పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవనాయుడు దౌర్జన్యానికి దిగారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవనాయుడు దౌర్జన్యానికి దిగారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. అకారణంగా పింఛను లబ్ధిదారుల పేర్లు తొలగిస్తున్నారంటూ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపై ఎమ్మెల్యే మాధవనాయుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
దాంతో ఎమ్మెల్యేతో మహిళలు, కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దాంతో కౌన్సిలర్లను ఎమ్మెల్యే పోలీసులతో బయటకు నెట్టేయించారు. ఎమ్మెల్యే మాధవనాయుడు ప్రవర్తించిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పారట్ఈ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు అందాల్సిన పింఛన్ల గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో వినతిపత్రం ఇవ్వడం కూడా తప్పేనా అంటూ నిలదీశారు.