మే 9న ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
మల్లికా సారాభాయ్ (క్లాసికల్ డ్యాన్సర్), టి.రాజేందర్ (నటుడు, దర్శకుడు)
ఈ తేదీన పుట్టిన వారి వ్యక్తిగత సంఖ్య 4. వీరు ఈ సంవత్సరం తమ చిరకాల ఆశలను, ఆశయాలను నెరవేర్చుకోగల అవకాశం కనిపిస్తోంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. క్రీడాకారులకు చాలా బాగుంటుంది. పతకాలు, పురస్కారాలు, బిరుదులు అందుకుంటారు. వాణిజ్య శాస్త్రం చదివేవారికి ఇది మంచి సమయం.
భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు సొంతగా ఎదుగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. చిన్న చిన్న అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ తేదీన పుట్టిన వారు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడం అవసరం. లక్కీ నంబర్లు: 1,4,6,9, లక్కీ కలర్స్: రెడ్, వయొలెట్, క్రీమ్, బ్లూ. సుబ్రహ్మణ్యారాధన, రక్తదానం, అనాథలకు అన్నదానం వల్ల మరిన్ని శుభఫలితాలు అందుకుంటారు.
- రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్