ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో ఈ నెల 6న జరుగనున్న మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను పంచాయతీరాజ్ చట్టం నియమ నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఆదేశించారు. మండల పరిషత్ ఎన్నికలు, 19వ తేదీన నిర్వహించనున్న ఇంటిం టి సర్వే, మండల పరిషత్‌లతో గ్రీవెన్స్ తదితర అంశాలపై సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞసమావేశ మందిరంలో ఎంపీడీఓలతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు నామినేషన్ల స్వీకరణ, 11గంటల నుంచి 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ, అనంతరం నామినేషన్ల జాబితా ప్రచురణ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణ, ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక, అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించాలన్నారు. అలాగే ఈ నెల 19న జరుగనున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలో వందశాతం సర్వే పూర్తి చేసేందుకు అధికారులు తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
సర్వే డేటా నికచ్చిగా ఉండాలని, ఏదైనా తేడా ఉంటే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. డబుల్ హౌస్ హోల్డర్లు, గోస్టు హౌస్ హోల్డర్లు ఉండవద్దన్నారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. మండల స్థాయి గ్రీవెన్స్ పటిష్టంగా నిర్వహించాలన్నారు. ప్రతి సామాన్యుడితో మాట్లాడి ఆ సమస్యను తెలుసుకోవాలన్నారు. దానికి పరిష్కార మార్గం ఉందో లేదో సూచించాలన్నారు. ప్రతి అధికారి తప్పని సరిగా కార్యాలయంలో అందుబాటులో ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ర్యాండమ్ తనిఖీలు చేపడతామని, విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ్, జిల్లా పరిషత్ ఏఓ అప్పారావు పాల్గొన్నారు.
ఎంపీపీ ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి
Published Tue, Aug 5 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement