మాగబెట్టిన పండ్లు ఆరోగ్యానికి హానికరం!
రైతులు పండ్ల తోటలు పెంపొందించాలి
ఆహార పంటలపై దష్టి సారించాలి
అగ్రి బిజినెస్ డైరెక్టర్ సాంబశివరావు
కెరమెరి : రసయానాలతో మాగ బెట్టిన పండ్లు తింటే ఆరోగ్యానికి హానికరమని సమగ్ర అగ్రి బిజినెస్ డైరెక్టర్ సీ సాంబశివరావు అన్నారు. గురువారం మండలంలోని ఐకేపీ కార్యాలయంలో సమగ్ర అగ్రి బిజినెస్ హైదరాబాద్, నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చైన్(ఎన్సీసీడి) వ్యవసాయ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తతం ప్రతీ రైతు ఆర్థిక పంటలను పండించడం వల్ల తీవ్రంగా నష్ట పోయే ప్రమాదం ఉందని, అందుకు తనకున్న పొలంలో కొంతైనా సరే మామిడి, అరటి, బొప్పాయి, సీతాఫల్ తదితర పంటలను పండించాలన్నారు.
వ్యాపారస్తులు, రైతులు ఎగుమతి, దిగుమతి దారులు సహజంగా కార్బైడ్ వంటి రసాయాన పదార్థాలు ఉపయోగించి మాగ బెట్టడంజరుగుతోందని ఈ ప్రక్రియతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. దీని వల్ల కొన్ని రోజులకే కుల్లి పోవడం, అనేక తీవ్రమైన ఆరోగ్య నష్టాలు జరుగుతాయన్నారు. ప్రకతి సిద్ధమైన పండ్లను రైపనింగ్ చాంబర్స్‌లో (అధికంగా గ్యాస్, రంగు వాడకుండా) మాగ బెట్టడం వల్ల నాణ్యమైన పండ్లను మార్కెట్లో అందించగలమన్నారు.
వీటికి అధిక ధరతో పాటు, నాణ్యమైన పండ్లను ప్రజలకు అందించలగమని తెలిపారు పండ్లను మాగబెట్టడం అనే దాన్ని వ్యాపారంగా ఎలా మార్చుకోవచ్చు, ఇందులో ఉన్న ఉద్యోగ అవకాశాలు తదితర విషయాలపై వివరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్, ఉద్యానవన శాఖ రాధాకష్ణమూర్తి, ఐటీడీఏ పీహెచ్‌వో ప్రకాశ్ పాటిల్, ఎంగ్ ప్రొఫెషనల్ రాహుల్, ఎంపీపీ మాచర్ల గణేశ్, సర్పంచ్‌లు పెందోర్ జలపతి, ఆత్రం లింబారావు, సుందర్‌సింగ్, ఐకేపీ ఏపీఎం జగదీశ్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.