malesia open serice
-
క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్
కౌలాలంపూర్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ –750 మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఒక్కడి పోరాటమే మిగిలింది. ఈ టోర్నీలో 8వ సీడ్‌గా బరిలోకి దిగిన అతను క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట కూడా నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ శ్రీకాంత్ 21–11, 21–15తో థాయ్‌లాండ్‌కు చెందిన కోసిట్ ఫెట్ప్రదబ్ను వరుస గేముల్లో ఓడించాడు. 32 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత స్టార్ జోరుకు ఎదురులేకుండా పోయింది. థాయ్ ప్రత్యర్థిపై అతను అలవోక విజయం సాధించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్... ఒలింపిక్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ (చైనా)ను ఎదుర్కొంటాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సింధు 18–21, 7–21తో çసుంగ్ జీ హ్యున్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో 13–10తో ఆధిక్యంలో ఉన్న సింధు అనూహ్యంగా వెనుకబడింది. ఇక రెండో గేమ్‌లో ప్రత్యర్థి జోరుకు తలవంచింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 21–15, 17–21, 13–21తో తన్ కియన్ మెంగ్– లై పై జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓడింది. -
చెమటోడ్చి నెగ్గిన సైనా
వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ సైనా నెహ్వాల్ విజయపరంపర కొనసాగుతోంది. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా క్రీడాకారిణి, అన్ సీడెడ్ సన్ యూను అతి కష్టం మీద ఓడించి సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగే సెమీస్ లో చైనా క్రీడాకారిణి, పదో ర్యాంకర్ లీ జిన్ తో తలపడనుంది. శుక్రవారం కౌలాలంపూర్‌లో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ లో తొలి రౌండ్లో పూర్తి ఆధిక్యతను ప్రదర్శించిన హైదరాబాదీ షెట్లర్.. రెండో రౌండ్ ప్రారంభంలోనే తడబాటుకు గురైంది. మధ్యలో కొన్ని వరుస పాయింట్లు సాధించిప్పటికీ 15 వ సీడ్ సన్ యూను నిలువరించలేకపోయింది. దీంతో 18-21 తేడాతో రెండో సెట్ కోల్పోవావసి వచ్చింది. ఇక మూడో రౌండ్లో ఇండియా- చైనాల మధ్య భీకర పోరు జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మూడో రౌండ్లో 21- 17తో హైదరాబాదీ ప్లేయర్ ముందంజవేసింది. ఈ విజయంతో సైనా.. మలేసియా సూపర్ సిరీస్ సెమీస్ లోకి ప్రవేశించింది. ఇటీవలే ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిన్‌ను కైవసం చేసుకున్న ఆమె.. కెరీర్లో 17 వ టైటిల్ లక్ష్యంగా మరో అడుగు వేసింది. గురువారం వెల్లడయిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకిగ్స్‌లో 78,541 పాయింట్లతో ఆమె నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇండిన్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ నెగ్గి ఊపుమీదున్న తెలుగు తేజం కిడాండి శ్రీకాంత్ సహా కశ్యప్, ప్రణయ్ లు మలేసియా ఓపెన్ సిరీస్ నుంచి ప్రీ క్వార్టర్స్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.