Mallesvaram
-
బెంగళూరులో హోమియోకేర్ అతిపెద్ద క్లినిక్
మల్లేశ్వరంలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్ హైదరాబాద్: హోమియోకేర్ ఇంటర్నేషనల్ మరో హోమియో క్లినిక్‌ను ఆదివారం బెంగళూరులోని మల్లేశ్వరంలో ఏర్పాటు చేసింది. దీన్ని కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చేతులమీదుగా ప్రారంభించారు. హోమి యో కేర్ ఇంటర్నేషనల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ శ్రీకాంత్ మోర్లవార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోమియో క్లినిక్‌ల విషయానికొస్తే ఇది ఆసియాలోనే అతిపెద్దదని సంస్థ చెబుతోంది. -
నత్తనడకన ‘మెట్రో’ పనులు
బెంగళూరు, న్యూస్‌లైన్ : నగరంలోని పిణ్యా నుంచి మల్లేశ్వరం స్వస్తిక్ వరకు చేపట్టిన మెట్రో రైలు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాదికి ఈ మార్గంలో పనులు పూర్తి అయ్యే సూచనలు కనిపించడం లేదు. విధానసౌధలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలో పిణ్యా నుంచి మల్లేశ్వరం వరకు మెట్రో రైలు సంచారాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా పనులు అసంపూర్తిగానే ఉండడంతో అది కాస్తా నెరవేరే సూచనలు లేవు. దీంతో మెట్రో అధికారుల నుంచి సమాచారం సేకరించుకున్న సీఎం నవంబర్ చివరకు పనులన్నీ పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. అయినా ఆశించిన మేర వేగంగా పనులు పూర్తి కావడం లేదు. దీంతో నవంబర్‌లో కూడా పిణ్యా - మల్లేశ్వరం మార్గంలో మెట్రో రైలు సంచారం అనుమానమే. రాజాజీ నగర మెట్రో స్టేషన్లో 95 శాతం, యశ్వంతపుర, మహాలక్ష్మి లే ఔట్ మెట్రో స్టేషన్లలో 93 శాతం పనులు పూర్తి అయ్యాయి. అలాగే మైసూరు శ్యాండిల్ సోప్ ఫ్యాక్టరీ, కువెంపు రోడ్డు, శ్రీరాంపుర ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ నిర్మాణాలు 77 శాతం పూర్తి అయ్యాయి. ఈ ఆరు స్టేషన్లలో అభివృద్ధి పనులు పూర్తి కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
కమలంలో జోష్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ రాష్ట్ర శాఖ నాయకుల్లో సంతోషం వ్యక్తమైంది. ఢిల్లీలో శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పార్టీ రాష్ట్ర శాఖలో మోడీ అభ్యర్థిత్వంపై సర్వానుమతి ఉంది. ముఖ్యంగా యువకులు మోడీ నాయకత్వంలో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని ఉబలాటపడుతూ వచ్చారు. అద్వానీ నాయకత్వంలో గతంలో జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోవడంతో మోడీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మోడీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించరేమోననే ఆదుర్దా పార్టీ కార్యకర్తల్లో కనిపించింది. అద్వానీ అభ్యంతరాలను తోసిరాజని ఎట్టకేలకు మోడీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. మాజీ మంత్రి ఆర్. అశోక్ నాయకత్వంలో టౌన్ హాలు వద్ద స్కూటర్ ర్యాలీని నిర్వహించారు.