MA Degree
-
ఇందులో తక్కువ కులం ఏది? ప్రశ్నాపత్రంపై తీవ్ర దుమారం
చెన్నై: తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో ఓ ప్రశ్నాపత్రంలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం తీవ్ర దుమారం రేపింది. ఎంఏ హిస్టరీ మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్ష గురువారం జరిగింది. అయితే ప్రశ్నాపత్రంలో 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న వచ్చింది. జవాబు ఎంచుకునేందుకు నాలుగు కులాల పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. 'ఫ్రీడం మూవ్మెంట్ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947' అనే సబ్జెక్టు పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ ప్రశ్న ఎదురైంది. Tamil Nadu | 1st-year MA History students of Periyar University in Salem got asked in the exam, "Which one is the lower caste that belongs to Tamil Nadu?" with 4 options mentioning different castes pic.twitter.com/kdJxQrMo5R — ANI (@ANI) July 15, 2022 అయితే పరీక్షలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం వివాదాస్పదమైంది. దీనిపై పెరియార్ యూనివర్సిటీ ఉప కులపతి జగన్నాథన్ స్పందించారు. సమాజంలో అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదని, వేరే యూనివర్సిటీ సిబ్బంది రూపొందించారని జగన్నాథన్ తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్ కాకూడదనే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష జరిగే వరకు ప్రశ్నాపత్రాన్ని ఎవరూ చూడలేదని, అందులోని వివాదాస్పద ప్రశ్న గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. చదవండి: పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..? -
మోదీ ఎంఏ వివరాలు వెల్లడించలేరట!
గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేయడం నిజమేనా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి ఆర్టీఐ యాక్టివిస్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మోదీ పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేసినట్టు తానే స్వయంగా అఫిడవిట్లలో పేర్కొనడం, ఆయన 1981 నుంచి 1984 మధ్య గుజరాత్ యూనివర్శిటీలో చదివి మాస్టర్ డిగ్రీ తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలియజేస్తున్న నేపథ్యంలో....1981-1984 మధ్య మాస్టర్ డిగ్రీలు తీసుకున్న విద్యార్థుల వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతూ పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ ఆర్టీఐ కార్యకర్త గుజరాత్ యూనివర్శిటీకి దరఖాస్తు చేశారు. 2005 నాటి ఆర్టీఐ చట్ట ప్రకారం ఈ వివరాలు వెల్లడించలేమంటూ యూనివర్శిటీ నుంచి సదరు దరఖాస్తుదారునికి ఏకవాక్య సమాధానం వచ్చింది. ప్రధాన మంత్రి మోదీ మాస్టర్ డిగ్రీ వివరాలు కావాలంటూ నేరుగా అడిగితే ఇవ్వకపోవచ్చని, పైగా తనను టార్గెట్ చేయవచ్చనే ఉద్దేశంతోనే మోదీ చదివిన కాలానికి చెందిన విద్యార్ధుల వివరాలు అడగాల్సి వచ్చిందని ఆర్టీఐ కార్యకర్త స్థానిక మీడియాకు వివరించారు. మరో ఆర్టీఐ కార్యకర్త మోదీ విద్యాభ్యాస వివరాలు కావాలంటూ ఆర్టీఐ చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరగా, వివరాలు వెల్లడించేందుకు నిరాకరించిన విషయం తెల్సిందే. మోదీ మంత్రివర్గంలోని స్మృతి ఇరాని డిగ్రీపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కొంత మందికి మోదీ డిగ్రీలపై కూడా అనుమానాలు వచ్చాయి. వాటిని ధ్రువీకరించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఫలితం ఉండడం లేదు.