Management Neglected
-
రష్యాలో ఘోర ప్రమాదం 64 మంది మృతి
మాస్కో: రష్యాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తూర్పు రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని కెమెరొవో పట్టణంలో ఓ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి 64 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో పది మంది గాయపడ్డారు. నాలుగు అంతస్తులున్న వింటర్ చెర్రీ అనే షాపింగ్ మాల్లో పిల్లల ఆటల కేంద్రాలు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు తదితర సౌకర్యాలు ఉంటాయి. చిన్నారుల ఆటలకు ఈ మాల్ బాగా ప్రాచుర్యం పొందింది. పాఠశాలలకు సెలవు లు ఇచ్చాక తొలి వారాంతం కావడంతో అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని సరదాగా గడపడానికి ఈ మాల్‌కు వచ్చారు. ఆదివారం సాయం త్రం మాల్ జనాలతో కిక్కిరిసిపోయి అందరూ ఆనం దోత్సాహాల్లో మునిగి తేలుతుండగా అకస్మాత్తుగా మంటలు ఆవరించి 64 మందిని బలితీసుకున్నాయి. ఆదివారం రాత్రంతా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక దళ సిబ్బంది తీవ్రంగా శ్రమించి సోమవారం ఉదయానికి మంటలను ఆర్పగలిగారు. నాలుగు అంతస్తుల్లోనూ క్షణ్నంగా గాలింపు చేపట్టిన తర్వాత 64 మృతదేహాలను సిబ్బంది కనుగొన్నారని అధికారులు తెలిపారు. అయితే వారిలో చిన్నారులు ఎంత మంది ఉన్నారనే విషయం వారు వెల్లడించక పోయినప్పటికీ ఎక్కువమంది పిల్లలే చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. గాయపడిన వారిని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటలను గుర్తించి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకిన 11 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉండగా, అతని తల్లిదండ్రులు, తమ్ముడు మంటల్లో చిక్కుకుని మరణించారు. మోగని ఫైర్ అలారం.. కనిపించని సిబ్బంది మృతుల సంఖ్యను తగ్గించడంలో షాపింగ్ మాల్ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మంటలు చెలరేగినా ఫైర్ అలారం అసలు మోగనేలేదని ప్రాణాలతో బయటపడినవారు చెప్పారు. సినిమా థియేటర్ బయట ఉన్న వారు వచ్చి చెప్పే వరకు లోపలివారికి మంటల విషయమే తెలియదనీ, ఆ తర్వాత అందరూ బయటకు పరుగులు తీస్తున్నా థియేటర్ సిబ్బంది కనీసం లైట్లు కూడా వేయలేదని ఓ బాధితురాలు తెలిపారు. మృతులకు నివాళులర్పిస్తున్న స్థానికులు -
‘రేయాన్స్’పై మంత్రుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీలో (బిల్ట్– బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) పని చేస్తున్న కార్మికుల పట్ల కంపెనీ యాజ మాన్యం నిర్లక్ష్య ధోరణిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూ లాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడటంతో రోడ్డున పడిన దాదాపు 750 మంది కార్మికులకు ఈనెల 9వ తేదీలోపు సంక్రాంతి పండుగ కోసం ఒక నెల జీతం చెల్లించాలని కంపెనీ ప్రతినిధికి డెడ్‌లైన్ విధించారు. 10వ తేదీన సచివాలయంలో జరిగే సమావేశానికి కంపెనీ సీఈవో హాజరు కావాలని ఆదేశిం చారు. ఈ రెండింటిలో దేనిలో విఫలమైనా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్యాక్టరీ మూతపడి రెండేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలను తీర్చ డం లేదని రేయాన్స్ ఫ్యాక్టరీ యూనియన్ల జేఏసీ మంత్రులను ఆశ్రయించడంతో వారి ఆధ్వర్యంలో మంగళవారం సచివాల యంలో యూనియన్ల నాయకులు, కంపెనీ ప్రతినిధులతో సంయుక్త సమా వేశం జరిగింది. ఈ సమావేశంలో ఫ్యాక్టరీ యాజమాన్య ధోరణిని మంత్రులకు యూనియన్ ప్రతినిధులు వివరించారు. 32 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వారి గోడు వెల్లడించారు. దీనిపై కడియం, నాయిని, చందూలాల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ మూతపడితే కార్మికులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం సీఎం కేసీఆర్, కంపెనీ యాజమాన్యం అడిగిన ప్రతి డిమాండ్‌నూ అంగీకరిం చారన్నారు. త్వరలోనే కంపెనీ ప్రారం భిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పటివరకు ఆ విషయం పట్టించు కోకపోవడం సీరియస్‌గా పరిగణిస్తున్నా మన్నారు. తీరు మార్చుకోకపోతే చట్టప రంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు ఏకకా లంలో చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిం చారు. ఈ సమావేశంలో కార్మికశాఖ కమి షనర్ అహ్మద్ నదీమ్, జాయింట్ కమి షనర్ భాగ్యనాయక్, డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, బిల్ట్ ఇండస్ట్రీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కేశవరెడ్డి పాల్గొన్నారు. -
కేశినేని ట్రావెల్స్ నిర్లక్ష్యం...
నల్లగొండ: కేశినేని ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న బస్సు ఆదివారం అర్థరాత్రి నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో అర్థరాత్రి నుంచి ప్రయాణికులు నడిరోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. బస్సులో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, షుగర్ వ్యాధిగ్రస్థులతో పాటు మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులను నెల్లూరు చేర్చేందుకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటుచేయకపోవడంతో కేశినేని ట్రావెల్స్ యాజమాన్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.