malayappa
-
పెద్దశేషుడిపై పరందాముడి దర్శనం
-
పెద్దశేషుడిపై పరందాముడి దర్శనం
– వైభవంగా శ్రీవారి వాహన సేవల ఆరంభం – తిరుమలకొండ మీద బ్రహ్మోత్సవ కాంతులు సాక్షి,తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటేశుడు కొలువు దీరింది శేషాద్రి. ధరించేది శేష వస్త్రం. పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యత. అందుకే తొలి రోజు శేషవాహనం మీదే ఊరేగే సంప్రదాయంగా వస్తోంది. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పూజలందుకున్న స్వామి వాహన మండపంలో వేంచేశారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబర వస్త్ర, సుగంధ పరమళ పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. రాత్రి 9 గంటలకు ఛత్రచామర, మంగళవాయిద్యాల, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉత్సవర్లు ఆలయ పురవీధుల్లో ఊరేగారు. ఉభయదేవేరులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారి దివ్య మంగళ రూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయం పొందారు. వాహన సేవ ముందు భజన బృందాల కోలాహలం, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల నృత్యాలు, కోలాటాలు, నగర సంకీర్తనలు భక్తులను అలరించాయి. పుష్పాలంకరణ, విద్యుత్ దీపకాంతుల్లో ఆలయం, పురవీధులు స్వర్ణకాంతులీనాయి. -
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడోత్సవం
-
వైభవంగా గరుడోత్సవం
–మలయప్ప దర్శనంతో భక్తకోటి తన్మయత్వం – మాదిరి బ్రహ్మోత్సవాల తరహాలో వాహన ఊరేగింపు సాక్షి,తిరుమల: తిరుమలలో శుక్రవారం గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా పురవీ«ధుల్లో మలయప్ప గరుడవాహనంపై దర్శనమివ్వటం ఆలయ సంప్రదాయం. సాయంసంధ్యాసమయం పూజలు ముగించుకుని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కొలువు మండపంలో వేంచేపు చేశారు. వేయి నేతిదీపాల వెలుగులో సహస్ర దీపాలంకారసేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేశారు. భక్తాగ్రేసుడైన గరుడుడిపై ఆశీనులైన మలయప్పను అర్చకులు విశేష ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరించారు. రాత్రి 7 గంటలకు భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రాల నడుమ ప్రారంభమైన ఊరేగింపు రాత్రి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధులో ్ల సాగింది. భక్తుల హారతి నడుమ స్వామివారు దర్శనమిస్తూ కనువిందు చేశారు. భక్తులు అశేష సంఖ్యలో హాజరై ఉత్సవర్లను దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. మాదిరి బ్రహ్మోత్సవంలా వాహన ఊరేగింపు అక్టోబరు 3 నుండి 11 వ తేది వరకు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన గరుడ వాహనాన్ని మాదిరి బ్రహ్మోత్సవం తరహాలో ఊరేగించారు. ఇందుకోసం భారీ పోలీసు బలగాలు, విజిలెన్స్ సిబ్బందిని బందోబస్తు నిర్వహించారు. వాహనాన్ని అటుఇటు తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించేలా టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పర్యవేక్షించారు. ఉత్సవం అద్యంతం కోలాహలంగా సాగింది. నేటి నుండి తిరుమల శనివారాలు (పెరటాశి మాసం) కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
శ్రీవారికి కొత్త ముత్యపు పందిరి వాహనం
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారికి కొత్త ముత్యపు పందిరి వాహనాన్ని సిద్ధం చేశారు. దీనితోపాటు సూర్యప్రభ వాహనాన్ని అధికారులు మంగళవారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు కొత్త ముత్యపు పందిరి వాహనం, సర్వభూపాల వాహనాలను కొలువుదీర్చేందుకు టీటీడీ సిద్ధమైంది. గతంలో ఈ వాహనాలపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగుతుండగా భక్తులకు అంతగా కనిపించేవారు కాదు. ఈ నేపథ్యంలో కొత్త వాహనాలను బర్మాటేకుతో సిద్ధం చేశారు. మంగళవారం ముత్యపు పందిరివాహనాన్ని పరిశీలించారు. అనంతరం తిరుపతి జ్యువెలరీ విభాగానికి తరలించి రాగిరేకుతో బంగారుమలాం చేయించనున్నారు. సర్వ భూపాల వాహనాన్ని త్వరలోనే పరిశీలించనున్నారు. వాహన సేవల్లో అత్యంత బరువైన సూర్యప్రభ వాహనాన్ని కూడా ముందుజాగ్రత్తగా పరిశీలించి లోటుపాట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో పారుపత్తేదారు జయరామ్‌నాయక్, బొక్కసం ఇన్చార్జి గురురాజు, ఏవీఎస్వో మల్లికార్జున్ పాల్గొన్నారు. -
సింహవాహనంపై శ్రీనివాసుడు
తిరుమల : అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు శుక్రవారం ఉదయం సర్వాలంకరణా భూషితుడైన మలయప్ప స్వామి సింహవాహనంపై విహరించారు. స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. గోవింద నామ స్మరణతో మాఢ వీధులు మార్మోగుతున్నాయి. కాగా సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో విహరిస్తారు. చల్లని ముత్యాల పందిరిలో శైత్యోపచారాన్ని స్వీకరిస్తున్నట్లున్న శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం భక్తుల తాపత్రయాలను పోగొడుతుంది. మరోవైపు కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడు వెలసిన తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం.. పచ్చ తోరణంగా విలసిల్లుతూ ఉంటోంది. అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకునికి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే స్వామివారికి జరిగే అన్ని సేవలలో... ప్రతి శుక్రవారం జరిగే అభిషేకానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ అభిషేక సేవలో స్వామివారి మూలవిరాట్‌కు కొన్ని ప్రత్యేక పదార్ధాలతో మర్ధనా చేస్తారు. అందుకే తిరుమలేషుని అర్చవతార రూపం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ అభిషేక ప్రత్యేకత గురించి తిరుమల ప్రధాన అర్చకులు రమణదీక్షితులు 'సాక్షి'కి వివరించారు.