malware installed
-
మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా..
ఫోన్ హ్యాకింగ్..ఇటీవల అందరినీ భయపెడుతున్న పదం. సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఏ మూలనో నక్కి, ఫోన్లపై దాడి చేస్తూనే ఉన్నారు. మనం వాడే ఫోన్లలో సాప్ట్‌వేర్‌ను జొప్పించి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేస్తుంటారు. మన ప్రమేయమేమీ లేకుండానే ఫోన్‌ను వాడేస్తుంటారు. అనుచిత యాప్‌లను ఇన్స్టాల్ చేస్తుంటారు. ఒక్కసారి వ్యక్తిగత వివరాలు వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతే ఫోన్లోని విలువైన సమాచారం చోరీకి గురవుతుంది. మనకు తెలియకుండానే బ్యాంక్ లావాదేవీలు చేసేస్తారు. నిజానికి ఏ స్మార్ట్‌ఫోనూ పరిపూర్ణమైంది కాదు. అప్పుడప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అదేపనిగా ఇబ్బందులు సృష్టిస్తుంటే ‘ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా?’ అనే సందేహం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. దాన్ని ఆపాలంటే.. అసలు మన ఫోన్ హ్యాకింగ్‌కి గురైందో తెలుసుకోవాలంటే.. అలాకాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోన్ హ్యాక్ అయితే.. మనం ఇన్స్టాల్ చేయని కొన్ని యాప్స్ సైతం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంటే హ్యాకింగ్‌కు గురైందేమోనని అనుమానించాల్సిందే. బ్యాటరీ ఛార్జింగ్ సాధారణ రోజుల్లో కన్నా వేగంగా అయిపోతుంటే స్పైవేర్, మాల్వేర్ హ్యాకర్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని తెలుసుకోవాలి. ఔట్‌గోయింగ్ కాల్స్ విభాగంలో కొత్త నెంబర్లు, ఔట్బాక్స్లో మనం పంపని ఎసెమ్మెస్‌లు కనిపిస్తుంటాయి. మన ప్రమేయం లేకుండానే తరచూ పాప్-అప్స్ హోం స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంటాయి. హ్యాక్‌కి గురైన ఫోన్‌కి పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ సదుపాయం ఉంటే బిల్లులు అసాధారణంగా, ఎక్కువగా వస్తుంటాయి. బ్రౌజర్ హోం పేజీ మనం వాడుతున్నది కాకుండా, తరచూ వేర్వేరుగా కనిపిస్తుంటుంది. మనం ఓపెన్ చేయని పేజీలూ హిస్టరీ విభాగంలో కనిపిస్తుంటాయి. ఫోన్ వేగం మందగిస్తుంటుంది. తెలియని నంబర్ల నుంచి కాల్స్ లేదా స్పామ్ మెసేజ్‌లు వస్తున్నా.. ఫోన్ నుంచి స్పామ్ మెసేజ్‌లు వెళ్తున్నా హ్యాక్ అయ్యిండొచ్చని అనుకోవాలి. మనకు తెలియకుండానే స్క్రీన్‌లాక్, యాంటీవైరస్ వంటి భద్రతా ఫీచర్లు డిసేబుల్ అయితే సందేహించాల్సిందే. ఏం చెయ్యాలి? ఫోన్ హ్యాక్ అయ్యిందనిపిస్తే ముందుగా కాంటాక్ట్ నంబర్లున్న వ్యక్తులకు ఫోన్ హ్యాక్ అయ్యిందనే విషయాన్ని తెలపాలి. మన ఫోన్ నుంచి వచ్చే అనుమానిత లింకులేవీ క్లిక్ చేయొద్దని వారికి తెలియజేయాలి. ఫోన్ వైఫై, మొబైల్ డేటాను టర్న్ఆఫ్ చేయాలి. దీంతో మోసగాళ్లకు ఫోన్ మీద మరింత ఆధిపత్యం ఉండకుండా చేయొచ్చు. ఫోన్లోని మాల్వేర్ను గుర్తించి, తొలగించటానికి యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్ తోడ్పడుతుంది. దీన్ని తరచూ రన్ చేస్తుండాలి. ఒకవేళ అలాంటి సాఫ్ట్వేర్ లేనట్లయితే ఆథరైజ్డ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసి, రన్ చేయాలి. ఫోన్ హ్యాక్ అయినప్పుడు లాగిన్ పాస్‌వర్డ్‌లను మోసగాళ్లు తెలుసుకునే ప్రమాదముంది. కాబట్టి మాల్వేర్ను తొలగించిన తర్వాత అన్ని పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకోవాలి. ప్రతి ఖాతాకూ వేర్వేరుగా కఠినమైన పాస్‌వర్డ్‌లను నిర్ణయించుకోవాలి. ఫోన్లో పొరపాటున మాల్వేర్ చొరపడటానికి ప్రధాన కారణం అనుమానిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవటం. ఫోన్ హ్యాక్ అయ్యిందని అనిపిస్తే యాప్‌ల జాబితాను నిశితంగా పరిశీలించాలి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి లేదా ఇతర సోర్సుల నుంచి డౌన్లోడ్ అయిన యాప్‌లు కనిపిస్తే వెంటనే డిలీట్ చేయాలి. ఆ యాప్‌లు ఏయే డేటాను యాక్సెస్ చేస్తున్నాయో కూడా చూడాలి. దీంతో ఏ ఖాతా పాస్వర్డ్లు మార్చాలో తెలుస్తుంది. ఇదీ చదవండి: ఎయిర్ఇండియా బాహుబలి! ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే చాలావరకు మాల్వేర్ తొలగిపోతుంది. అయితే దీంతో ఫోన్లో స్టోర్ అయిన ఫొటోలు, నోట్స్, కాంటాక్ట్స్ వంటి సమాచారమూ పోతుంది. కాబట్టి ఫోన్‌ను రీసెట్ చేయటానికి ముందు డేటాను బ్యాకప్ చేయాలి. అయితే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. ముఖ్యంగా ఫోన్లో మాల్వేర్ ఉన్నట్టు అనుమానిస్తే అసలే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. అదనపు భద్రత కోసం ముఖ్యమైన యాప్‌లన్నింటికీ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలు, ఈమెయిళ్లు, ఇతర రహస్య ఖాతాల వంటి వాటిల్లో ఏదైనా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయేమో కనిపెడుతుండాలి. పాస్వర్డ్ మేనేజర్ వంటి భద్రమైన యాప్‌ను వాడితే తప్ప ఫోన్లో పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాల వంటి కీలకమైన సమాచారాన్ని సేవ్ చేయొద్దు. -
అమెరికా రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం, ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న అమెరికాను ఇప్పుడు చైనా మాల్వేర్ బెంబేలెత్తిస్తోంది. ఓ అజ్ఞాత మాల్వేర్ను తమ రక్షణ పరికరాల్లో చైనా ప్రవేశపెట్టిందని అమెరికా సైనికాధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ అధికారి ఒకరు నిర్ధారించారు. తమ రక్షణ వ్యవస్థపై చైనా హ్యాకర్లు కన్నేశారని, రక్షణ శాఖ పరికరాల్లోకి ఓ కంప్యూటర్ కోడ్‌ను(మాల్వేర్) ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. సైన్యానికి చెందిన నెట్వర్క్ కంట్రోలింగ్ పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్, సైనిక కేంద్రాలకు నీటిని సరఫరా చేసే వ్యవస్థల్లోకి ఈ మాల్వేర్ రహస్యంగా చేరినట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అత్యవసర, సంక్షోభ సమయాల్లో సైన్యానికి అవసరమైన సరఫరాల్లో అంతరాయం కలిగించేందుకు ఆస్కారం ఉంటుంది. టైం బాంబులాంటిదే మాల్వేర్ వ్యవహారం తొలుత ఈ ఏడాది మే నెలలో బయటపడింది. గువామ్‌లో అమెరికా ఎయిర్ బేస్‌కు చెందిన టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో అనుమానాస్పద కంప్యూటర్ కోడ్‌ను తాము గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. మరో కీలక ప్రాంతంలో ఉన్న కంప్యూటర్లలోనూ ఇది ఉన్నట్లు పేర్కొంది. ఓల్ట్ టైఫన్ అనే చైనా హ్యాకింగ్ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ పరికరాల్లో చైనా మాల్వేర్ అనేది నిజంగా టైంబాంబు లాంటిదేనని అమెరికా కాంగ్రెస్ అధికారి చెప్పారు. సైనిక స్థావరాలకు విద్యుత్, నీటి సరఫరాను, సమాచార మారి్పడిని హఠాత్తుగా నిలిపివేయడానికి ఈ మాల్వేర్ను ఉపయోగిస్తుంటారని చెప్పారు. దీనివల్ల సైన్యంలో పనివేగం తగ్గిపోతుందని అన్నారు. కేవలం అమెరికాలోనే కాదు, విదేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లోని పరకరాల్లోకి చైనా హ్యాకర్లు మాల్వేర్ను పంపించినట్లు ప్రచారం సాగుతోంది. తైవాన్ విషయంలో ఇటీవలి కాలంలో చైనా దూకుడు పెంచింది. ఈ దేశంలో సమీపంలో తరచుగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తోంది. తమ దేశంలో తైవాన్ ఒక అంతర్భాగమని వాదిస్తోంది. మరోవైపు తైవాన్‌కు అమెరికా అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ పరికరాల్లోకి చైనా మాల్వేర్ ప్రవేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఈ యాప్స్ వినియోగిస్తున్నారా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే..
మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్న 19 రకాల ప్రమాదకరమైన యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయాలని సైబర్ టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ఆ యాప్స్ మీ ఫోన్లలోని సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మాల్వేర్ ఫాక్స్ నివేదిక ప్రకారం.. గత పదేళ్లలో సైబర్ కేటుగాళ్లు ఆండ్రాయిడ్ ఫోన్లను ఆసరగా చేసుకొని పలు వైరస్ల సాయంతో యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం నేరస్తులు హార్లీ ట్రోజన్, జోకర్ స్పైవేర్, ఆటోలైకోస్ మాల్వేర్లను ఉపయోగిస్తున్నారు. మాల్వేర్ను ఎలా పంపిస్తారు పైన పేర్కొన్న మాల్వేర్లను వినియోగదారులు సర్వసాధారణంగా వినియోగించే యాప్‌లలోకి వైరస్‌ను పంపిస్తారు. అనంతరం వారికి కావాల్సిన డేటాను కలెక్ట్ చేసుకొని డార్క్‌వెబ్‌లో అమ్ముకుంటున్నట్లు పేర్కొంది. ఇక మాల్వేర్ ఫాక్స్ నిర్ధారించిన 19 యాప్స్‌లలో ఇవి ఉన్నాయి. ఆ యాప్స్ మీ ఫోన్లలో ఉంటే డిలీట్ చేయాలని విడుదల చేసిన రిపోర్ట్‌లో నివేదించింది. హార్లీ ట్రోజన్ - ఫేర్ గేమ్ హబ్ అండ్ బాక్స్, హోప్ కెమెరా- పిక్చర్ రికార్డ్, సేమ్ లాంచర్, లైవ్ వాల్ పేపర్, అమేజింగ్ వాల్ పేపర్, కూల్ ఎమోజీ ఎడిటర్ అండ్ స్టైకర్ జోకర్ స్పైవేర్ - సింపుల్ నోట్ స్కానర్, యూనివర్సల్ పీడీఎఫ్ స్కానర్, ప్రైవేట్ మెసేంజర్, ప్రీమియం ఎస్ఎంఎస్, బ్లడ్ ప్రజర్ చకర్, కూల్ కీబోర్డ్, పెయింట్ ఆర్ట్, కలర్ మెసేజ్ ఆటోలీ కాస్ మాల్వేర్- వ్వాల్గ్ స్టార్ వీడియో ఎడిటర్, క్రియేటీవ్ 3డీ లాంచర్, వావ్ బ్యూటీ కెమెరా, జిఫ్ ఎమోజీ కీబోర్డ్, ఇన్స్టంట్ హార్ట్‌రేట్ ఎనీటైమ్ వంటి యాప్స్ ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి👉 అద్దె ఇంట్లో ఉంటే ఒరిగేదేమీ లేదు.. సొంతిల్లు ఇప్పుడే కొనేయండహో.. -
గూగుల్ హెచ్చరికలు, ఈ 16 యాప్స్ చాలా డేంజర్..వెంటనే డిలీట్ చేసుకోండి!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ వినియోగదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రమాదకరమైన 16 యాప్స్‌ను తొలగించినట్లు తెలిపింది. ఆ యాప్స్‌ను యూజర్లు వినియోగిస్తున్నట్లైతే వెంటనే వాటిని డిలీట్ చేయాలని కోరింది బ్యాటరీని నాశనం చేయడం, డేటా వినియోగం ఎక్కువ అయ్యేలా చేసే 16 యాప్స్ ప్లేస్టోర్‌లో ఉన్నట్లు గూగుల్ గుర్తించింది. ఇప్పటికే 20 మిలియన్ల మంది ఇన్స్టాల్ చేసుకున్న సదరు యాప్స్ యూజర్లు ఉపయోగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. తమ యాప్స్ ఓ భద్రతా సంస్థ నుంచి గుర్తింపు పొందినవని చెబుతూ తప్పుడు ప్రకటనలతో యూజర్లను ఏమార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు గూగుల్ పేర్కొంది. ఆర్స్ టెక్నికా నివేదిక ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నుండి 16 అప్లికేషన్లను తొలగించింది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ (McAfee) గుర్తించిన ఈ ప్రమాదకరమైన యాప్స్‌ను గతంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లలో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉన్నట్లు తెలిపింది. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడానికి, మొబైల్, లేదంటే టాబ్లెట్లలో ఫ్లాష్‌ను టార్చ్‌గా ఆన్ చేయడానికి లేదా వివిధ రకలా అవసరాల కోసం వినియోగించేందుకు ఉపయోగపడినట్లు తెలిపింది. ఇప్పుడు అవే యాప్స్ యూజర్లకు నష్టం కలిగిస్తున్నట్లు మెకాఫీ ప్రతినిధులు తెలిపారు. తొలగించిన యాప్స్ తొలగించిన యాప్స్‌లలో BusanBus, Joycode, Currency Converter, High speed Camera, Smart Task Manager, Flashlight+, K-Dictionary, Quick Note, EzDica, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్లోడర్, ఈజెడ్ నోట్స్ వంటివి ఉన్నాయి. చదవండి👉 భారత్‌లో కస్టమర్లు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ -
వైరస్ వల.. సాయం వంకతో భారీగా సైబర్ నేరాలు
బెంగళూరు: టెక్నికల్ సపోర్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ చింతలు తీరుస్తామంటూ చిక్కుల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఈ తరహా నేరాలు భారీగా జరుగుతున్నాయి. సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వల విసురుతున్న సైబర్ నేరగాళ్లు ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే టెక్ సపోర్ట్ పేరుతో మెసాలకు పాల్పడుతున్న 2,00,00ల మంది సైబర్ నేరగాళ్లను గుర్తించామంటూ ప్రముఖ టెక్ సర్వీసెస్ సంస్థ అవాస్ట్ పేర్కొంది. ఇలా గుర్తించిన వారందరినీ బ్లాక్ చేయడం చేసినట్టు తెలిపింది. హానికర మాల్వేర్ సైబర్ నేరగాళ్లు టెక్ సపోర్ట్ పేరుతో వల వేస్తున్నారు. సామాన్యుల కంప్యూటర్లతో యాక్సెస్ దొరకగానే ... మాల్వేర్లను చొప్పిస్తున్నారు. అనంతరం డేటాను దొంగిలిస్తున్నారు. కొన్నిసార్లు సిస్టమ్ మొత్తం క్రాష్ అయ్యేలా హానికరమైన మాల్వేర్ను సైతం పంపిస్తున్నారు. దీంతో వీరి వలలో పడినవారు తీవ్రంగా నష్టపోతున్నట్టు అసలైన టెక్సపోర్ట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. సపోర్ట్ పేరుతో.. టెక్ సపోర్ట్ పేరుతో ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పంపడం ద్వారా కంప్యూటర్ యూజర్లతో సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్‌లోకి వస్తున్నారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్‌లో సమస్య ఉందని దాన్ని పరిష్కరించుకోవాలంటూ సూచిస్తారు. తమ టెక్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను వాడితే సమస్య దూరమైపోతుందంటూ నమ్మిస్తున్నారు. ఆ వెంటనే తమ ప్రణాళికను అమల్లో పెడుతున్నారు. ఆర్థిక నేరాలు కంప్యూటర్లలో విలువైన సమాచారం చేతికి వచ్చిన తర్వాత కొందరు నేరగాళ్లు బ్యాంకు ఖాతాల ఆధారంగా ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు వ్యక్తిగత సమాచారం ఆధారంగా బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఆన్లైన్ టెక్ సపోర్ట్ పేరుతో సంప్రదించే నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి. -
వాట్సాప్‌లో కొత్త రకం మాల్వేర్
వాట్సాప్ వినియోగదారులు కొత్త మాల్వేర్ బారిన పడుతున్నారనే వార్తలు వినిస్తున్నాయి. వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు, కొత్తరకం వార్మబుల్ మాల్వేర్ను ఫోన్లు, డివైజ్‌లలోకి పంపిస్తున్నారు. ప్రస్తుతం దీన్ని వార్మ్ అనే పేరుతో పిలుస్తున్నారు. ముందు వాట్సాప్ యూజర్లకు ఇతరుల నుంచి మీకు ఒక మెస్సేజ్ లేదా లింక్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఫోన్లలో ఇతర నఖిలీ యాప్‌లు డౌన్లోడ్ అవుతాయి. వీటి ద్వారా మీ వ్యక్తిగత డేటాను సులభంగా దొంగిలిస్తారు. ఇది వివిధ రకాల ఫంక్షన్లు, పర్మిషన్లను ఎనేబుల్ చేయాలని యూజర్లకు నోటిఫికేషన్లు ఇస్తుంది. అనంతరం ఫోన్‌కు ఏదైనా వాట్సాప్ మెస్సేజ్ రాగానే, మాల్వేర్ ద్వారా తక్షణమే ఫేక్ లింక్స్ ఉండే మెస్సేజ్‌లు రిప్లైగా వెళ్తాయి. ప్రస్తుతం వీటి ద్వారా వినియోగదారులకు ఎక్కువ మొత్తంలో యాడ్స్ రావచ్చు. ఇవి ప్రజలను ప్రకటనలతో విసిగిస్తాయి. వాట్సాప్ కు వచ్చిన సందేశం స్పామ్ లాగా కనిపించకుండా ఉండటానికి గంటకు ఒకసారి పింగ్ చేయబడుతుంది. అలాగే ఇలా మెసేజ్ వచ్చిన ప్రతిసారి 'ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ఫోన్‌ను గెలుచుకోండి' అనే ఫేక్ లింకులను డిస్ప్లే చేస్తాయి. వాట్సాప్ యూజర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండటానికి ఒక నకిలీ గూగుల్ లింక్ లాగా ఉంటుంది. ఎవరైనా ఈ లింక్‌ను క్లిక్ చేస్తే క్లోన్ గూగుల్ ప్లే స్టోర్, క్లోన్ 'హువావే మొబైల్' అనే యాప్ ను డౌన్లోడ్ చేయమని ఆ వ్యక్తిని అడుగుతుంది. ఇవి నిజమైన యాప్ లు కావు నకిలీ యాప్ లు. ఈ క్లోనింగ్ యాప్‌ల ద్వారా ఫిషింగ్ మెస్సేజ్‌లు కస్టమర్ల ఫోన్లలో డౌన్లోడ్ అవుతాయి. ఈ యాప్ లను కనుక డౌన్లోడ్ చేసుకొని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఫంక్షన్లు, పర్మిషన్లను మీరు ఎనేబుల్ చేస్తే ఇక మీ పని అంతే. మీ వ్యక్తిగత డేటాతో పాటు, ఇతర ముఖ్యమైన డేటా వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ నకిలీ డొమైన్లపై సరైన చర్యలు తీసుకోవాలని డొమైన్ ప్రొవైడర్‌కు తెలియజేస్తున్నాము అని వాట్సాప్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఎవరు అనుమానిత మెస్సేజ్‌లను ఓపెన్ చేయవద్దని, లింకులపై క్లిక్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. -
మాజీ భార్య ఫోన్లో మాల్వేర్ పెట్టి..
కోల్‌కతా: మాజీ భార్య మొబైల్ ఫోన్లో ఆమెకు తెలియకుండా మాల్వేర్ ఇన్స్టాల్ చేసి, ఆమె ఫోన్ కాల్స్, మేసేజ్‌లన్నింటినీ గూఢచర్యం చేసిన ఓ వ్యక్తికి 50 వేల రూపాయల జరిమానా పడింది. పశ్చిమబెంగాల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు 2013 మేలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చేలా భర్త ప్రవర్తించడంతో పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. ఆ మరుసటి ఏడాదే విడాకులు కోరుతూ హౌరా కోర్టును ఆశ్రయించారు. పెళ్లయిన మొదట్లో తన ఫేస్బుక్ ఎకౌంట్, ఈ మెయిల్ ఎకౌంట్ పాస్‌వర్డ్‌లను భర్తకు చెప్పానని, అన్ని విషయాలు షేర్ చేసుకునేదాన్నని, అయితే ఓ సారి తనకు తెలియకుండా తన ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేసి తన కాల్స్, మెసేజ్‌లు అన్ని తెలుసుకునేవాడని ఫిర్యాదులో పేర్కొంది. పశ్చిమబెంగాల్ సైబర్ న్యాయనిర్ణేత అయిన ఆ రాష్ట్ర ఐటీ కార్యదర్శికి బాధితురాలు ఈ విషయాన్ని ఫిర్యాదు చేసింది. మాజీ భార్య ఫోన్లో సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసి, అన్ని కాల్స్, మెసేజ్‌ల వివరాలను ఓ వెబ్సైట్ ద్వారా మాజీ భర్త తెలుసుకునేవాడని నిర్ధారణ అయ్యింది. దీంతో నెల రోజుల్లోపు బాధితురాలకు 50 వేల రూపాయల పరిహారం చెల్లించాలని నిందితుడికి ఆదేశించారు. పశ్చిమబెంగాల్లో ఇలాంటి తరహా కేసులో జరిమానా విధించడం ఇదే తొలిసారి.