mallika sheravath
-
అందుకే తల్లి పాత్రను తిరస్కరించాను: మల్లికా శెరావత్
‘‘ది రాయల్స్’ సిరీస్‌లో ఇషాన్ కట్టర్ తల్లి పాత్రలో నేను నటించాల్సి ఉంది. అయితే నాకు చెప్పిన కథకి, ఫైనల్ స్క్రిప్ట్‌కి సంబంధం లేదనిపించింది... అందుకే ‘ది రాయల్స్’ అవకాశాన్ని తిరస్కరించాను’’ అని చెప్పారు బాలీవుడ్ నటి మల్లికా శెరావత్. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’. గత నెల 11న విడుదలైన ఈ సినిమాలో చందా రాణి అనే పాత్రలో తనదైన నటనతో అలరించారు మల్లికా శెరావత్.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ– ‘‘ఇషాన్ కట్టర్ లీడ్ రోల్లో ‘ది రాయల్స్’ సిరీస్‌ని రూపొందించాలని నెట్‌ఫ్లిక్స్ సంస్థ భావించింది. ఇందులో ఇషాన్ తల్లి పాత్రలో నటించమని మేకర్స్ నన్ను సంప్రదించారు. నా పాత్ర, కథ ఎంతో నచ్చడంతో చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఫైనల్‌గా స్క్రిప్ట్ పేపర్ మీదకు వచ్చేసరికి ఎన్నో మార్పులు జరిగాయి. చెప్పిన దానికి, రాసిన దానికి సంబంధం లేదనిపించింది. దీంతో వాళ్లు నన్ను మోసం చేశారనిపించి, నేను చేయనని తిరస్కరించాను’’ అని తెలిపారు. అలాగే తన వ్యక్తిగత విషయం గురించి కూడా ఆమె స్పంది స్తూ– ‘‘గతంలో నేను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. అయితే అది బ్రేకప్ అయింది. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నాను. వివాహంపై నాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి మనసు ఉన్న వ్యక్తిని భర్తగా పొందడం కష్టమే. నా ఆరోగ్యంపట్ల నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటాను. అలాగే మంచి భోజనం తింటా, సమయానికి నిద్రపోతా’’ అని తెలిపారు మల్లికా శెరావత్. -
నటి మల్లికా శెరావత్ ప్రధాన పాత్రలో పాంబాట్టం
బాలీవుడ్ భామ మల్లిక శెరావత్ ప్రధాన పాత్రలో నటింన చిత్రం పాంబాట్టం. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రపొందుతున్న ఈ చిత్రాన్ని వైద్యనాథన్ ఫిలిం గార్డెన్ పతాకంపై వంశీ పళనివేల్ నిర్మిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ఓర్పుతో, వాద్ధియార్, 6.2 వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కాగా వీసీ వడివుడయాన్ కథా, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో నటుడు జీవన్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. నటి రితికాసేన్, యాషీక ఆనంద్, సాయి ప్రియ, సుమన్, క్రికెట్ క్రీడాకారుడు సలీల్ అంగోలా, శరవణన్, రమేష్ ఖన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇనియన్ జే.హరీష్ చాయగ్రహణంను, అమ్రీష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. చిత్ర ఆడియోను నటుడు ఆర్య ఆవిష్కరించారు. నటుడు, నిర్మాత కే.రాజన్, దర్శక, నటుడు ఏ.వెంకటేశ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు వడివుడయాన్ మాట్లాడుతూ ఇది క్రీస్తు పూర్వం 1000, 1500, 1980 కాలం ఘట్టాల్లో జరిగే కథ చిత్రంగా ఉంటుందన్నారు. 126 అడుగుల పొడవైన పాము చేసే అట్టహాసం ఇంతవరకు ఏ చిత్రంలోనూ చూసి ఉండరన్నారు. సరికొత్త కాన్సెప్ట్, అద్భుతమైన గ్రాఫిక్స్, సాంకేతిక పరిజ్ఞానం హైలైట్‌గా ఉంటాయన్నారు. ఈ చిత్రం కోసం ఎలాంటి రాజీ పడలేదని చెప్పారు. పాంబాట్టం చిత్రానికి అమ్రిష్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, హాలీవుడ్ చిత్రాల తరహాలో రూపొందిన చిత్రమని దర్శకుడు తెలిపారు. -
అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం
మల్లికా శెరావత్ తన సినిమాలతోనే కాదు, మాటలతోనూ దుమారం లేపుతుంటారు. ‘మర్డర్’, ‘ది మిత్’ ‘హిస్’, ‘టైమ్ రైడర్స్’ చిత్రాలతో పాపులర్ అయిన మల్లిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘‘ఫ్రంటల్ న్యూడ్ సీన్లలో నటించడానికి ఇప్పటి హీరోయిన్లు వెనకాడడం లేదు. ఆడియన్స్ కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. నటించేవాళ్లకూ, చూసేవాళ్లకూ ఇబ్బంది లేనప్పుడు ఇక తీర్పులిచ్చే అవసరం ఏముంటుంది?!’’ అని ఆమె చక్కగా నవ్వేశారు. తను నటించిన ‘మర్డర్’ చిత్రం కాలానికి అతీతమైనది చెబుతూ.. అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం, ఇప్పుడైతే వెరీ కామన్ అని కూడా మల్లిక అన్నారు. -
తాళమేచెవి
అమాయకత్వానికి స్వేచ్ఛనివ్వాలంటే తాళం కావాలి.పసి బతుకులకు విముక్తి కావాలంటేతాళం కావాలి.చిన్నారులను చెర తప్పించాలంటే..తాళం కావాలి. మనం ఒక్కరం తాళం వేసుకుంటేవేలాదిమందికి తాళంచెవి దొరుకుతుంది. మల్లిక క్యాంపెయిన్ మొదలుపెట్టింది.మీరూ.. ‘తాళం’ వెయ్యండి.కాన్స్‌లో ఇంకేం చూడ్డానికి ఉండదు. గౌన్స్.. గౌన్స్.. గౌన్స్! ఐశ్వర్య గౌన్. సోనమ్ గౌన్. దీపికా గౌన్. కంగనా గౌన్. ఇంకా.. సో మెనీ బాలీవుడ్ గౌన్స్. కాన్స్ అంటేనే గౌన్స్ అన్నట్లు ఉంటుంది ఈవెంట్. ఆ గౌన్లన్నీ రెడ్ కార్పెట్‌పై నడుస్తూనో, విహరిస్తూనో కనిపిస్తాయి. నడవడం స్వేచ్ఛ. విహరించడం విముక్తి. మల్లికా శెరావత్ కూడా కాన్స్‌కు వెళ్లిన మొదటి రెండు రోజూలూ గౌన్లోనే కనిపించారు. ఆ తర్వాతే.. రెక్కలు తెగిన పక్షిలా, సంకెళ్లు లేని ఖైదీలా.. ఒక బోనులో, ఆ ఊచల్లోంచి పిచ్చిచూపులు చూస్తూ కనిపించారు! కాన్స్ ప్రాంగణం ఒక్కసారిగా ఫ్రీజ్ అయింది! నాకు తాళం వెయ్యండి మల్లికను ఎవరు ఆ బోనులో బంధించారు? ఎవరో కాదు, తనను తానే చిన్న పెట్టె లాంటి ఆ బోనులో ఆమె బందీ అయ్యారు. ‘పన్నెండు గంటలుగా నేను ఈ బోనులో ఉన్నాను. నాకు అండగా ఉండండి’ అని ఆ బోనుకు పైన తగిలించిన తెల్లటి బోర్డు పైన నల్లటి అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాల పక్కన.. తెరిచి ఉన్న తాళం కప్ప ‘లాక్ మీ అప్’ (నాకు తాళం వెయ్యండి) అని ఉంది. ఆ తాళంకప్ప పక్కన.. మల్లిక ఈ ప్రపంచానికి ఇవ్వదలచుకున్న సందేశం ఉంది. ‘ఫ్రీ ఎ గర్ల్’బాలికలకు విముక్తి కల్పించండి. అది వట్టి సందేశం కాదు. అభ్యర్థన. విజ్ఞప్తి. వేడుకోలు. ప్రార్థన. ‘చూడండి.. బందీ అయిన బాలిక జీవితం ఎలా ఉంటుందో నన్ను చూడండి’ అని చెప్పడం. కాన్స్‌కి వచ్చి ఇదేం పని. చక్కగా సీతాకోక చిలకలా రెపరెపలాడక! రెపరెపలాడాలంటే కదలిక ఉండాలి. కదలిక ఉండాలంటే బంధనాలు లేకుండా ఉండాలి. ఇది చెప్పడానికే మల్లిక ఇక్కడికి వచ్చారు. ఊరికే వచ్చి ప్రసంగిస్తే, చర్చిస్తే, వాదిస్తే, అరిస్తే, ఆగ్రహిస్తే, గర్జిస్తే, గాండ్రిస్తే, అక్రమాలపై ఆక్రోశిస్తే.. ఎవరు వింటారు? ఎవరు తలతిప్పి చూస్తారు. బందీలను చేసి వినిపించాలి. అందుకోసం తను బందీ అయ్యారు మల్లిక! అప్పుడు మల్లిక ఒక్కరే కనిపించరు. మల్లికలోని ఆవేదన కనిపిస్తుంది. వినిపించే ఆవేదన కన్నా కనిపించే ఆవేదన పవర్ఫుల్. దగాపడిన చెల్లెళ్ల కోసం తొమ్మిదేళ్లుగా మల్లిక శెరావత్ కాన్స్‌కు వస్తున్నారు. ఇక్కడేం మాట్లాడినా ప్రపంచం వింటుందనీ, ఇక్కడే అభిప్రాయం వెలిబుచ్చినా ప్రపంచం గౌరవిస్తుందని, ఇక్కడి ప్రతి అడుగుకు, ప్రతి మూవ్‌మెంట్‌కు విలువ ఉంటుందని మల్లిక గ్రహించారు. కాన్స్పై అంత గమనింపు, అంత పట్టింపు ఉన్న ప్రపంచం కాన్స్‌లో బందీగా పడి ఉన్న ఒక అమ్మాయిని చూడకుండా ఉంటుందా? చూసీ చూడనట్లు వెళ్లిపోతుందా! అందుకే మల్లిక బోనులో కూర్చున్నారు. బయట తాళం కప్ప వేసుకుని తాళం వెయ్యమని అడుగుతున్నారు. బోనులో ప్రపంచానికి కనిపించేది మల్లికే కావచ్చు. కానీ మల్లిక.. దగాపడిన చెల్లెళ్లకు, నమ్మి మోసపోయి, రవాణా అయి, బందీ అయిన చిన్నారి బాలికలకు ప్రతిరూపం. ఆ విషయాన్నే మల్లిక చెప్పదలచుకున్నారు. ‘బంధన విముక్తి కల్పించండి’ అనే మాటనే, రివర్స్‌లో ‘బయట తాళం వెయ్యండి’ అనే మాటగా చెప్పారు. ఆలోచన రేపి, హృదయాన్ని తట్టి లేపే బంధనమిది! విముక్తి శక్తి.. శెరావత్ ‘ఫ్రీ ఎ గర్ల్’ అనే ఎన్జీవో సంస్థకు అంతర్జాతీయ రాయబారి మల్లికా శెరావత్. అక్రమ రవాణా నుంచి, లైంగిక దోపిడీ నుంచి బాలికలకు విముక్తి కల్పించడం ఆ సంస్థ లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా గత ఏడాది కూడా కాన్స్‌లో చురుకైన పాత్రను పోషించారు మల్లిక. ఈ ఏడాది ‘లాక్ మీ అప్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. మోసగించి అపహరించుకు వచ్చిన బాలికల్ని ‘ట్రాఫికింగ్ మాఫియా’ పన్నెండు, ఎనిమిది అడుగుల చిన్న గదిలో బంధించి ఉంచుతుంది. ఎప్పుడు బయట పడతారో తెలీదు. ఎవరి చేతుల్లో పడతారో తెలీదు. ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతారో తెలీదు. ఏ నిముషానికి ఏ తరహాలో లైంగిక హింస జరుగుతుందో తెలీదు. చీకటి బతుకు. ఆ చీకట్లో అలా ఎన్నేళ్లు బతకాలో, అసలు బతుకంటూ మిగిలుందో లేదో తెలియని బతుకు. ఆదుకునే వారుండరు. అక్కున చేర్చుకునే వారుండరు. ఈ దుస్థితి ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పడానికే, చూసేవాళ్లకు ఒక్కచూపులో తెలియడానికే మల్లిక ఇలా బోనులో బందీ అయ్యారు. ‘స్కూల్ ఫర్ జస్టిస్’ అనే సంస్థకు కూడా మల్లిక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇండియాలో, మిగతా దేశాల్లో పసిపిల్లల్ని బాలవేశ్యలుగా మారుస్తున్న ముఠాలకు అడ్డుకట్ట వేయడానికి ధైర్యంగా చొరవ చూపుతున్నారు. ఇందుకు.. ఐక్యరాజ్య సమితి తరఫున స్త్రీ, శిశు సంక్షేమం కోసం పని చేసిన అనుభవం, పరిచయాలు మల్లికకు తోడ్పడుతున్నాయి. -
అత్యాచారాలు సిగ్గుచేటు...
.... అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో ఆమె నటించిన తాజా చిత్రం ‘దాస్ దేవ్’. ముంబయిలో నిర్వహించిన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు మల్లిక హాజరయ్యారు. ఇండియాలో పెరిగిపోతున్న అత్యాచారాలపై ఆమె మీడియా ఎదుట స్పందించారు. ‘‘ఇండియాలో మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు సిగ్గుచేటు. మహాత్మా గాంధీజీ తిరిగిన ఈ దేశం ఇప్పుడు అత్యాచారాలకు అడ్డాగా మారింది. ఇలాంటి సమయంలో దేశ ప్రజలు మీడియాపైనే ఆశలు పెట్టుకున్నారు. అసలు మీడియా లేకపోతే కథువా, ఉన్నావ్‌లో జరిగిన ఘటనలు బయటికి వచ్చేవే కావు. మీడియా తెచ్చిన ఒత్తిడి వల్లే మైనర్లపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలన్న కొత్త చట్టం వచ్చింది. ఇందుకు మీడియాకు థ్యాంక్స్’’ అన్నారు మల్లికా శెరావత్. -
'పిచ్చిపిచ్చిగా పీకల్లోతు ప్రేమలో పడ్డానోయ్'
ముంబయి: బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్ ఆనంద డోలికల్లో తేలిపోతోంది. మిగితా బాలీవుడ్ భామల్లా కాకుండా ఏమాత్రం జంకూబొంకూ లేకుండా 'నేను ప్రేమలో పడ్డానండోయ్' అంటూ ఢంకా బజయించి చెబుతోంది. అంతేకాదు ప్రేమ గురించి తన వ్యక్తి గత అభిప్రాయం చెబుతూ 'ప్రేమలో ఉండటమనేది ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఫీలింగ్' అంటూ కూడా చెప్పేసింది. అంతేకాకుండా తనకేం భయం కాదంటూ ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ ఫొటోను కూడా ట్విట్టర్ లో పంచుకొంది. ఆమెకు గత కొద్ది రోజుల కిందట ప్యారీస్ కు చెందిన 'సిరిల్లే ఆక్సెన్ ఫ్యాన్స్' అనే వ్యాపారవేత్త పరిచయమయ్యాడని, అతడితో మంచి చనువు ఏర్పడి డేటింగ్ కూడా చేస్తున్నట్లు అతడే తన బాయ్ ఫ్రెండ్ గా కూడా ఖరారుచేసినట్లు అధికారికంగా ప్రకటించింది ఈ అమ్మడు. అంతేకాదు.. అతడు ఇంతవరకు మల్లికా లాంటి అమ్మాయిని చూడలేదని, ఆమె తనకు రాణి అని తెగ పొగిడేస్తున్నాడు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫొటోలో నల్లటి కళ్లద్దాలతో ఉండి మల్లికా రెడ్ డ్రెస్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ యాష్ కలర్ కోట్ వేసుకొని ఓ బిజినెస్ ఫ్లైట్ ఎంట్రెన్స్ వద్ద అదిరిపోయే స్టైల్ లో పోజిచ్చారు. ఈ ఫ్రెంచ్ వ్యక్తితో పీకల్లోతూ ప్రేమలో పిచ్చిపిచ్చిగా పడిపోయాను బాబోయ్ అంటూ సంబరపడిపోతోంది మల్లికా. ఇప్పటికే పలువురితో డేటింగ్ చేసిన మల్లికా ఈ ప్రేమను అయినా నిలుపుకుంటుందో ఒలకబోసుకుంటుందో ఎదురుచూడాలి మరి.