malayappaswami
-
సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప
తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు త్రివిక్రమ అలంకారంలో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఈ వాహనసేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామివారు అనుగ్రహిస్తారు. చదవండి: కల్పవృక్ష వాహనంపై మలయప్ప -
యోగనృసింహుడు
సాక్షి,తిరుమల: వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు బుధవారం మలయప్పస్వామి ధ్యానముద్రలోని యోగ నృసింహస్వామి రూపంలో తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. దుష్టజన శిక్షణ, శిష్టజన రక్షణ, ధర్మ పరిరక్షణపై తాను నృసింహ రూపాన్ని ధరించానని స్వామి ఈ వాహనం ద్వారా సంకేతం ఇస్తారు. యోగ శాస్త్రంలో సింహం శీఘ్ర గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భవ బంధములనే ప్రపంచ మాయను దాటి ముక్తిని పొందడానికి యోగసాధన ఒక్కటే మార్గమని సింహ వాహన సేవలో యోగముద్ర రూపం ద్వారా స్వామి తెలియజేస్తారు. తొలుత ఆలయ రంగనాయక మంటపంలో ఉత్సవరులకు విశేష సమర్పణ చేసిన తరువాత ఆలయం వెలుపల వాహన మంటపంలోకి వేంచేపు చేశారు. పుష్పమాలలు, విశేషమైన ఆభరణాలతో ఉత్సవమూర్తిని అలంకరించారు. భక్తుల గోవింద నామాలు, మంగళవాయిద్యాలు, పండితుల వేదఘోష మధ్య వాహన సేవ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సాగింది. సింహవాహనంపై యోగముద్రలో ఆశీనులైన స్వామి దివ్యమంగళరూపాన్ని దర్శించి భక్తకోటి తన్మయత్వం పొందారు. వాహన సేవ ముందు కళాకారుల వేషధారణలు, కోలాటాలు, చెక్కభజనలు, భజన బృందాలు సంగీత, గాన, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్, బోర్డు సభ్యులు పసుపులేటి హరిప్రసాద్, భానుప్రకాష్‌రెడ్డి, డీపీ అనంత్ పాల్గొన్నారు. -
రాయంచపై రఘుకుల నందనుడు
– వేడుకగా వాహన సేవల ఊరేగింపు – స్నపన తిరుమంజనంలో సేద తీరిన శ్రీవారు – కోలాహలంగా భజన, సాంస్కృతిక కార్యక్రమాలు – వెలవెలబోయిన భక్తుల గ్యాలరీలు సాక్షి,తిరుమల: తిరుమలేశుని బ్రహ్మోత్సవ సంబరాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. కాగా తొలి రెండు రోజుల ఉత్సవాలకు భక్తజనం చాలా పలుచగా కనిపించారు. మంగళవారం వాహన సేవల్లో భక్తుల గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. మాడ వీధులు, గ్యాలరీలు బోసిపోయాయి. వాహన సేవల ముందు వీఐపీలు, వారి బంధుగణం సందడి మాత్రమే కనిపించింది. పోలీసులు మాత్రం నిండుగా కనిపించారు. రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ భక్తులను నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది ఉత్సాహం చూపారు. తిరుమలపై శ్రీవారి బ్రహోత్సవ కోలాహలం ఉట్టిపడుతోంది. రెండో రోజు మంగళవారం ఉదయం చిన్నశేషవాహన సేవలో మలయప్ప స్వామివారు బద్రీనారాయణుడి రూపంలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లో తొలి స్నపన తిరుమంజన సేవలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఉత్సవమూర్తులు సేద తీరారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. పుష్పాలు, పండ్లతో అలంకరించిన మండపంలో విశేషంగా ఉత్సవర్లు ఈ ప్రత్యేక సేవ అందుకున్నారు. ఆ తర్వాత కొత్త కొలువు మండపంలో మంగళవారం రాత్రి 7 గంటలకు వేయి నేతి దీపాల వెలుగులో స్వామివారు ఊయలూగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంతం వద్ద భక్తుల సందడి కొంత కనిపించింది. అనంతరం రాత్రి రాత్రి 9 గంటలకు నిర్వహించిన హంసవాహన సేవలో కూడా భక్తులు పలుచగా కనిపించారు. వాహన సేవల ముందు కోలాటాలు, చెక్క భజనలు, భజన బందాలు, వేషధారణలు, ఉడిపి వాయిద్యాలు, కేరళ చండి నృత్యం, మహారాష్ట్ర కళాకారుల డోలు వాయిద్యాల కోలాహలంతో వాహన సేవల్లో సాంస్కృతిక శోభ కనిపించింది. కళాకారుల అభినయం, వేషధారణలు భక్తులు విశేషంగా అలరించాయి. మరోవైపు ఆలయం, పుష్కరిణి, నాలుగు మాడవీధుల్లో వివిధ రకాల పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాపవినాశనం రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన పుష్ప, ఫొటో ప్రదర్శనశాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రంగురంగుల విద్యుత్ అలంకరణలు, దేవతామూర్తులు కటౌట్లు భక్తులను కనువిందు చేశాయి. ఆలయ ప్రాంతం స్వర్ణకాంతులతో మెరుస్తోంది. ఉత్సవ ఊరేగింపు సందర్భంలో భక్తుల గోవింద నామ స్మరణ మారుమోగింది. 5గంటల్లో శ్రీవారి దర్శనం అలిపిరి: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 62,155 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 11 కంపార్ట్మెంట్లోని సర్వదర్శనం భక్తులకు 5 గంటలు, కాలిబాట ¿¶ క్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. శ్రీవారి హుండీ కానుకలు రూ.1.78 కోట్లు లభించాయి. -
చిన్న శేషుడిపై శ్రీనివాసుడు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మంగళవారం ఉదయం మలయప్పస్వామివారు బద్రీనారాయణుడి రూపంలో భక్తులను సాక్షాత్కరించారు. బంగారు వాకిలిలో కొలువు, పంచాంగ శ్రవణం అనంతరం మలయప్పకు రంగనాయక మండపంలో విశేష సమర్పణ చేశారు. మంగళవాయిద్యాలతో ఆలయం వెలుపల వాహన మండపంలో స్వామివారు వేంచేపు చేశారు. పట్టుపీతాంబరం, మరకత మాణిక్యాదుల విశేష ఆభరణాలు, వివిధ రకాల పుష్పమాలతో స్వామివారిని అలంకరించారు. ఐదు శిరస్సుల శేషుడి నీడలో బద్రీనారాయుyì రూపాన్ని దాల్చారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 గంటల వరకు సాగింది. వాహన సేవలో ముందు గజరాజులు, అశ్వాలు, నందులు నడవగా, భజన, కళా బందాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహన సేవలో దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, టీటీడీ పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
శ్రీవారి సేవకు సిద్ధమైన వాహనాలు
– అక్టోబర్ 3నుంచి బ్రహ్మోత్సవాలు సాక్షి, తిరుమల: దేవదేవుని బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబవుతోంది. అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి విహరించే 14 వాహనాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆలయం ఎదురుగా ఉండే వైభవోత్సవ మండపంలోని వాహనాలకు ఇంజనీర్లు, నిపుణులు బందం తుది మెరుగులు దిద్దారు. వాహనాలు బంగారు వర్ణంలో దేదీప్యమానంగా రూపుదిద్దుకున్నాయి. స్వర్ణరథం, మహారథం హైడ్రాలిక్ బ్రేక్‌లను సరిచేసి సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయ మాడ వీధుల్లో కూడా బ్యారికేడ్లు, గ్యాలరీల నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు. -
ఏమని పొగడుదుమే..
– శ్రీవారి సేవకు స్వర్ణకాంతులతో సిద్ధమైన వాహనాలు – అక్టోబర్ 3నుంచి బ్రహ్మోత్సవాలు సాక్షి, తిరుమల: దేవదేవుని బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబవుతోంది. అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి విహరించే 14 వాహనాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆలయం ఎదురుగా ఉండే వైభవోత్సవ మండపంలోని వాహనాలకు ఇంజనీర్లు, నిపుణులు బందం తుది మెరుగులు దిద్దారు. వాహనాలు బంగారు వర్ణంలో దేదీప్యమానంగా రూపుదిద్దుకున్నాయి. స్వర్ణరథం, మహారథం హైడ్రాలిక్ బ్రేక్‌లను సరిచేసి సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయ మాడ వీధుల్లో కూడా బ్యారికేడ్లు, గ్యాలరీల నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు.