బ్రేకింగ్ న్యూస్‌లో...
‘‘వరుణ్‌లో మంచి నటుడున్నాడు. ‘మనలో ఒకడు’లో దిలీప్ పాత్రకు న్యాయం చేశాడు. హీరోగా వరుణ్‌కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘మనలో ఒకడు’, ఆ తర్వాత ‘లజ్జ’ చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన వరుణ్ ఆలేటి హీరోగా నటించిన ‘బుడ్డా రెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’ వచ్చే నెలలో విడుదల సిద్ధమవుతోంది.
వరుణ్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు నరసింహ నందిగారు ‘..బ్రేకింగ్ న్యూస్’లో నటనకు ఆస్కారమున్న పాత్రను ఇచ్చారు. విలేజ్ లవర్‌బాయ్‌గా కనిపిస్తా. ‘మనలో ఒకడు’లో నాజర్ తనయుడిగా నటించడం మర్చిపోలేని అనుభూతి. ప్రస్తుతం ‘ఈనాడు’లో ఓ హీరోగా నటిస్తున్నా. నటుడిగా మంచి పేరొచ్చే పాత్రల్లో నటించాలని నా ఆశ’’ అన్నారు. నటుడు సందేశ్ పాల్గొన్నారు.