Mahalaxmi Temple
-
క్లీంకార పుట్టి 6 నెలలు.. ముంబైలో మహాలక్ష్మి గుడికి వెళ్లిన చరణ్ దంపతులు (ఫోటోలు)
-
రూ.100 కోట్లు అలంకరణ.. కోరిన కోర్కెలు తీరునట
సాక్షి, రత్లామ్ : మానవసేవే మాధవ సేవ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పడం, ఆ మాటలనే ప్రతి చోటా మనం వింటుండటం జరుగుతోంది. ఈ రోజుల్లో సేవ చేయాలంటే డబ్బుతో ముడిపడి ఉన్న అంశం. అయితే, ఆ డబ్బు ఉపయోగించి మనుషులకు సేవలు చేయడాన్ని పక్కకుపెట్టి మన దేశంలోదేవుళ్ల సేవలకు మాత్రం భారీ క్యూలు కడతారని మరోసారి నిరూపితమైంది. మధ్యప్రదేశ్‌లో ఓ మహాలక్ష్మీ ఆలయాన్ని డబ్బులతో నింపేశారు. దీపావళి సందర్భంగా ఆలయంలోని గర్భగుడిలో అడుగుడగున డబ్బు, ఆభరణాలు ఇతర విలువైన వస్తువులతో అలంకరించారు. వీటి విలువ అక్షరాల రూ.100కోట్లు ఉంటుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఒక రూపాయి నుంచి మొదలుకొని రూ.2000 నోట్ల వరకు ప్రతీది ఉపయోగించి ఆలయాన్ని అలంకరించారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులు దేవీని చూసే ఆసక్తికంటే ఆలయంలో అన్ని చోట్ల అలంకరించిన డబ్బును చూసేందుకు కుప్పలుగా తరలి వస్తారట. అంతేకాదు, కోరిన వారి కోరికలు తీర్చే కొంగుబంగారం ఆ మహాలక్ష్మీదేవీ అని అక్కడి భక్తులు చెబుతున్నారు. అయితే, ఇదేదో ఈఏడాది జరిగిన విషయం కాదు.. ప్రతిసంవత్సరం ఇలాగే చేస్తుంటారట. భక్తులే కానుకల రూపంలో తీసుకొచ్చిన ఈ మొత్తం సొమ్మును ఇలా అలంకరించడం పరిపాటి అని చెబుతున్నారు. 'మహాలక్ష్మీ ఆలయాన్ని నేను ఆరేళ్లుగా సందర్శిస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆలయానికి వచ్చి నేను ఏం కోరుకున్నా జరిగి తీరుతుంది' అని మమతా పోర్వాల్ అనే భక్తురాలు తెలిపారు. 'కానుకల రూపంలో ఈ ఏడాది వచ్చినవి డబ్బు, ఆభరణాలు ఇతర వస్తువులు కలిపి మొత్తం రూ.100కోట్ల వరకు ఉంటుంది. చాలా దూరం నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి దీపావళికి ఇలాగే ఉంటుంది. గర్భగుడిలో ఎప్పుడూ పోలీసులను తిప్పుతుంటాం' అని ఆలయ ప్రధాన అర్చకుండా సంజయ్ తెలిపారు. -
పుణ్యక్షేత్రాల బాటపట్టిన అభ్యర్థులు
సాక్షి, ముంబై: ఎన్నికలు సమీపించడంతో బరిలో దిగిన అభ్యర్థుల్లో కొందరు పుణ్యక్షేత్రాల బాట పట్టారు. ఈ ఎన్నికల్లో తమకు విజయం తప్పకుండా వరించాలని, ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూడాలని కోరుతూ పూజలు, హోమాలు చేస్తున్నారు. మరికొందరు తమ పరువు పోకుండా కనీసం డిపాజిట్ దక్కేలా చూడు స్వామి అని వేడుకుంటున్నారు. లోక్‌సభ, శాసన సభ, స్థానిక సంస్థలకు ఇలా ఎలాంటి ఎన్నికలు జరిగినా అభ్యర్థులను గెలిపించేది ఓటరు మహాశయులే. అయినప్పటికీ అభ్యర్థులు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు అప్పుడే బయలుదేరారు. కొందరు స్థానికంగా ఉన్న గుళ్లు, గోపురాల్లో పూజలుచేయగా మరికొందరు సాధు, సంతువులు, సన్యాసుల ఆశీర్వాదం పొందేందుకు వారు బసచేసిన మఠాలకు బయలుదేరారు. ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక, మహాలక్ష్మి మందిరాలతోపాటు రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీలోని సాయిబాబాను, తిరుపతిలోని బాలాజీ, కొల్హొపూర్లోని మహాలక్ష్మి ఆలయం, వాషి, శేగావ్, యావత్మాల్, నాగపూర్‌లోని దుర్గమాత మందిరాలు, బుల్డాణ జిల్లాలో ప్రముఖ ఆలయం, మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని భయ్యూజీ మహారాజ్ కొందరైతే దర్గాను కూడా వదలడం లేదు. అందులోని ముస్లీం మత గురువులకు మొక్కుతున్నారు. కాని ఎన్ని గుళ్లకు, గోపురాలకు మొక్కుకున్న, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేసిన చివరకు ఎన్నికల్లో అంతిమ తీర్పునిచ్చేది ఓటర్లు మాత్రమేనని వీరు గుర్తించకపోవడం గమనార్హం.