madhava naidu
-
మహిళలను గెంటివేయించిన ఎమ్మెల్యే
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో
విజయనగరం : విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కలువరాయి వీఆర్వో మాధవనాయుడు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు మాధవనాయుడును పట్టుకున్నారు. అనంతరం అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. -
టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి
టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మాధవనాయుడు ప్రయాణిస్తున్న కారు మూలపాడు వద్దకు వచ్చేసరికి బైకు మీద వెళ్తున్న తానబోయిన బాబూరావును ఢీకొట్టింది. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఎమ్మెల్యే మాధవనాయుడు.. గొల్లపూడిలోని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి, కాసేపు అక్కడ కూర్చుని మంత్రి అనుచరులతో మాట్లాడి వెళ్లారు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కౌన్సిలర్లపై ఎమ్మెల్యే దౌర్జన్యం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవనాయుడు దౌర్జన్యానికి దిగారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. అకారణంగా పింఛను లబ్ధిదారుల పేర్లు తొలగిస్తున్నారంటూ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపై ఎమ్మెల్యే మాధవనాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాంతో ఎమ్మెల్యేతో మహిళలు, కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దాంతో కౌన్సిలర్లను ఎమ్మెల్యే పోలీసులతో బయటకు నెట్టేయించారు. ఎమ్మెల్యే మాధవనాయుడు ప్రవర్తించిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పారట్ఈ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు అందాల్సిన పింఛన్ల గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో వినతిపత్రం ఇవ్వడం కూడా తప్పేనా అంటూ నిలదీశారు.