Magnitude 5.2
-
అసోంను వణికించిన భూకంపం
సాక్షి, గువహటి : అసోంలో సోమవారం సంభవించిన భూకంపం ప్రజలను భయకంపితులను చేసింది. రిక్టర్ స్కేల్‌పై 5.1 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైన భూప్రకంపనలకు నాగోన్ జిల్లా ధింగ్‌కు 22 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతం భూకంప ప్రధాన కేంద్రంగా ఉందని షిల్లాంగ్‌లోని ప్రాంతీయ సెసిమలాజికల్ సెంటర్ పేర్కొంది. కాగా, భూకంప తీవ్రత ఫలితంగా వాటిల్లిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలపై ఇంకా సమాచారం తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. భూప్రకంపనల తీవ్రత మధ్యస్థంగా ఉందని అధికారులు తెలిపారు. -
అండమాన్ దీవుల్లో స్వల్ప భూకంపం
అండమాన్ : అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం స్వల్ప భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. పోర్ట్‌బ్లెయిర్‌కు 94 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు.