ప్రై వేట్ డిగ్రీ, పీజీ కళాశాలల 3 రోజుల బంద్
కమాన్‌చౌరస్తా : తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య సంఘం పిలుపు మేరకు గురువారం నుంచి మూడు రోజుల పాటు శాతవాహన యూనివర్సీటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ పాటిస్తున్నట్లు శాతవాహన యూనివర్సీటీ ప్రైవేట్ డిగ్రీ, పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్(సుప్మా) అధ్యక్షుడు వి.సతీశ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2014–15, 2015–16 విద్యా సంవత్సరానికి ఫీజు బకాయిల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం ఆన్లైన్ ప్రవేశాల్లో కళాశాలల్లో అంతర్గత మార్పు చేర్పులు, ఎంసెట్, ఇతర కోర్సుల ప్రవేశాల్లో అడ్మిషన్లు పొందని వారికి మరో అవకాశం ఇవ్వాలని కోరుతూ బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు.
ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు
కరీంనగర్ కల్చరల్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ కేంద్రంలో పీజీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు, ఎంబీఏ తృతీయ సంవత్సరం ప్రవేశాలు జరుగుతున్నట్లు సమన్వయ కేంద్రం సహాయ సంచాలకుడు ఇ.రాజేందర్ రెడ్డి తెలిపారు. 2012 నుంచి 2015 వరకు అర్హత పరీక్ష రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు డీగ్రీలో ప్రవేశాల కోసం ఈనెల ఎనిమిదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందవచ్చని లేదా 7382929606 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.