Mandal parishad presidential elections
-
ఎంపీపీ ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో ఈ నెల 6న జరుగనున్న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను పంచాయతీరాజ్ చట్టం నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఆదేశించారు. మండల పరిషత్ ఎన్నికలు, 19వ తేదీన నిర్వహించనున్న ఇంటిం టి సర్వే, మండల పరిషత్‌లతో గ్రీవెన్స్ తదితర అంశాలపై సోమవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞసమావేశ మందిరంలో ఎంపీడీఓలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు నామినేషన్ల స్వీకరణ, 11గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ, అనంతరం నామినేషన్ల జాబితా ప్రచురణ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణ, ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక, అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించాలన్నారు. అలాగే ఈ నెల 19న జరుగనున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలో వందశాతం సర్వే పూర్తి చేసేందుకు అధికారులు తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. సర్వే డేటా నికచ్చిగా ఉండాలని, ఏదైనా తేడా ఉంటే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. డబుల్ హౌస్ హోల్డర్లు, గోస్టు హౌస్ హోల్డర్లు ఉండవద్దన్నారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. మండల స్థాయి గ్రీవెన్స్ పటిష్టంగా నిర్వహించాలన్నారు. ప్రతి సామాన్యుడితో మాట్లాడి ఆ సమస్యను తెలుసుకోవాలన్నారు. దానికి పరిష్కార మార్గం ఉందో లేదో సూచించాలన్నారు. ప్రతి అధికారి తప్పని సరిగా కార్యాలయంలో అందుబాటులో ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ర్యాండమ్ తనిఖీలు చేపడతామని, విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ్, జిల్లా పరిషత్ ఏఓ అప్పారావు పాల్గొన్నారు. -
అడ్డదారిలో అందలం
శ్రీకాకుళం కలెక్టరేట్: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు శుక్రవారం దాదాపు ప్రశాంతంగా జరిగాయి. మెజారిటీ మండలాలు దక్కించుకునే స్థితిలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ మరిన్ని స్థానాలు దక్కించుకోవాలన్న యావతో అధికార జులుం ప్రదర్శించింది. అనైతిక చర్యలు, ప్రలోభాలు, బెదిరింపులతో కొన్ని మండలాలను అదనంగా చేజిక్కించుకోగలిగినా.. మరికొన్ని మండలాల్లో ఆ పార్టీ ఎత్తులు పారలేదు. జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల ప్రకారం 22 మండలాల్లో టీడీపీ, 16 మండలాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం సాధించాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే సహజంగా అధ్యక్ష పీఠాలను సైతం ఇదే సంఖ్యలో గెలుచుకోవాల్సి ఉంది. కానీ అధికార దర్పం, అనైతిక చర్యలతో మరో నాలుగు పీఠాలను అదనంగా చేజిక్కించుకుంది. మొత్తం మీద టీడీపీ 26, వైఎస్ఆర్సీపీ 12 మండలాల్లో విజయం సాధించాయి. తనకు తగిన బలం లేని, అభ్యర్ధులు లేని మండలాల్లో టీడీపీ రెండు రోజులు ముందుగానే వ్యూహం ప్రకారం బలహీనవర్గాలకు చెందిన ఎమ్పీటీసీలను, ఇండిపెం డింట్లను ప్రలోభాలకు గురి చేసి తమకు అనుకూలంగా మలచుకున్నారు. రాజాం మండలంలో వైఎస్ఆర్సీపీకి 8, టీడీపీకి 6గురు సభ్యులు ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ ఉన్నా రు. ఈ లెక్కన ఎక్కువమంది ఎంపీటీసీలు ఉన్న వైఎస్ఆర్సీపీకి అధ్యక్ష పదవి దక్కాలి. కానీ టీడీపీ నేతలు ఇండిపెండెంట్‌ను బెదిరించి, ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకొన్నారు. వారి సహకారంతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. వంగర మండలంలో టీడీపీ గ్రూప్ రాజకీయాలు ఎంపీపీ ఎన్నికల్లో వెలుగుచూశాయి. కళావెంకటరావు, ప్రతిభా భారతి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ మండలంలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్ధి విషయంలో ఈ రెండు వర్గాలు చివరకు పరస్పరం పోటీ పడ్డాయి. పలాసలో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు కొద్దిరోజులుగా ఇండిపెండింట్‌ను ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వైఎస్ఆర్సీపీకే ఇండిపెండెంట్ మద్దతు ప్రకటించడంతో టీడీపీ ఎత్తులు చిత్తయ్యాయి. హిరమండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్పీటీసీలను టీడీపీ నేతలు బెదిరించారు.ఆమదాలవలసలో టీడీపీ ప్రలోభాలు ఫలించాయి. కొందరు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు చివరి క్షణంలో టీడీపీకి మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ అధ్యక్ష పీఠాన్ని ఎగరేసుకుపోయింది. కాగా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తింంచారు. సమావేశం ఆవరణలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫోన్లో మాట్లాడుతుండగా ఫోన్లు లాక్కున్నారు. అదే పోలీసులు, అధికారులు సమావేశ మందిరంలో నిబంధనలకు విరద్ధంగా టీడీపీ నేతలు ఫోన్లలో మంతనాలు సాగించినా పట్టించుకోలేదు. సీతంపేటలో వైఎస్ఆర్సీపీకే ఆధిక్యం ఉండగా, ఆ మండలాధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారి ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఏమాత్రం లొంగలేదు.బూర్జ మండలాధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ విఫలయత్నం చేసింది. నిండు గర్భిణితో బలవంతంగా ఓటు వేయించే ప్రయత్నం చేసి, భంగపడింది. కాంగ్రెస్, టీడీపీలు ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడినా..చివరకు న్యాయమే గెలిచి..పీఠాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. జి.సిగడాంలో టీడీపీ ఎమ్పీటీసీలు అధికంగా ఉన్నప్పటికీ ఎంపీపీ పదవికి అవసరమైన ఎస్సీ అభ్యర్ధి లేకపోవడంతో వారు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిని సూరీడమ్మను ప్రలోభపెట్టి ఆమె చేత ఇండిపెండెంట్‌గా పోటీ చేయించారు. ఆమెకు మద్దతుగా ఓటేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించి సూరీడమ్మ పోటీ చేసినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. -
పకడ్బందీగా మండల పాలకుల ఎన్నిక
ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలకు కలెక్టర్ ఆదేశం కర్నూలు(అర్బన్): ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జూలై 4వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ భవనంలో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లాపరిషత్ సీఈఓ ఏ సూర్యప్రకాష్, డిప్యూటీ సీఈఓ యం జయరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన నోటీసులను ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓలు తమ మండలాల్లో గెలుపొందిన ఎంపీటీసీలకు అందజేయాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు 4వ తేదీ ఉదయం 8 గంటలకంతా మండల పరిషత్ కార్యాలయాలకు చేరుకుని ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్నారు. 10 గంటల నుంచి కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించి 12 గంటల్లోపు వాటిని పరిశీలించాలన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల తిరస్కరణకు సమయం ఇవ్వాలన్నారు. అనంతరం మండలాల్లో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాలని తెలిపారు. వివిధ కారణాల వల్ల కోఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే ఆ ఎన్నికను వాయిదా వేస్తు సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు కోఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి అదే మండలానికి చెందిన వారై ఉండాలని, అలాగే మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండాలన్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నికల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను సభ్యులు చేతులెత్తే పద్ధతిలో నిర్వహించాలన్నారు. విప్ ముందుగానే సభ్యులకు చదివి వినిపించాలి: రాజకీయ పార్టీలు విప్ జారీ చేయాలనుకుంటే ఎన్నికకు ఒక రోజు ముందే విప్‌ను ఆయా మండలాలకు చెందిన ప్రిసైడింగ్ అధికారులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారులు ఎన్నిక జరగడానికి గంట ముందు సభ్యులకు చదివి వినిపించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్‌కు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశి ంచారు. ఇందుకు రాజకీయ నాయకులు కూడా సహకరించాలని కోరారు.