిమంతం కావలసిన అవసరం ఉంది. ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి సమర్థమైన వ్యవస్థగా ఐరాస పునర్వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది’’ అని మోదీ స్పష్టం చేశారు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం చాలాకాలంగా భారత్ పోటీ పడుతున్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. వాతావరణ మార్పు, సుస్థిరమైన అభివృద్ధి అనేవి ప్రపంచ దేశాలన్నింటి సమష్టి బాధ్యత అని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క దేశం కూడా ఎలాంటి ముప్పునూ ఎదుర్కోవటానికి వీల్లేదని ఆయన అన్నారు. పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలు కలసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచంలో 130 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారని, వీరిని అందులోంచి బయటకు తీసుకురావటం కోసం సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలన్నారు. వాతావరణ మార్పుల విషయంలో ఉమ్మడి బాధ్యతతో పాటు తమ వంతు కర్తవ్యాన్ని కూడా నిర్వహించాలని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ బాధ్యతను నెరవేర్చాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, సృజన, అర్థ వ్యవస్థలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో నిస్వార్థంగా పంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘నేను భూమిని తల్లిగా భావించే ఉన్నత సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఆ భూమిని మనం అంతా పిల్లలమని భావిస్తాం. అంతే కాదు.. ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని(వసుధైక కుటుంబం) భావించే సమాజం మాది. అందుకే ప్రతి చిన్న చిన్న ద్వీప దేశాలతో కూడా అభివృద్ధిలో భాగస్వాములమవుతున్నాం. ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నా’’ అని మోదీ సర్వప్రతినిధి సభ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇందుకోసమే తాను ‘నీలి విప్లవా’న్ని సమర్థిస్తున్నానని ఆయన అన్నారు. ‘నీరు కలుషితం కావద్దు. ద్వీప దేశాల రక్షణ, అభివృద్ధి జరగాలి.. ఆకాశం నీలంగా స్వచ్ఛంగా ఉండాలి...ఇదే నీలి విప్లవం’ అని మోదీ చెప్పారు. ఐరాస సర్వప్రతినిధి సభ శుక్రవారం ఆమోదించిన ‘2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’ను ప్రస్తావిస్తూ.. భారత లక్ష్యాలు ఈ డ్రాఫ్ట్‌కు అద్దం పడుతున్నాయని చెప్పారు. అభివృద్ధి వికాసంలో వ్యక్తిగత రంగం ప్రపంచంలో ఆర్థిక వికాస చర్చ జరిగిన ప్రతిసారీ ప్రభుత్వ, ప్రయివేటు రంగాల గురించి మాత్రమే చర్చ జరుగుతూ ఉంటుందని.. భారత్‌లో తాము మాత్రం కొత్తగా పర్సనల్ సెక్టార్(వ్యక్తిగత రంగం)ను కొత్తగా ప్రవేశపెట్టామని మోదీ తెలిపారు. వ్యక్తిగత పరిశ్రమల స్థాపన, స్టార్ట్అప్లను ప్రోత్సహించటం.. ప్రతి ఒక్కరికీ, నివాసం, విద్యుత్తు, నీరు, వంటి వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో అందించడానికి పనిచేస్తున్నామన్నారు. పేదరిక నిర్మూలనకు అనేక పథకాలు.. భారత దేశంలో సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టామని మోదీ వివరించారు. పేదరికాన్ని ఓడించటానికి పేదలకు విద్య, నైపుణ్యాన్ని అందించటం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. 180 లక్షల బ్యాంకు ఖాతాలను భారత్‌లో పేదలు తెరిచారని, ప్రభుత్వం అందించే ఫలాలు నేరుగా వారి ఖాతాల్లోకి చేరుతున్నాయన్నారు. పేదల కోసం బీమా, పింఛను ప్రయోజనాలను అందిస్తున్నామని తెలిపారు. మహిళల సాధికారత కోసం బేటీ బచావ్, బేటీ పడావ్, మార్కెటింగ్‌లో రైతులకు ప్రయోజనాలను కల్పించటం కోసం కృషి చేస్తున్నామన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ఐరాస ఆమోదం న్యూయార్క్: వచ్చే 15 ఏళ్లలో పేదరికం, ఆకలి నిర్మూలన, లింగ సమానత్వం తదితరాలతో కూడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ)లకు ఐక్యరాజ్య సమితి శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ‘మన ప్రపంచాన్ని మార్చడం.. సుస్థిర అభివృద్ధి-2030 లక్ష్యాల ఎజెండా కొత్త ముసాయిదాను సర్వ ప్రతినిధి సభ ఆమోదించింది. ఇందులో 17 లక్ష్యాలు, 169 గమ్యాలు ఉన్నాయి. ఇది సంపద పంపకం, శాంతి స్థాపనకు పిలుపని ఐరాస చీఫ్ బాన్‌కి మూన్ అన్నారు. అంతకు ముందు మోదీ.. మూన్తో భేటీ అయ్యారు. -
సంపన్న దేశాల సరసన భారత్
యూత్రాజీనీ క్యాబ్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి వెంకయ్య వెంకటాచలం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ సంపన్నదేశాల సరసన చేరనుందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. కోమిట్ల బస్సు సర్వీస్ వారి యూత్రాజీనీ క్యాబ్‌ను కాకుటూరులోని హర్షా టయోటా షోరూం ఆవరణలో శనివారం రాత్రి ప్రారంభించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంపదను సృష్టించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. మహానగరాల తరహాలో నెల్లూరు వాసులకు కోమిట్ల సంస్థ క్యాబ్‌లను అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. ప్రయూణికుల భద్రతపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యూదవ్ మాట్లాడుతూ మెట్రో సిటీలకే పరిమితమైన క్యాబ్‌ను నెల్లూరు వాసులకు అందుబాటులోకి తెస్తున్న కోమిట్ల సంస్థ నిర్వాహకులు అభినందనీయులన్నారు. బస్సు సర్వీసుల నిర్వహణలో అగ్రగామిగా నిలిచిన కోమిట్ల క్యాబ్‌ల ద్వారా కూడా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో సేవలు అందించాలన్నారు. రూరల్ ప్రాంతంలో పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధికి కోమిట్ల సంస్థ సహకరించాలన్నారు. కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, కోమిట్ల సంస్థ ప్రతినిధులు సత్యనారాయణరెడ్డి, రమ, హర్ష టయోటా అధినేత ముప్పవరపు హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.