Manga
-
జూలైలో మెగా సునామీ?
సునామీ. మూడక్షరాలే అయినా, అది సృష్టించే విధ్వంసం ఎంతటిదో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. 2004లో విరుచుకుపడ్డ సునామీ బీభత్సాన్ని ప్రపంచం ఎన్నిటికీ మర్చిపోలేదు. అనంతరం 2011లో భారీ సునామీ జపాన్ మొదలుకుని పలు దేశాలను అతలాకుతలం చేసేసింది. అలాంటి ఉత్పాతం మరోసారి వచ్చి పడితే? అది కూడా 2011, 2004ల్లో కంటే ప్రళయభీకర స్థాయిలో వస్తే? అదే జరగవచ్చట. అది కూడా ఎప్పుడో కాదు, వచ్చే జూలైలోనే! దాని తీవ్రత జపాన్ చరిత్రలోనే కనీ వినీ ఎరగని విధంగా ఉంటుందట. ఈ మేరకు జపాన్‌కు చెందిన ప్రఖ్యాత మాంగా ఆర్టిస్టు ర్యో తత్సుకీ చెప్పిన జోస్యం ఇప్పుడు చాలామందిని తీవ్రంగా కలవరపెడుతోంది. 2011 సునామీతో పాటు ఆమె గతంలో చెప్పినవెన్నో అక్షరాలా జరగడమే ఇందుకు కారణం. ఆ జాబితాలో 2020 నుంచి రెండేళ్లకు పైగా ప్రపంచానికి నిద్ర కూడా లేకుండా చేసిన కరోనా కూడా ఉంది! ఏమిటీ మాంగా? మాంగా అంటే జపాన్‌కే ప్రత్యేకమైన నవలలు, కార్టూన్లు. 70 ఏళ్ల తత్సుకీ ఈ కళలో ఆరితేరారు. పైగా ఇలస్ట్రేటర్‌గా కూడా ఆమెకు చాలా పేరుంది. అంతకుమించి భవిష్యద్రష్టగా కూడా తత్సుకీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. 1980ల నుంచీ ఆమె భవిష్యత్తు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా మరణాన్ని కూడా ముందే చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘నేను చూసిన భవిష్యత్తు (ద ఫ్యూచర్ దట్ ఐ సా)’పేరిట 1999లో ఆమె రాసిన మాంగా రేపిన దుమారం అంతా ఇంతా కాదు.సమీప భవిష్యత్తులో వచి్చపడనున్న ఎన్నెన్నో ప్రాకృతిక విపత్తులను గురించి అందులో తత్సుకీ ముందే పేర్కొన్నారు. ముఖ్యంగా 2011 మార్చి 11న ఏకంగా 9.1 తీవ్రతతో జపాన్ను కుదిపేసిన భయానక భూకంపం, దాని ఫలితంగా వచి్చపడ్డ భీకర సునామీ ధాటికి ఏకంగా 20 వేల మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతం గురించైతే తత్సుకీ అత్యంత స్పష్టంగా పేర్కొన్నారు. ‘2011లో భారీ ఉత్పాతం వచ్చి పడనుంది’అంటూ ఓ అధ్యాయమే రాశారు. అంతేకాదు, ‘2020లో అంతుపట్టని కొత్త రకం వైరస్ వ్యాప్తి పరాకాష్టకు చేరుతుంది’అంటూ మరోచోట కరోనా గురించి కూడా స్పష్టంగా పేర్కొన్నారు. రాకాసి బుడగలువచ్చే జూలైలో మెగా సునామీ రాబోతోందన్న తత్సుకీ, అది జపాన్ చరిత్రలోనే కనీవినీ ఎరగనంత తీవ్రమైనదని కూడా రాశారు. దాని ధాటికి జపాన్, తైవాన్, ఇండొనేసియా, ఉత్తర మరియానా దీవులు అతలాకుతలమైపోతాయని హెచ్చరించారు. ఆ దేశాలను అనుసంధానించే వజ్రాకృతితో కూడిన జోన్ నిండా ‘రాక్షస బుడగలు (రాకాసి అలలు) పడగలెత్తుతాయి’, ‘దక్షిణ జపాన్ సముద్రం మరిగిపోతుంది’అంటూ రాబోయే సునామీ తీవ్రతను వర్ణి0చారు. అంతేకాదు, దాని తీవ్రత 2011 నాటి సునామీ కంటే కనీసం మూడు రెట్లకు పై చిలుకేనని స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై కొద్ది రోజులుగా ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. ఈ జోస్యం ఏ మేరకు నిజమవుతుందన్న దానిపై ఎవరి అంచనాల్లో వారున్నారు. గత 20 ఏళ్లలో తత్సుకీ చెప్పినవన్నీ జరిగినప్పుడు ఇది మాత్రం ఎందుకు జరగదని వాదించే వారు కొందరు. సునామీ వంటి ప్రాకృతిక విపత్తుల విషయంలో శాస్త్రీయ అంచనాలను నమ్ముకోవాలే తప్ప ఇలాంటి జోస్యాలను కాదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. చూడబోతే మాంగా పేరిట తత్సుకీ ఏకంగా ప్రపంచం పాలిట మరణశాసనమే రాసినట్టు కని్పస్తోందంటూ ఇంకొందరు వాపోతున్నారు. తన రాతలపై ఇంత దుమారం రేగుతున్నా 70 ఏళ్ల తత్సుకీ మాత్రం వాటిపై మౌనం వీడటం లేదు. గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’అంటూ కీర్తిస్తున్నారు. అంధురాలైన బాబా వంగా కూడా ఇలాగే జరగబోయే విషయాలను ముందుగానే చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. కొసమెరుపు కరోనాకు సంబంధించి మనందరినీ మరింత వణికించేలా మరో జోస్యం కూడా చెప్పారు తత్సుకీ! అదేమిటో తెలుసా? మరో అయిదేళ్లలో అంటే 2030లో అది మరింత తీవ్రతతో వచ్చి పడుతుందట.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రాముడు–భీముడు.. గంగ–మంగ
ఒకేలాంటి రూపురేఖలున్న మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. అయితే, ఒకే ఇంట్లో అచ్చుగుద్దినట్లుగా ఇద్దరూ ఒకేలా ఉంటే? అలాంటి కవలలు జంటలు జంటలుగా ఒక ఊరంతా సందడి చేస్తే..? భలే గమ్మత్తుగా ఉంటుంది కదా. ఆ గమ్మత్తు చూడాలంటే వరంగల్ రూరల్ జిల్లా పెర్కవేడు వెళ్లాల్సిందే. ఈ గ్రామంలో మొత్తం పదహారుమంది కవల జంటలు కనువిందు చేస్తుంటారు. ఊళ్లో ఎక్కడైనా కనిపించవచ్చు పెర్కవేడులో అడుగుపెట్టగానే కనిపించే ఓ మనిషి పోలిన వ్యక్తి మరికొంత దూరం వెళ్లగానే కనిపించవచ్చు. ఇలా ఎందరైనా కనిపించే వీలుంది. పెర్కవేడు గ్రామం 960 గడపలతో ఉంటుంది. ఆ గ్రామ జనాభా 3420 మంది. కారణాలేమిటో తెలియకున్నా కొన్నేళ్లుగా ఇక్కడ కవలలు జన్మించడం సాధారణ విషయంగా మారింది. గ్రామంలో ఇంతమంది కవలలు ఒకేవిధంగా ఉండటంతో ఆ గ్రామం వారు కవలలను పేరు పెట్టి పిలవడంలో చాలా తికమక అవుతుంటారు. గ్రామం తీరో, నీటితీరో మరి ఈ ఒక్క గ్రామంలో ఇంతమంది కవలల జంటలు ఉండడం అన్నది విశేషంగా మారింది. పుల్లూరు పవన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్; ఆకారపు లావణ్య, రామకృష్ణ; నిఖిత్, నిఖిల; దురిశెట్టి రామ్, లక్ష్మణ్; దొడ్డ మానస వీణ, వాణి; ఊగ రాము, లక్ష్మణ్; లక్కం అనిత, సునీత; ప్రవీణ్, ప్రదీప్; ప్రమోద్, వేదప్రకాశ్, వేదవిద్య (ముగ్గురు); నిమ్మల రాము, లక్ష్మణ్; పుల్లూరు వినయ్, శివ; అంగిరేకుల నరేష్, సురేష్; ఐత రాంబాబు, ఐత రమ; గొల్లపల్లి రామయ్య, లక్ష్మయ్య; గేర ఆశీర్వాదం, రాధిక; రాజు, సువార్త కవలల్ని కనిన దంపతులు.మొత్తానికి ఇదంతా చూస్తుంటే పాత సిని మాల్లో రాముడు–భీముడు; గంగ– మంగ; చిక్కడు– దొరకడు చూసినట్టు లేదూ..? గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, వరంగల్ ఫోటోలు: బిర్రు నాగరాజు, సాక్షి, రాయపర్తి మమ్మల్ని చూస్తే అందరికీచిన్నప్పటినుంచీ తికమకే.. నేను హైద్రాబాద్‌లో ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. మా తమ్ముడు ప్రవీణ్‌కుమార్ జాబ్సెర్చ్లో ఉన్నాడు. పాఠశాల, కళాశాల స్థాయిలోనూ మమ్మల్ని చూసి తికమక పడేవారు. కాకపోతే నేను లావుగా ప్రవీణ్ సన్నగా ఉండేది. ప్రస్తుతం ఇద్దరం ఒకేలా అయ్యాము. నేను మొదటిసారిగా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నాను. తర్వాత మా తమ్ముడు ప్రవీణ్‌కుమార్ దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్‌కు వచ్చినప్పుడు నీకు ఆల్రెడీ వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అయ్యారు ఆఫీసర్లు. కానీ సర్టిఫికెట్ లను ఇద్దరివి చూపించడంతో ఇచ్చి వెళ్లారు. మమ్మల్ని గుర్తుపట్టాలంటే నా కంటిపై గాటు ఉంటుంది ప్రవీణ్‌కు ఉండదు అంతే. పుల్లూరు పవన్‌కుమార్, ప్రవీణ్ కుమార్ మా ఊరిలో ఇంతమంది కవలలు ఉండడం సంతోషం మా ఊరిలో కవల జంటలు ఉండడంతో సంతోషంగా ఉంది. పండగ సమయాల్లో వీరు వచ్చినప్పుడు తికమకగా ఉంటుంది. వేరే ఊర్లలో ఒక్కరూ లేదా ఇద్దరు ఉంటారు. కానీ మా ఊరు కవలలకు స్పెషల్. చిన్నాల తారశ్రీ, గ్రామ సర్పంచ్ -
భర్తే కాలయముడు
వేధించి చంపిన వైనం! నిందితునికి గ్రామస్తుల దేహశుద్ధి వివిధ కోణాల్లో పోలీసుల విచారణ గుడ్డిప(రావికమతం): భర్త వేధింపులు భరించలేకున్నాను.. రక్షించండంటూ నెల క్రితం పోలీసులను ఆశ్రయించింది. మారిపోయానంటూ భర్త నమ్మబలకడంతో కేసు వాపస్ తీసుకుంది. అయితే తీరుమారని భర్త చేతిలో గురువారం రాత్రి ఆమె హతమైంది. జులాయి తిరుగుళ్లు, ఆపై మద్యానికి బానిసైన భర్తే కాలయముడై కడతేర్చిన సంఘటన మండలంలోని గుడ్డిపలో చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు నిందితునికి దేహశుద్ధి చేసి, తాళ్లతో కట్టి ఆపై పోలీసులకు అప్పగించారు. నర్సీపట్నం ఏఎస్పీ సత్యఏసుబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. మృతురాలు మంగ తల్లిదండ్రులు అద్దెపల్లి వరహాలమ్మ, అప్పారావు ఏఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలిలా ఉన్నాయి. టి.అర్జాపురానికి చెందిన మంగ(25)కు గుడ్డిప గ్రామానికి చెందిన పిల్లా సత్తిబాబుతో ఏడాది క్రితం వివాహం చేశారు. సత్తిబాబుకు అంతకు ముందు పెళ్లయింది. ఆమె కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. దగ్గర బంధువు కావడంతో రెండో వివాహమైనా సత్తిబాబుకు తమ తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేశామని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. అప్పట్లో కట్నంగా నగదు, లాంఛనాలు బాగానే ముట్టజెప్పామన్నారు. కట్నంగా మరికొంత మొత్తం తేవాలని, బైక్ కొనివ్వాలంటూ తమ కుమార్తెను వేధించేవాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తమ కుమార్తె పొలీసులను ఆశ్రయించగా పెద్దల కౌన్సెలింగ్‌తో మారినట్టు నటించడంతో కేసు వాపస్ చేసుకుందన్నారు. గురువారం రాత్రి పూటుగా తాగివచ్చి, కొట్టి హింసించి ఉరివేసి చంపేశాడని వాపోయారు. ఆతని తల్లితండ్రులు, అన్నను సైతం తరచూ కొట్టడంతో వారంతా తలోదిక్కుకు పోయారని తెలిపారు. నిందితుడ్ని ఏఎస్పీ విచారించగా..తానే ఉరివేసి చంపానని ఒకమారు చెప్పాడు, గణేష్ సంబరం అనంతరం రాత్రి ఇంటికి వచ్చానని తలుపులు వేసి ఉండటంతో బయటనే నిద్రపోయానని, ఉదయం లేచి చూడగా వంటగదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ ఉన్న భార్యను దించి అందరికీ కబురు చేశానని మరొకసారి చెప్పాడు. దీంతో చంపాక ఉరివేయబడిందా, ఉరివేయడం వల్ల చనిపోయిందా అనే కోణాల్లో విచారిస్తున్నామని ఏఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. నిందితుడు సత్తిబాబును అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తహశీల్దార్ ఉమామహేశ్వరరావు, కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. -
వారిపైన పగ తీర్చుకుంటా
నేను హీరో అనగానే చాలా మంది హీరోయిన్లు జారుకున్నారు. నేను పెద్ద హీరో అయిన తరువాత వారిపై రివెంజ్ తీసుకుంటాను అంటున్నారు హాస్య నటుడు ప్రేమ్‌జీ. కామెడీ నటులు కథాయకులవుతున్న కాలం ఇది. ఆ వరుసలో సంగీత దర్శకుడు, హాస్యనటుడు ప్రేమ్‌జీ కథానాయకుడిగా అవతారమెత్తారు. ఈయన హీరోగా నటించిన చిత్రం మాంగా. డ్రీమ్ చోన్ మూవీస్ పతాకంపై పీసీకే.శక్తివేల్ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు,దర్శకత్వం బాధ్యతల్ని ఆర్ఎస్.రాజా నిర్వహించారు. అద్వైత,లీలా హీరోయిన్లుగా నటించారు. ప్రేమ్‌జీ నే సంగీతాన్ని అందించిన మాంగా చిత్రం ఈ నెల 11న తెరపైకి రానుంది. శనివారం సాయంత్రం స్థానిక వడపళనిలో గల ఆర్కేవీ.స్టూడియోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రేమ్‌జీ మాట్లాడుతూ 2006లో చెన్నై-28 చిత్రం ద్వారా తాను,జయ్, శివ, విజయ్ వసంతన్, వైభవ్ నటులుగా పరిచయం అయ్యాం అన్నారు. అప్పుడు తమలో ఎవరు ముందుగా సోలో హీరోగా పరిచయం అవుతామని పందెం వేసుకున్నామని చెప్పారు.అయితే అంద రిలో చివరిగా హీరో అయ్యింది తానేనని అన్నారు. అలా తాను సోలో హీరోగా నటించిన చిత్రం మాంగా అని తెలిపారు.తనను ప్రముఖ హీరోలతో నటింపజేసి ఇంతవాడ్ని చేసింది తన అన్నయ్య వెంకట్ప్రభునేనని అన్నారు.అన్నయ్య లేకపోతే తాను జీరోనేనన్నారు. మాంగా చిత్రంలో 2015 కాలపు విజ్ఞానిగానూ,1950 నాటి భాగవతార్గానూ తాను నటించానని వెల్లడించారు. ఈ చిత్ర కథ బాగుందని నటించడానికి సమ్మతించిన హీరోయిన్లు తాను హీరో అనగానే నటించడానికి నిరాకరించారని తాను పెద్ద హీరో అయిన తరువాత వారందరినీ తనకు అక్కగానో,అమ్మగానో నటింపజేసి పగ తీర్చుకుంటానని ప్రేమ్‌జీ అన్నారు. త్వరలో తన అన్నయ్య దర్శకత్వంలో హీరోగా నటించనున్నట్లు ఆయన వెల్లడించారు. నిర్మాత పీసీకే.శక్తివేల్,దర్శకుడు ఆర్ఎస్.రాజా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
నవవధువు ఆత్మ‘హత్య’?
భర్తే చంపాడని బంధువుల ఫిర్యాదు .సరూర్‌నగర్: అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుందని భర్త అంటుండగా... అతడే ఉరేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ బంధువులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. మీర్‌పేట ఎస్ఐ వెంకటయ్య కథనం ప్రకారం... లెనిన్‌నగర్‌లో నివాసం ఉంటూ బండల పని చేసుకుంటున్న వెంకటేష్‌కు షామీర్పేట మండలం లాల్‌గడీ మలక్‌పేటకు చెందిన మంగ (20)ను ఇచ్చి రెండు నెలల క్రితం పెళ్లి చేశారు. వెంకటేష్‌కు ఇది రెండో వివాహం. కొద్ది రోజులుగా కట్నం విషయంలో దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. కాగా, మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో మంగ ఉరేసుకొని మృతి చెంది కనిపించింది. భర్త వెంకటేష్ ఆమెకు ఉరేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.పోలీసులు మంగ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.