Mahindra Industries
-
అదిరిపోయిన మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లు.. మిగతా కంపెనీలకు దెబ్బే!
ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటీవల మహీంద్రా ఎక్స్యువి 700 రికార్డు బుకింగ్స్ అందుకు నిదర్శనం. తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోనూ దూసుకెళ్లాలని సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాబోతుంది. అందుకు భాగంగానే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ( SUV) మోడల్ని విడుదల చేసింది. అయితే ఈ కారు విడుదలకు ముందే, మహీంద్రా వీలు దొరికినప్పుడల్లా టీజర్లతో ఈ కారుపై హైప్‌ను పెంచుతోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, భారతీయ వాహన తయారీ సంస్థ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను (SUV) విడుదల చేయాలని యోచిస్తోంది. వీటిని ప్రతాప్ బోస్ నేతృత్వంలోని మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ (M.A.D.E) రూపొందించిందని గమనించాలి. కంపెనీ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్‌ల ప్రకారం, SUVలకు XUV-e1, SUV-e2, SUV-e3, SUV-e5, SUV-e6, SUV-e7, SUV-e8. SUV-e9 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ట్రేడ్‌మార్క్ చేసిన పేర్లలో 4వ సంఖ్యతో ఉన్న పేరు సిరీస్‌లో లేకుండా పోయింది. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUVల ఫీచర్లు, ఇంటీరియర్ల గురించి ఈ టీజర్ ద్వారా కస్టమర్లకు క్లూ ఇచ్చింది. ఇందులో కస్టమర్ ప్రాధాన్యతలకు సరిపడా రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ కోసం వ్యక్తిగత వినియోగదారు సెట్టింగ్‌లు ప్రతి ప్రయాణీకుడు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాయి. స్పష్టమైన కనెక్టివిటీ ఫీచర్ల కారణంగా కస్టమర్లు.. కాల్స్, టెక్స్ట్‌లు, మ్యూజిక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను యాక్సెస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో లెదర్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. And the curtain rises… pic.twitter.com/wRFQrejABu — anand mahindra (@anandmahindra) August 15, 2022 చదవండి: ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి -
మహీంద్రా బుకింగ్స్ బీభత్సం.. నిమిషాల్లో రూ.18వేల కోట్ల బిజినెస్
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కార్ల బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్‌లు సృష్టించింది. ఆ సంస్థకు చెందిన (Scorpio N) స్కార్పియో-ఎన్ మోడల్ కారు బుకింగ్స్ బీభత్సం సృష్టించింది. దీంతో కేవలం నిమిషాల వ్యవధిలో వేల కోట్ల బిజినెస్ జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మహింద్రా కొత్త స్కార్పియో-ఎన్(Mahindra Scorpio N) అధికారిక బుకింగ్స్ (శనివారం) జూలై 30 ప్రారంభమైంది. అలా విడుదల అయ్యిందో లేదో ప్రారంభమైన నిమిషంలోనే 25 వేలు, అరగంటలో లక్ష బుక్సింగ్స్ నమోదయ్యాయి. ఈ విలువ రూ.18వేల కోట్లపైనే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా. కొత్త మహింద్రా స్కార్పియో-ఎన్ ధర ఎక్స్-షోరూంలో పెట్రోల్ వెర్షన్లకు రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల మద్యలో ఉండనుంది. అలాగే డీజిల్ వెర్షన్ల ధర రూ.12.5 లక్షల నుంచి రూ.19.5 లక్షల మధ్యలో ఉంది. అయితే కంపెనీ ప్రకటించిన ప్రారంభ ధర కేవలం తొలి 25 వేల బుకింగ్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత డెలివరీ సమయంలో ఏ ధర ఉంటుందో దాన్నే కస్టమర్లు కట్టాల్సి ఉంటుంది. మహీంద్రా ఈ కార్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ ప్రక్రియను సెప్టంబర్ 26 నుంచి ప్రారంభించబోతుంది. డిసెంబర్ 2022 నాటికి 20 వేల యూనిట్లకు పైగా స్కార్పియో-ఎన్ వెహికిల్ డెలివరీ చేపట్టాలని సన్నాహాలు కూడా చేస్తోంది. కాగా మహీంద్రాలోని థార్, ఎక్స్‌యూవీ700 మోడల్స్ కోసం కూడా కస్టమర్లు వేచి చూస్తున్నారు. మరి ఈ బుకింగ్స్ ఏ రికార్డు క్రియేట్ చేస్తోందో వేచి చూడాలి. చదవండి: ఆగస్ట్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! -
పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇకపై కంపెనీ తయారీ పికప్, చిన్న వాణిజ్య వాహనాలను వినియోగదార్లు రూ.6,666 నెలవాయిదాతో కొనుగోలు చేయవచ్చు. వడ్డీ రేటు 11.5 శాతం నుంచి ప్రారంభం. రూ.10 లక్షల వరకు వాహనానికి (ఆన్ రోడ్) అయ్యే వ్యయంలో 85 శాతం దాకా రుణం ఇస్తారు. కాల పరిమితి ఆరేళ్లు. థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం లేదు. తొలిసారి వాహనాన్ని కొనుగోలు చేసేవారికి ఐటీఆర్ అక్కరలేదు. చదవండి : అదిరిపోయే లుక్, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వివో