టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మాధవనాయుడు ప్రయాణిస్తున్న కారు మూలపాడు వద్దకు వచ్చేసరికి బైకు మీద వెళ్తున్న తానబోయిన బాబూరావును ఢీకొట్టింది. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఎమ్మెల్యే మాధవనాయుడు.. గొల్లపూడిలోని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి, కాసేపు అక్కడ కూర్చుని మంత్రి అనుచరులతో మాట్లాడి వెళ్లారు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి
Published Fri, Oct 31 2014 7:12 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement