విజృంభించిన చరణ్, మన్నాస్
జింఖానా, న్యూస్‌లైన్: సెయింట్ మార్క్స్ ప్రోగ్రెసివ్ హైస్కూల్ బౌలర్లు చరణ్ (4/27), మన్నాస్ (4/29) విజృంభించారు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో మహబూబ్ హైస్కూల్ జట్టుపై ఘన విజయం సాధించింది. హచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహబూబ్ జట్టు 95 పరుగులకే ఆలౌటైంది. మహేష్ 30 పరుగులు చేశాడు.
అనంతరం సెయింట్ మార్క్స్ రెండు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో రాయల్ హైస్కూల్ బౌలర్ జుబేర్ (7 వికెట్లు) హడలెత్తించడంతో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో పల్లవి మోడల్ హైస్కూల్‌పై నెగ్గింది. మొదట పల్లవి మోడల్ హైస్కూల్ 103 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత రాయల్ హైస్కూల్ మూడే వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఢిల్లీసెయింట్ పీటర్స్ హైస్కూల్: 385/1 (వికాస్ రావు 182 నాటౌట్, హర్షవర్ధన్ రెడ్డి 89, ధీరజ్ విశాల్ 55 నాటౌట్); నీరజ్ పబ్లిక్ స్కూల్: 112 (గోపీనాథ్ 47; తేజోధర్ రావు 5/20, హర్షవర్ధన్ రెడ్డి 4/20). ఢిల్లీసెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్: 121 (అభిషేక్ రెడ్డి 40; సంహిత్ రెడ్డి 5/20); శ్రీచైతన్య టెక్నో స్కూల్: 122/2 (గౌరవ్ రెడ్డి 55 నాటౌట్).