మెయ్జు ఎం5 స్మార్ట్ఫోన్ లాంచ్..ధర?
సుదీర్ఘ విరామం తర్వాత మెయ్జు తన నూతన స్మార్ట్ఫోన్ 'ఎం5' ను విడుదల చేసింది. భారత మార్కెట్ లో దీని ధరను రూ.10,499 లుగా కంపెనీ ప్రకటించింది. బ్లూ, షాంపైన్ గోల్డ్ కలర్ వేరియంట్లలో టాటాసిలిక్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. అలాగే 2జీబీ, 3 జీబీ వేరియంట్లలో అక్టోబర్ లో చైనాలో లాంచ్ చేసిననప్పటికీ 3 జీబీ ఎంను మాత్రమే ప్రస్తుతం భారత్ లో లాంచ్ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్బట్, హోమ్ బటన్ క్రింద అమర్చింది. పాలీ కార్బోనేట్బాడీతో డిజైన్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ లో కుడి అంచున పవర్ , వాల్యూమ్ బటన్లను, 3.5 ఎంఎ ఆడియో జాక్, స్పీకర్లు, చార్జింగ్ పోర్ట్ కిందిభాగాన పొందుపర్చింది. ఇక మిగిలిన స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
మెయ్జు ఎం5 ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
3 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.0 ఎల్ఈ
3070 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
చైనాలో లాంచ్ చేసిన చాలా తక్కువ సమయంలోనే దీన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టామని మొయిజు సౌత్ ఆసియా మార్కెటింగ్ హెడ్ లియాన్ జాంగ్ ప్రకటించింది. కీలక మార్కెట్ గా ఉన్న భారతకు మంచి ఆదరణ లభిస్తోందని ఈ నేపథ్యంలో కొన్ని నెలల కాలంలోనే దీన్ని భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామన్నారు.