Mallika Sarabhai
-
నటరాజ వందనం.. శివుడికే అంకితం
సాక్షి, హన్మకొండ: ‘నటరాజ వందనం.. శివుడికి అంకితం చేసిన నృత్య ప్రదర్శన. నా తల్లి మృణాళిని సారాభాయ్ వెలువరించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి రూపొందించింది. సాధారణంగా పురుష దేవతల్లో ఐక్యత కోసం నాయిక అన్వేషణగా ఇది ప్రదర్శితమవుతుంది.’ అని అంతర్జాతీయ శాస్త్రీయ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయ్ అన్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్ప ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రం ‘కుడా’ మైదానంలో ‘నటరాజ వందనం’ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆమె ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన నృత్య అనుభవం.. నటరాజ వందనం ప్రదర్శన తీరు, వివిధ ఆలయాల్లోని శిల్పాల్లో నృత్య భంగిమల ప్రత్యేకతల్ని వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాకు నృత్యమంటే ప్రాణం. ఈ ఇష్టం మా అమ్మ నుంచి వచ్చినట్టుంది. అమ్మ శాస్త్రీయ నృత్యకారిణి. పుస్తకాలు రచించేది. ఆ అభిరుచి నాకు కూడా అలవడింది. కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పేరిణి నృత్యం గురించి నాకు తెలుసు. 40 ఏళ్ల క్రితం కూచిపూడి గ్రామానికి చెందిన సీఆర్ ఆచార్యుల వద్ద నేను నృత్యం నేర్చుకున్నా. ప్రపంచ వ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలిచ్చా. శాస్త్రీయ సమకాలీన రచనలు సృష్టించి ప్రదర్శనలిస్తూ వస్తున్నా. 30 ఏళ్లుగా ప్రతిష్టాత్మక ఆర్ట్స్ సంస్థ ‘దర్పణ అకాడమీ ఆఫ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్’కు కో–డైరెక్టర్‌గా ఉన్నా. 1989లో మహిళా శక్తిని బలోపేతం చేసే సోలో థియేట్రికల్ వర్క్‌లను ప్రదర్శించాం. సామాజిక మార్పు కోసం, మహిళా సాధికారత, పర్యావరణ స్పృహ కలిగించేలా మా ప్రదర్శనలుంటాయి. అనేక రంగస్థల నిర్మాణాల్ని రూపొందించాం. సామాజిక మార్పు, పరివర్తన కోసం కళల్ని ఉపయోగించడమే నా ధ్యేయం. నాట్యాల్లో ప్రత్యేకం.. నాట్యాల్లో నటరాజ వందనం ప్రదర్శన ఒక ప్రత్యేకం. మా అమ్మ మృణాళిని సారాభాయ్ రచించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి దీన్ని కూర్పు చేశాను. పరమాత్మ కోసం ఆత్మ చేసే అన్వేషణే భరతనాట్యం. శివపార్వతుల నృత్యాన్ని చూడడానికి విశ్వం నిశ్చలంగా మారుతుంది. ఈ ప్రదర్శనను వర్ణం అని కూడా పిలుస్తారు. ఈప్రదర్శనలో నృత్యకారుడు శివుడి తాండవ నృత్య శక్తిని, గంభీరమైన రూపాన్ని చూపిస్తాడు. రామప్పలో ప్రదర్శించాలని కోరిక.. రామప్పలో నటరాజ నృత్య ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక. కొన్ని కారణాల వల్ల ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ కాకతీయులు ఏలిన వరంగల్ నగరంలో ప్రదర్శించడం కూడా సంతోషంగానే ఉంది. ఇందుకు కాకతీయ హెరిటెజ్ ట్రస్ట్ వారు చాలా సహకారం అందించారు. రామప్ప ఆలయంలోని శిల్పాల నృత్యభంగిమలు ఎంతో ప్రత్యేకమైనవి. పూర్వం పురాతన దేవాలయాల్లోనే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు జరిగేవి. అప్పటి వాళ్లు కళాపిపాసులు. అందుకేనేమో నృత్య ప్రదర్శనలను వివిధ నృత్య భంగిమల్లో శిల్పాలుగా రూపొందించారు. చరిత్రను, పురాతన దేవాలయాలను కాపాడుకోవాలి. అభిరుచి ఉండాలి.. ఈపోటీ ప్రపంచంలో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలంటే అభిరుచి ఉండి తీరాలి. లేదంటే మనల్ని మనం నిరూపించుకోలేం. ముందు తరాల వారు శాస్త్రీయ నృత్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండి, ఆర్థిక బలహీనత వల్ల వెనకబడేవారికి నేర్చుకునేలా అవకాశం కల్పించాలి. మన ప్రభుత్వం శాస్త్రీయ కళలకు నిధులివ్వట్లేదు. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అవసరం. మల్లికా సారాభాయ్ గురించి క్లుప్తంగా.. అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, శాస్త్రీ య నృత్యకారిణి మృణాళిని సారాభాయ్ దంపతుల కుమార్తె మల్లికా సారాభాయ్. 1954 మే9న అహ్మదాబాద్‌లో జన్మించారు. చిన్నతనంలోనే నృత్యం నేర్చుకున్నారు. 15ఏళ్ల వయస్సులో సినీ నటిగా పేరు తెచ్చుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో భరతనాట్యం, కూచి పూడి శాస్త్రీయ నృత్యంలో అసాధారణ మైన యువనర్తకిగా గుర్తింపు పొందారు. నాటక, నృత్యరంగంలో చేసిన కృషికిగానూ గుజరాత్ ప్రభుత్వం ఆమెకు గౌరవ్ పురస్కార్ అందించింది. 2010లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. -
దేశంలో ప్రశ్నించే పరిస్థితి లేదు
హనుమకొండ: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన రామప్ప ఆలయ సన్నిధిలో రామప్ప ఉత్సవాల నిర్వహణకు కేంద్రం అనుమతివ్వకపోవడం బాధాకరమని ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయి అన్నారు. శనివారం హనుమకొండలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు బీవీ పాపారావుతో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. శివుడికి ప్రీతిపాత్రమైన అభినయాన్ని శక్తి స్థలమైన రామప్పలో చేయాలని నిర్ణయించుకున్నానని, కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భావ వైరుధ్యాలను కళలకు ఆపాదించడం సమంజసం కాదన్నారు. రాజకీయంగా అభద్రత ఉన్న వారి కారణంగా దేశంలో ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అయితే భారత్ ప్రజాస్వామ్య దేశమని, ప్రశ్నించడం సగటు భారతీయుడి డీఎన్ఏలోనే ఉన్నదని పేర్కొన్నారు. వేదాల్లోంచే ఇది వచ్చిందన్నారు. అందుకే ప్రశ్నలు కొనసాగుతుంటాయని, తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత మొదటిసారి ఇక్కడ నృత్య ప్రదర్శన చేయాలని అనుకున్నానన్నారు. రామప్ప ఆలయం ఆవరణలో ప్రదర్శన రద్దయినా, వెంటనే హనుమకొండలో ప్రదర్శనను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లను తాను వ్యతిరేకించానని, బాధ్యత కలిగిన పౌరురాలిగా గుజరాత్ అల్లర్లకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, పోలీసులు, ప్రభుత్వందే బాధ్యత అని చెప్పడంతోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లానని పేర్కొన్నారు. అప్పటినుంచి ఇప్పటి పాలకులతో విభేదిస్తూనే ఉన్నానని, అదే కొనసాగుతుందని అన్నారు. -
ఆమె చనిపోతే.. ప్రధానికి పట్టదా?
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి, సామాజికవేత్త మల్లికా సారాభాయ్ విమర్శలు గుప్పించారు. తన తల్లి, ప్రముఖ నాట్యకళాకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మృణాళిని సారాభాయ్(97) మృతిపట్ల ప్రధాని సంతాపం వ్యక్తం చేయకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసి, గుజరాత్ కు చెందిన సీనియర్ కళాకారిణి కన్నుమూస్తే నివాళులర్పించలేదని మల్లికా సారాభాయ్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ విషయం ప్రధానికి పట్టలేదని ఆమె తన ఫేస్బుక్ లో వ్యాఖ్యానించారు. నాట్యకళారంగానికి ఎనలేని సేవలను చేసి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టిన కళాకారిణి మరణంపై దేశ ప్రధాని స్పందిచపోవడం శోచనీయమన్నారు. రాజకీయంగా పరస్పరం భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కనీస మర్యాదలను పాటించాలని హితవు చెప్పారు. ఆమె ఘనమైన సేవలను దేశ ప్రధానిగా గుర్తించాల్సిన అవసరం ముందని వ్యాఖ్యానించారు. లెజండ్రీ నాట్య కళాకారిణి మృణాళిని సారాభాయ్ గుజరాత్ హస్తకళల అభివృద్ధి సంస్థకు అనేక సంవత్సరాలపాటు చైర్ పర్సన్‌గా పనిచేశారు. గ్రామీణ హస్తకళలు, తోలుబొమ్మలాట వంటి కళారూపాల పునరుద్ధరణకు విశేష కృషి చేశారు. మృణాళిని సారాభాయ్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా 2012 గుజరాత్ అల్లర్ల సందర్భంగా మల్లికా సారాభాయ్ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
మృణాళిని సారాభాయి కన్నుమూత
అనారోగ్యంతో నర్తకి తుదిశ్వాస అహ్మదాబాద్: ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి మృణాళిని సారాభాయి గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 97 సంవత్సరాలు. ఆరోగ్య సమస్యలతో ఆమె బుధవారం అహ్మదాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేరారు. గురువారం ఉదయం ఆమెను స్వగృహానికి తరలించడంతో అక్కడ తుదిశ్వాస విడిచారు. శాస్త్రీయ నృత్యం ద్వారా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మృణాళిని సారాభాయి ఎనలేని కృషి చేశారు. చెన్నైలో స్థిరపడిన కేరళ కుటుంబంలో మృణాళిని జన్మించారు. సారాభాయి చిన్నతనంలోనే గురువు మీనాక్షి సుందరం పిళ్లై వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆమె కథాకళి నేర్చుకున్నారు. ప్రాథమిక విద్యను చెన్నైలో పూర్తిచేసిన మృణాళిని.. ఫ్రాన్స్.. స్విట్జర్లాండ్‌లో పై చదువులను అభ్యసించారు. అనంతరం శాంతినికేతన్లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు స్వదేశం వచ్చారు. అక్కడ ఇతర కళల్లో సైతం ఆమె శిక్షణ పొందారు. అమెరికాలోని అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్స్‌లోనూ.. జావా(ఇండోనేసియా)లోనూ ఆమె నటనలో శిక్షణ తీసుకున్నారు. 1942లో భారత అంతరిక్ష పరిశోధనల పితామహుడు విక్రం సారాభాయిని మృణాళిని వివాహం చేసుకున్నారు. సెంటర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు కార్తికేయ సారాభాయి, ప్రముఖ నృత్యకారిణి మల్లికా సారాభాయి వీరి సంతానమే. విక్రం సారాభాయి అందించిన మద్దతుతో ఆమె 1948లో ‘దర్పణ్’ పేరిట అహ్మదాబాద్‌లో నృత్యం, డ్రామా, సంగీత అకాడమీని ప్రారంభించారు. ఆ తర్వాత నృత్యం నేర్చుకునే దేశ విదేశాల్లోని ఔత్సాహికులకు గొప్ప కేంద్రంగా ఈ అకాడమీ నిలిచింది. మృణాళిని 300కుపైగా డ్యాన్స్ డ్రామాలకు నృత్యదర్శకత్వం వహించారు. వీటికి రచన కూడా ఆమే చేశారు. శాస్త్రీయ నృత్యానికి దేశవిదేశాల్లో ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ఆమె చేసిన సేవలు మరువలేనివి. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన సారాభాయి.. అప్పటి వరకు మతం ప్రాతిపదికగా నృత్య ప్రదర్శనలు ఇచ్చే సంస్కృతిని పక్కన పెట్టి ఆధునిక కాలానికి చెందిన కథలకు పెద్దపీట వేశారు. కృష్ణగోపాల్.. మహాభారత్.. మొదలైన ఆమె నృత్యరూపకాలు ప్రస్తుత సమాజానికి అద్దంపట్టేవి. కళారంగానికి ఆమె చేసిన సేవలకుగానూ అనేక అవార్డులు వరించాయి. 1992లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. గుజరాత్ రాష్ట్ర హస్తకళలు, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గానూ మృణాళిని పనిచేశారు. తన తల్లి సంప్రదాయ భావాలు కలిగిన ఆధునిక మహిళ అని మృణాళిని కుమార్తె మల్లికా సారాభాయి పేర్కొన్నారు. భరతనాట్యం.. కథాకళి వంటి శాస్త్రీయ నృత్యాలను మార్చకుండా ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె అద్భుతమైన డ్యాన్స్ డ్రామాలను సృష్టించారని చెప్పారు. -
మే 9న ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మల్లికా సారాభాయ్ (క్లాసికల్ డ్యాన్సర్), టి.రాజేందర్ (నటుడు, దర్శకుడు) ఈ తేదీన పుట్టిన వారి వ్యక్తిగత సంఖ్య 4. వీరు ఈ సంవత్సరం తమ చిరకాల ఆశలను, ఆశయాలను నెరవేర్చుకోగల అవకాశం కనిపిస్తోంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. క్రీడాకారులకు చాలా బాగుంటుంది. పతకాలు, పురస్కారాలు, బిరుదులు అందుకుంటారు. వాణిజ్య శాస్త్రం చదివేవారికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు సొంతగా ఎదుగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. చిన్న చిన్న అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ తేదీన పుట్టిన వారు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం అవసరం. లక్కీ నంబర్లు: 1,4,6,9, లక్కీ కలర్స్: రెడ్, వయొలెట్, క్రీమ్, బ్లూ. సుబ్రహ్మణ్యారాధన, రక్తదానం, అనాథలకు అన్నదానం వల్ల మరిన్ని శుభఫలితాలు అందుకుంటారు. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
‘ఆప్’లో చేరిన మల్లికా సారాభాయి
అహ్మదాబాద్: ప్రముఖ నృత్యకారిణి, సామాజిక కార్యకర్త మల్లికా సారాభాయి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. బుధవారం ఆమె తన 20 మంది అనుచరులతో కలసి వాస్నాలోని ఆప్ కార్యాలయానికి వెళ్లి ఏఏపీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా అనేక ఏళ్లుగా తాను పోరాడుతూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మల్లికా సారాభాయి 2009లో గాంధీనగర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ అగ్రనేతఅద్వానీపై పోటీపడి ఓటమి పాలయ్యారు.