
మల్లికా శెరావత్
.... అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ మల్లికా శెరావత్. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో ఆమె నటించిన తాజా చిత్రం ‘దాస్ దేవ్’. ముంబయిలో నిర్వహించిన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు మల్లిక హాజరయ్యారు. ఇండియాలో పెరిగిపోతున్న అత్యాచారాలపై ఆమె మీడియా ఎదుట స్పందించారు. ‘‘ఇండియాలో మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు సిగ్గుచేటు.
మహాత్మా గాంధీజీ తిరిగిన ఈ దేశం ఇప్పుడు అత్యాచారాలకు అడ్డాగా మారింది. ఇలాంటి సమయంలో దేశ ప్రజలు మీడియాపైనే ఆశలు పెట్టుకున్నారు. అసలు మీడియా లేకపోతే కథువా, ఉన్నావ్‌లో జరిగిన ఘటనలు బయటికి వచ్చేవే కావు. మీడియా తెచ్చిన ఒత్తిడి వల్లే మైనర్లపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలన్న కొత్త చట్టం వచ్చింది. ఇందుకు మీడియాకు థ్యాంక్స్’’ అన్నారు మల్లికా శెరావత్.
Comments
Please login to add a commentAdd a comment