రాజవంశీకుడైన మాజీ క్రికెటర్ మృతి
రాజస్థాన్ రంజీ జట్టు మాజీ కెప్టెన్, మేవార్ పూర్వ రాజకుటుంబ సభ్యుడు, రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడు, హెచ్ఆర్హెచ్ (HRH) గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ అయిన అరవింద్ సింగ్ మేవార్ (81) ఇవాళ (మార్చి 16) తెల్లవారుజామున ఉదయపూర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. మేవార్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఉదయపూర్‌లోని సిటీ ప్యాలెస్‌లో చికిత్స పొందారు. అరవింద్ సింగ్ మేవార్ మహారాణా భగవత్ సింగ్ మేవార్ మరియు సుశీలా కుమారి మేవార్ దంపతుల చిన్న కుమారుడు. అరవింద్‌కు భార్య విజయ్‌రాజ్ కుమారి, కుమారుడు లక్ష్యరాజ్ సింగ్ మేవార్, కుమార్తెలు భార్గవి కుమారి మేవార్, పద్మజ కుమారి పర్మార్ ఉన్నారు. అరవింద్ సింగ్ మేవార్ మృతికి గౌరవ సూచకంగా ఉదయపూర్‌లోని సిటీ ప్యాలెల్ను ఆది, సోమవారాల్లో మూసివేయబడుతుంది.మేవార్ అజ్మీర్‌లోని ప్రతిష్టాత్మక మాయో కళాశాలలో విద్యనభ్యసించారు. UK, USAలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేశారు. తదనంతరం వివిధ అంతర్జాతీయ హోటళ్లలో శిక్షణ పొందాడు. ఆసక్తిగల క్రికెటర్ అయిన మేవార్ 1945-46లో రాజస్థాన్ రంజీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. మేవార్ రెండు దశాబ్దాల పాటు క్రికెటర్‌గా కెరీర్‌ను కొనసాగించాడు. మేవార్ ప్రొఫెషనల్ పోలో ఆటగాడు కూడా. UKలో అతను కేంబ్రిడ్జ్ మరియు న్యూమార్కెట్ పోలో క్లబ్లో 'ది ఉదయపూర్ కప్'ను స్థాపించాడు. 1991లో మేవార్ పోలో జట్టు 61వ కావల్రీ ఆటగాళ్లను ఓడించి ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కప్‌ను కైవసం చేసుకుంది.ఆసక్తిగల పైలట్ కూడా అయిన మేవార్.. మైక్రోలైట్ విమానంలో భారతదేశం అంతటా సోలో విమానాలు నడిపారు. మేవార్ ఉదయపూర్‌లోని మహారాణా ఆఫ్ మేవార్ ఛారిటబుల్ ఫౌండేషన్‌కు ఛైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.