అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగకు 15 రోజుల రిమాండ్
ధర్మవరం అర్బన్ : అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డికి ధర్మవరం కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డిని పదిరోజుల క్రితం చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డి ధర్మవరంలో 2013 అక్టోబర్ 11న చంద్రబాబునగర్‌కు చెందిన ప్రమీలమ్మను హత్య చేసి, ఆమె వద్దనున్న రెండు ఏటీఎంలు, జత కమ్మలు ఎత్తుకెళ్లాడు. అప్పట్లో హత్య కేసు నమోదైంది.
ఆ హత్య కేసుకు సంబంధించి పట్టణ సీఐ హరినాథ్ తమకు అగించాలని పిటీష¯ŒS వేసి మధుకర్‌రెడ్డిని ధర్మవరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఐ హరినాథ్ మాట్లాడుతూ ధర్మవరంలో ఏటీఎంలో దొంగతనం, హత్య కేసులో మధుకర్‌రెడ్డి ప్రధాన నిందితుడని తెలిపారు. మధుకర్‌రెడ్డిని ధర్మవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామని, న్యాయమూర్తి ఈనెల 27వతేదీ వరకు అతనికి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.