సెలవులు తీసుకోవాల్సిందే.. ఈ కంపెనీ పెట్టిన రూల్ భలే ఉందే!
సాధారణంగా ఉద్యోగులు తమ యాజమాన్యాలు ఎన్ని సెలవులిస్తే అంత మేలని భావిస్తుంటారు. కానీ కొందరుంటారు.. అస్సలు లీవ్స్ తీసుకోరు. ఏడాదంతా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసేవారూ ఉన్నారు. అయితే ఈ స్టార్టప్ కంపెనీలో సెలవులు పెట్టకుండా పనిచేస్తామంటే కుదరదు.
యునైటెడ్ స్టేట్స్కు చెందిన గో నింబ్లీ అనే స్టార్టప్ తమ సంస్థలో నూతన సెలవు విధానాన్ని అవలంబించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రతి సంవత్సరం కనీసం 20 సెలవులు తీసుకోవడం తప్పనిసరి.
సంస్థ ఉద్యోగులు చాలా కాలంగా లీవ్‌లకు సంబంధించి మరింత అనువైన ప్లాన్ కోసం అభ్యర్థిస్తున్నారని, వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటూ కంపెనీ రూపొందించిన సెలవుల విధానాన్ని గురించి తెలియ జేస్తూ గో నింబ్లీ కంపెనీ పీపుల్ ఆపరేషన్స్ డైరెక్టర్ కైల్ లాసీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. కొత్త విధానం పర్యవసానంగా గత త్రైమాసికంతో పోల్చితే సెలవుల వినియోగం 19 శాతం పెరిగిందని తెలిపారు.
కొత్త విధానంలోని ముఖ్యాంశాలు
ఒక ఉద్యోగి సంవత్సరానికి తీసుకోవలసిన కనీస సెలవుల సంఖ్య 20 రోజులు
నూతన సెలవు విధానానికి అనుగుణంగా ఇన్సెంటివ్ ప్లాన్.
ఉద్యోగుల సెలవులను పర్యవేక్షించడానికి ప్రత్యేక సిబ్బంది నియామకం
పేరెంటెల్ లీవ్స్ కోసం ప్రత్యేక విధానం
ఇదీ చదవండి: లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది?