Machil Sector
-
నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరోసారి భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటన ప్రాంతంలో నుంచి 3 ఏకే 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం మాంచిల్ సెక్టార్లో చోటు చేసుకుంది. ఇటీవల నియంత్రణ రేఖ ద్వారా పలువురు ఉగ్రవాదులు పలు గ్రామాల్లోకి చొరబడి పోలీసుల, సైనికుల కుటుంబాలను లక్ష్యంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో వారిని ఏరివేసే చర్యల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం మాంచిల్ సెక్టార్లోకి ఉగ్రవాదుల అలికిడి ఉన్నట్లు వారికి సమాచారం అందడంతో వారిని వెతికే క్రమంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ప్రస్తుతం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. -
కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల హతం
* చొరబాటు యత్నం భగ్నం * ఎన్కౌంటర్లో జవాను మృతి శ్రీనగర్: కశ్మీర్లోని కుప్వారా జిల్లా సరిహద్దు రేఖ సమీపంలోని తంగ్ధార్ సెక్టార్లో గురువారం మిలిటెంట్లు భారత్లోకి చొరబడేందుకు యత్నించగా సైనికులు భగ్నం చేశారు. ఈ ఆపరేషన్లో నలుగురు మిలిటెంట్లు హతం కాగా, ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మిలిటెంట్ల అక్రమ చొరబాటు యత్నాన్ని భగ్నం చేయడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. మంగళవారం కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్లో ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు యత్నించగా జవాన్లు భగ్నం చేశారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్లో ఒక మిలిటెంట్ హతం కాగా, ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు.