Mango Cheese Cake
-
పండు తెచ్చావా లొట్టలేశావా?
మామిడి... మ్యాంగో... ఆమ్... ఈ మూడూ దొరికే సీజన్ ఇది. మూడూ ఒకటే కదా అనుకుంటున్నారా? వంటను బట్టి... కోతను బట్టి... చేర్చే తీపిని బట్టి... కలిపే కారాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కో రుచి. ఎండలకి విసుగ్గా ఉన్నప్పుడు వీటిని ట్రై చేయండి. రొటీన్‌ని మ్యాం‘గో’ అనండి. మ్యాంగోకుల్ఫీ కావలసినవి: మామిడి పండు ముక్కలు – ముప్పావు కప్పు; చల్లటి చిక్కటి పాలు – అర కప్పు (ఫుల్ క్రీమ్ మిల్క్); ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఫుల్ ఫ్యాట్ క్రీమ్/ మీగడ – అర కప్పు; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; కుంకుమ పువ్వు నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు; పిస్తా తరుగు – ఒక టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు. తయారీ: ►మిక్సీలో మామిడి పండు ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి ►చల్లటి పాలు జత చేసి మరోమారు తిప్పాలి ►చిక్కటి క్రీమ్ జత చేసి మరోమారు తిప్పాలి ►అర కప్పు కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు మిక్సీ తిప్పాలి ►ఏలకుల పొడి, కుంకుమ పువ్వు నీళ్లు జత చేసి మరోమారు తిప్పాలి ►కుల్ఫీ మౌల్డ్‌లోకి ఈ మిశ్రమం పోసి, పిస్తా తరుగు, కుంకుమ పువ్వులతో అలంకరించి మూత పెట్టేయాలి ►డీప్ ఫ్రీజ్‌లో సుమారు ఎనిమిది గంటలపాటు ఉంచి బయటకు తీసి చల్లగా అందించాలి. మ్యాంగో హల్వా కావలసినవి: మామిడి పండు గుజ్జు – 2 కప్పులు; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – అర కప్పు; బాదం పప్పులు – రెండు టేబుల్ స్పూన్లు; జీడి పప్పులు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ►ఒక పాత్రలో మామిడి పండు గుజ్జు, పంచదార వేసి కలపాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి బాగా కరిగాక జీడిపప్పులు, బాదం పప్పులు వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి, అందులో మామిడిపండు గుజ్జు, పంచదార మిశ్రమం వేసి కలియబెట్టాలి ►మంట బాగా తగ్గించి మామిడి పండు గుజ్జు హల్వాలా మారేవరకు ఉంచాలి ►నెయ్యి జత చేసి బాగా కలిపి దింపేయాలి ►ముందుగా వేయించిన బాదం పప్పులు, జీడి పప్పుల్ని పైన చల్లాలి ►తీయటి మామిడి హల్వా సిద్ధం. మ్యాంగో ఐస్‌క్రీమ్ కావలసినవి: మామిడిపండు గుజ్జు – ఒక కప్పు; మామిడి పండ్ల ముక్కల తరుగు – ఒక కప్పు; కస్టర్డ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూను; వెనిలా ఎసెన్స్ – ఒక టీ స్పూను; పాలు – ఒక కప్పు; క్రీమ్ – మూడు కప్పులు; పంచదార – ఒక కప్పు. తయారీ: ►ఒక పాత్రలో కొద్దిగా పాలు, కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కన ఉంచాలి ►మిగిలిన పాలను ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టాలి ►పంచదార జత చేసి కలపాలి ►పాలు వేడెక్కాక కస్టర్డ్పౌడర్ కలిపిన పాలను వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి ►స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి ►అందులో మామిడి పండు గుజ్జు, మామిడి పండు ముక్కల తరుగు, క్రీమ్, వెనిలా వేసి బాగా గిలకొట్టి, ఆ మిశ్రమాన్ని డీప్ ఫ్రిజ్‌లో మూడు గంటలపాటు ఉంచి ►బయటకు తీస్తే యమ్మీ యమ్మీ మ్యాంగో ఐస్‌క్రీమ్ సిద్ధమైనట్లే. మామిడి పండు శ్రీకరణ కావలసినవి: మామిడి పండ్లు – 2; పాలు – ఒక గ్లాసు; పంచదార – 4 టీ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; జీడిపప్పు పొడి – ఒక టేబుల్ స్పూను; బాదం పప్పుల పొడి – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►బాగా పండిన మామిడి పండ్లను శుభ్రంగా కడిగి, తొక్క వేరు చేసి, గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►ముద్దలు ముద్దలుగా లేకుండా మెత్తగా అయ్యేలా ఒక స్పూనుతో బాగా మెదపాలి ►చక్కెర జత చేసి మరోమారు కలపాలి ►కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసుడు జతచేసి కలియబెట్టాలి ►జీడిపప్పుల పొడి, బాదం పప్పుల పొడి వేసి బాగా కలపాలి ►ఏలకుల పొడి జత చేసి మరోమారు బాగా కలిపి మూత పెట్టాలి ►ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఒక గంట ఉంచి బయటకు తీయాలి ►దీనిని చపాతీ, పూరీలలో నంచుకుని తింటే కూడా రుచిగా ఉంటుంది . మామిడి పండు పులుసు కావలసినవి: మామిడి పండు – 1 (దోరగా ఉండాలి); ఉల్లి తరుగు – ఒక కప్పు; తరిగిన పచ్చిమిర్చి – 4; టొమాటో తరుగు – ఒక కప్పు; బెల్లం – ఒక టేబుల్ స్పూను; చింతపండు రసం – అర కప్పు (కొద్దిగా చిక్కగా ఉండాలి); ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్లు; నూనె – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►ముందుగా మామిడి పండును ముక్కలు చేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక (మూడు టేబుల్ స్పూన్లు) మెంతులు, జీలకర్ర, ఆవాలు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►పసుపు జత చేసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ►టొమాటో తరుగు జత చేసి బాగా కలిపి తగినంత ఉప్పు వేసి కలిపి మూత ఉంచాలి ►రెండు నిమిషాల తరవాత మూత తీసి, ధనియా పొడి, మిరప కారం వేసి కలిపాక, కొద్దిగా బెల్లం పొడి వేసి బాగా కలపాలి ►చింతపండు రసం వేసి కలియబెట్టాలి ►మామిడి పండు ముక్కలు జత చేసి రెండు మూడు నిమిషాల పాటు కలిపి మూత పెట్టాలి ►కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి దింపేసి గిన్నె మీద మూత పెట్టాలి ►పదినిమిషాల తరవాత మూత తీసి అన్నంలో కలుపుకుంటే రుచిగా ఉంటుంది. మామిడి పండు కూర కావలసినవి: మామిడి పండ్లు – 4; తాజా కొబ్బరి తురుము – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 2; తరిగిన ఉల్లిపాయలు – 3; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; నీళ్లు – ఒక కప్పు; కొబ్బరి పాలు – 200 మి.లీ.; ఉప్పు – అర టీ స్పూను; కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క వేరు చేయాలి ►మామిడి పండ్లను సన్నగా ముక్కలు చేయాలి ►మందపాటి పాత్రలో మామిడి పండు ముక్కలు, నీళ్లు, పసుపు, మిరప కారం, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి, మూత పెట్టి సన్నటి మంట మీద ఉడికించాలి ►పచ్చి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, ఉల్లి తరుగు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►అర కప్పు నీళ్లు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న మామిడి పండ్ల ముక్కలకు జత చేసి, బాగా కలిపి మంట బాగా తగ్గించాలి ►కొబ్బరి పాలు జత చేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ►బాణలిలో కొబ్బరి నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేశాక, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి,కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, ఉడుకుతున్న కూర మీద వేసి దింపేయాలి. మామిడి తాండ్ర కావలసినవి: మామిడి పండు ముక్కలు – రెండు కప్పులు; పంచదార – ఒక కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►మామిడి పండు ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మామిడి పండు గుజ్జు వేసి ఆపకుండా కలుపుతుండాలి ►ఏలకుల పొడి జత చేయాలి ►పంచదార వేసి బాగా కలపాలి ►మిశ్రమం బాగా చిక్కబడే వరకు కలుపుతుండాలి ►ఒక పెద్ద ప్లేట్‌కి నిండుగా నెయ్యి పూయాలి ►బాగా ఉడికిన మామిడి పండు గుజ్జును ప్లేటులో ►పోసి సమానంగా పరిచి పైన మూత ఉంచి సుమారు పది గంటల సేపు వదిలేయాలి ►ఆ తరవాత చాకుత్ కట్ చేసుకుంటే మామిడి తాండ్ర సిద్ధమైనట్లే. మ్యాంగో మోర్ కుళంబు కావలసినవి: మామిడి పండు – 1 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); తాజా కొబ్బరి తురుము – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; ఎండు మిర్చి – 1; పెరుగు – ఒక కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – రెండు రెమ్మలు; నూనె – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక తగినన్ని నీళ్లు, మామిడి పండు ముక్కలు, ఉప్పు, పసుపు వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ►మిక్సీలో కొబ్బరి తురుము, మెంతులు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి వేసి, కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు జతచేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ►ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న మామిడి పండు ముక్కలకు జత చేయాలి ►పెరుగు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పోపు సామాను వేసి వేయించి, సిద్ధమైన మ్యాంగో మోర్ కుళాంబులో వేసి కలపాలి. -
మీగడపండు
ఐస్‌క్రీమ్ పేరు విన్నారా! వినే ఉంటార్లెండి!! అన్నం తిన్న తర్వాత జుర్రుకుంటాం కదా! అదే, చల్లగా ఉంటుంది! ఐస్ కదా మరి! క్రీమీగా ఉంటుంది పాలమీగడలాగ!! మామిడి పండు గుజ్జూ అంతే మనందరికీ నచ్చే ఈ గుజ్జుతో ఎన్ని వెరైటీలో..!! మ్యాంగో ఛీజ్ కేక్ కావల్సినవి: మ్యారీ బిస్కట్లు – 150 గ్రాములు; వెన్న – 80 గ్రాములు; ఛీజ్ – 450 గ్రాములు; పంచదార పొడి – అర కప్పు; జెలటిన్ – టేబుల్ స్పూన్; వేడినీళ్లు – పావు కప్పు; మామిడిపండ్లు – 4 (పైన తొక్క తీసి, ముక్కలుగా కట్ చేయాలి); నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు; మామిడిపండు – 1 (సర్వ్ చేసే ముందు అలంకరణకు తొక్క తీసి, సన్నని ముక్కలుగా కట్ చేయాలి) తయారీ: మిక్సర్జార్లో బిస్కట్లను వేసి పొడి చేయాలి. దీంట్లో వెన్న వేసి కలపాలి ∙ఒక గిన్నెలో క్రీమ్ ఛీజ్, పంచదార వేసి మిక్సర్‌తో బ్లెండ్ చేసి, వెన్న కలపాలి ∙వేడినీళ్లలో జెలటిన్ వేసి కరిగించాలి ∙పావు కప్పు ఛీజ్‌లో ఈ కరిగించిన జెలటిన్ వేసి కలపాలి ∙దీనిని బిస్కట్ మిశ్రమంలో వేసి కలపాలి ∙బేకింగ్ ట్రే లేదా ఒక వెడల్పాటి గిన్నె అడుగున బిస్కట్ పొడి వేసి, ఆ పైన కొద్దిగా ఛీజ్ మిశ్రమం వేసి, ఆ పైన మామిడిపండు ముక్కలు అమర్చాలి ∙ఆ పైన మళ్లీ ఛీజ్ మిశ్రమం పోసి, పైన మామిడిపండు ముక్కల్ని సెట్ చేయాలి ∙ఇలా అన్నీ సర్దాక ఈ ట్రేని ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచాలి ∙మరుసటి రోజు వడ్డించడానికి 15 నిమిషాల ముందు ఈ ఛీజ్ కేక్ బయటకు తీయాలి ∙మామిడిముక్కలు, నిమ్మరసం కలిపి మృదువైన మిశ్రమంలా చేయాలి ∙ఈ మిశ్రమాన్ని ఛీజ్ కేక్ మీద స్పూన్‌తో పోయాలి ∙ముక్కలుగా కట్ చేసి, సర్వ్ చేయాలి. మ్యాంగో కలాకండ్ కావల్సినవి: మాంగో గుజ్జు – 2 కప్పులు; కండెన్స్డ్ మిల్క్ – కప్పు (250 ఎం.ఎల్); పనీర్ – 2 కప్పులు; పిస్తాపప్పు పలుకులు – టేబుల్ స్పూన్; బాదంపప్పు పలుకులు – టేబుల్ స్పూన్ తయారీ: కేక్‌ని బేక్ చేసే ట్రే లోపల అడుగు భాగాన కొద్దిగా నెయ్యి రాయాలి ∙స్టౌ మీద మూకుడు పెట్టి అందులో మామిడిపండు గుజ్జు వేసి ఉడికించాలి ∙దీంట్లో సన్నగా తురిమిన పనీర్నువేసి బాగా కలపాలి ∙(ఇంట్లోనే పాలతో తయారుచేసుకున్న పనీర్ అయితే మంచిది) ∙దీనిని ఉడుకుతున్న మామిడిపండు గుజ్జులో వేసి ఉడికించాలి ∙దీంట్లోనే కండెన్స్డ్ మిల్క్ కలపాలి ∙బాగా ఉడికి, మిశ్రమం మృదువుగా, కాస్త గట్టి పడేంతవరకు ఉంచాలి ∙ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లో లేదా కేక్ ట్రేలో పోయాలి ∙పైన పిస్తా, బాదంపప్పు పలుకులు వేసి, చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో 2 గంటల పాటు పెట్టాలి ∙తర్వాత ట్రే బయటకు తీసి, కలాకండ్ను చతురస్రాకార ముక్కలుగా కట్ చేయాలి ∙తర్వాత సర్వ్ చేయాలి. మాంగో కుల్ఫీ కావల్సినవి: మామిడిపండు గుజ్జు – ముప్పావు కప్పు; కండెన్స్డ్ మిల్క్ – 400 గ్రాములు; బాగా గిలక్కొట్టిన మీగడ – అర కప్పు; యాలకుల పొడి – పావు టీ స్పూన్; పిస్తాపప్పు, బాదంపప్పు – 4 (సన్నగా తరగాలి) తయారీ: మీగడ లేదా క్రీమ్ బాగా గిలక్కొట్టి 4 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి ∙గిన్నెలో కండెన్స్డ్ మిల్క్, మామిడిపండు గుజ్జు, యాలకుల పొడి వేసి కలపాలి ∙దీంట్లో ఫ్రిజ్ నుంచి తీసిన చల్లటి క్రీమ్ వేసి బాగా కలపాలి ∙కుల్ఫీ అచ్చుల్లో ముందుగా కొన్ని నట్స్ పలుకులు వేయాలి. తర్వాత మామిడిపండు మిశ్రమం పోయాలి ∙కుల్ఫీ అచ్చు ముప్పావు భాగం నింపి, దాంట్లో ఒక సన్నని ఐస్‌క్రీమ్ పుల్లను గుచ్చి, ఫ్రీజర్‌లో కనీసం 5–6 గంటలసేపు ఉంచాలి ∙సర్వ్ చేసే ముందు అచ్చు నుంచి కుల్ఫీని బయటకు తీసివ్వాలి. కోకోనట్ మ్యాంగో పాప్సికెల్ కావల్సినవి: మామిడిపండు గుజ్జు – 2 1/2 కప్పులు; పైనాపిల్ జ్యూస్ – 1/2 కప్పు; ప్యూరీ కోసం... కొబ్బరి పాలు – కప్పు; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; యోగర్ట్ (వెన్నలేని పెరుగు) – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: జ్యూస్ మిక్సర్‌లో మామిడిపండు గుజ్జు, పైనాపిల్ గుజ్జు వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి ∙దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరొక గిన్నెలో కొబ్బరిపాలు, పంచదార, పెరుగు, నీళ్లు కలపాలి ∙2 టేబుల్ స్పూన్ల మామిడిపండు గుజ్జును పాప్సికెల్ అచ్చులో పోయాలి ∙ఫ్రీజర్‌లో 15 నిమిషాలు ఉంచాలి ∙ఫ్రీజర్ నుంచి తీసి టేబుల్ స్పూన్ కొబ్బరి పూరీ ఆ అచ్చులో పోసి, మళ్ళీ ఫ్రీజర్‌లో 10 నిమిషాలు ఉంచాలి ∙తర్వాత టేబుల్ స్పూన్ మామిడిపండు గుజ్జు పోయాలి ∙10 నిమిషాలు ప్రీజర్ లో ఉంచి తీసి, ఐస్‌క్రీమ్ పుల్లను అమర్చాలి ∙మరో పది నిమిషాల తర్వాత కొబ్బరి ప్యూరీ ఆ అచ్చులో పోయాలి ∙ఇలా మిశ్రమం అంతా అచ్చులో అమరిన తర్వాత ఫ్రీజర్‌లో కనీసం 4 గంటల సేపు ఉంచాలి ∙కోకనట్ మ్యాంగో పాప్సికెల్ రెడీ. వేసవిలో పిల్లలే కాదు పెద్దలూ దీనిని ఇష్టపడతారు. మ్యాంగో ఫాలుదా! కావల్సినవి: మామిడిపండు గుజ్జు – 1 1/2 కప్పు; పాలు – 1 1/2 కప్పు; పంచదార – 5 టేబుల్ స్పూన్లు; ఫాలుదా (సబ్జా) గింజలు – టేబుల్ స్పూన్ (అర కప్పు నీళ్లలో 20 నిమిషాలు నానబెట్టాలి); ఫాలుదా సేవ్ – కప్పు; మ్యాంగో ఐస్‌క్రీమ్ – 4 స్కూపులు; మామాడి పండు ముక్కలు – కప్పు; పిస్తాపప్పు – 8 (పలుకులు చేయాలి); బాదంపప్పు – 6 (పలుకులు చేయాలి); చెర్రీ పండ్లు – 4 (అలంకరణకు) తయారీ: ∙ఒకటిన్నర కప్పు పాలు కప్పుడు అయ్యేదాక మరిగించాలి ∙మంట తీసేసి, 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి కలిపి, చల్లారనివ్వాలి ∙మామిడిపండు గుజ్జులో 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసి, కలిపి, ఫ్రిజ్‌లో పెట్టాలి ∙ఫాలుదా సేవ్‌ని చల్లని నీళ్లలో వేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి ∙ఫాలుదా పోసే గ్లాసును కనీసం అర గంట ఫ్రిజ్‌లో ఉంచాలి (ఇలా చేస్తే ఫాలుదా ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. తర్వాత గ్లాస్ తీసుకొని దీంట్లో మామిడిపండు ముక్కలు అడుగున వేయాలి ∙దీనిపైన 2 టేబుల్ స్పూన్ల ఫాలుదా(నానబెట్టిన సబ్జా) గింజలను వేయాలి ∙ఆ పైన ఫాలుదా సేవ్ ఆ పైన 3 టేబుల్ స్పూన్ల మామిడిపండు గుజ్జు, ఆ పైన 4–5 టేబుల్ స్పూన్ల చల్లటి పాలు, ఆ పైన మామిడిముక్కలు, ఫాలుదా, సేవియా, మామిడిపండు గుజ్జు.. ఇలా లేయర్లుగా వేయాలి ∙చివరగా స్కూప్‌తో మ్యాంగో ఐస్‌క్రీమ్ వేసి, ఆ పైన పిస్తా, బాదంపప్పు పలుకులు, చెర్రీ పండ్లు వేసి వెంటనే అందించాలి ∙లేదంటే ఐస్‌క్రీమ్ కరిగిపోతుంది. నోట్: పాలుదా ఇంకా తియ్యగా కావాలనుకునేవారు పాలు, మామిడిపండు గుజ్జులో పంచదార లేదా తేనె కలుపుకోవచ్చు. గ్లాసు పొడవు వెడల్పును బట్టి ఫాలుదా కూడా అదనంగా వేసుకోవాలి. మామిడిపండు పాయసం కావల్సినవి: వెర్మిసెల్లీ – 3 టేబుల్ స్పూన్లు; పాలు – 3 కప్పులు; కండెన్స్డ్ మిల్క్ – పావు కప్పు; పంచదార – 3 టేబుల్ స్పూన్లు; మామిడిపండు గుజ్జు – కప్పు; నెయ్యి – 3 టీ స్పూన్లు; కిస్మిస్ – 7; జీడిపప్పు – 7; యాలకుల పొడి – చిటికెడు; మామిడిపండు ముక్కలు – పావు కప్పు తయారీ:మూకుడు పొయ్యి మీద పెట్టి, నెయ్యి వేసి, వెర్మిసెల్లి వేయించాలి ∙ దీంట్లో పాలు పోసి, సన్నని మంట మీద వెర్మిసెల్లిని ఉడికించాలి ∙ దీంట్లోనే పంచదార, కండెన్స్డ్ మిల్క్ పోయాలి ∙ ఇది కాస్త ఉడికాక యాలకుల పొడి వేసి, మంట తీసేయాలి ∙ చల్లారాక దీంట్లో మామిడిపండు గుజ్జు వేసి కలపాలి ∙ పైన జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి, ఆ పైన సన్నగా తరిగిన మామిడి పండు ముక్కలు కూడా వేసి అందించాలి మిశ్రమం గట్టిపడితే కొద్దిగా పాలుకలుపుకోవచ్చు. మ్యాంగో పన్నా! కావల్సినవి: బాగా గిలక్కొట్టిన మీగడ – ఒకటింపావు కప్పు; క్యాస్టర్ షుగర్ (పంచదార పొడి) – పావు కప్పు ; వెనిల్లా బీన్ – 1 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి); జెలాటిన్ – టేబుల్ స్పూన్; మామిడిపండ్లు – 4 (పై తొక్క తీసి, ముక్కలుగా కట్ చేయాలి) అలంకరణకు: పిస్తాపప్పు పలుకులు – ఒకటిన్నర టేబుల్ స్పూన్ పంచదార పొడి – పావు కప్పు తయారీ: ∙పన్నా తయారీ అచ్చులను తీసుకొని లోపలి వైపు కొద్దిగా నూనె రాయాలి ∙మామిడిపండు గుజ్జును మిక్సర్జార్లో వేసి బ్లెండ్ చేసి మరీ మృదువుగా చేయాలి ∙ఈ మిశ్రమాన్ని పన్నా అచ్చుల్లో సమానంగా పోయాలి. ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి ∙ఒక గిన్నెలో ముప్పావు కప్పు నీళ్లు పోసి, దీంట్లో జెలటిన్ వేసి బాగా కలపాలి ∙(అవెన్‌లో నిమిషం సేపు ఉంచితే జెలటిన్ త్వరగా నీటిలో కరుగుతుంది ∙లేదంటే వేడి నీటిలో జెలటిన్ గిన్నె ఉంచి, అది పూర్తిగా కరిగేంతవరకు కలపాలి. క్రీమ్ లేయర్ కోసం.. ∙సాస్పాన్ పొయ్యిమీద పెట్టి దీంట్లో బాగా గిలక్కొట్టిన మీగడ, పంచదారపొడి, వనిల్లా బీన్ వేసి కలపాలి ∙అన్నింటినీ పూర్తిగా మరిగించి, మంట తీసేయాలి ∙ వనిల్లా బీన్ ముక్కలను తీసేయాలి ∙దీంట్లో బాగా కరిగిన జెలటిన్‌ను వేయాలి ∙చల్లారిన తర్వాత దీంట్లో క్రీమ్ మిశ్రమం పోయాలి ∙ఈ మిశ్రమాన్ని మ్యాంగో మిశ్రమం ఉన్న అచ్చులో పైన పోసి, ఫ్రిజ్‌లో రెండు గంటలసేపు ఉంచాలి ∙చిన్న సాస్ పాన్‌లో పంచదార, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి సన్నని మంటపై మరిగించాలి ∙బంగారు రంగు వచ్చేవరకు ఉంచి మంట తీసేసి దీంట్లో పిస్తాపప్పు వేసి కలపాలి ∙ఫ్రిజ్‌లో పెట్టిన మ్యాంగో పన్నా అచ్చు బయటకు తీసి, సర్వింగ్ ప్లేట్లో బోర్లించాలి ∙ఆ పైన పిస్తాపపప్పు ఉన్న పంచదార సిరప్ వేసి వెంటనే సర్వ్ చేయాలి. -
మామిడి రుచిలెక్కలెరుగదు...
రుచులను షడ్రుచులుగా వర్ణించి వర్గీకరించారు... రసాలను నవరసాలంటూ పరిమితి విధించి చెప్పారు... ఇలా నిర్ణయించినవారికి మామిడి గురించి తెలుసో? లేదో? ఆ ఒక్క పండులోనే ఎన్నో రసాలు... చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు... మామిడిని ఆస్వాదించడానికి... ఆ ఆరూ, ఈ తొమ్మిదీ సరిపోలేదు... వంట వంక పెట్టుకుని... రెసిపీ పేరు పెట్టుకొని ... కొత్త రుచుల అన్వేషణ చేస్తున్నారు... ఆకలి రుచినీ, నిద్ర సుఖాన్నీ ఎరగనట్టే... మామిడి రుచులు లెక్కలెరగవు. లెక్కలకు ప్రాధాన్యమిస్తే పండును వదిలేసి టెంకను తిన్నంత ఒట్టు. ఈ వంటలన్నీ చేసేసి, కొత్తరుచుల గిన్నెలను పొయ్యి దించండి. లెక్క లేని, అంతు లేని మామిడి వంటలను ఆస్వాదించండి. మ్యాంగో చీజ్ కేక్ కావలసినవి: హెవీ క్రీమ్ - కప్పు; కన్ఫెక్షనరీ పంచదార - 2 టేబుల్ స్పూన్లు; మేరీ బిస్కెట్ల పొడి - 3 కప్పులు; పనీర్ తురుము - 50 గ్రా;క్రీమ్ చీజ్ - 150 గ్రా., పనీర్ - 100 గ్రా., పాలు - పావు కప్పుపంచదార పొడి - 6 టీ స్పూన్లు, కరిగించిన బటర్ - 4 టేబుల్ స్పూన్లు వెనీలా ఎసెన్స్ - టీ స్పూను, మామిడిపళ్లు - 2, మామిడిపండు గుజ్జు - పావు కప్పు తయారీ: ఒక పాత్రలో హెవీ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ల కన్ఫెక్షనరీ పంచదార వేసి బాగా కలపాలి బిస్కెట్ల పొడి ఇందులో వేసి అన్నీ కరిగిపోయేలా కలపాలి సర్వింగ్ బౌల్స్‌లో ఈ మిశ్రమాన్ని కింద వేసి గట్టిగా ఒత్తి వీటిని డీప్ ఫ్రిజ్‌లో సుమారు 10 నిమిషాలు ఉంచాలి పనీర్ ను సన్నగా తురిమి కొద్దిగా నీరు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి పనీర్ మిశ్రమానికి పంచదార పొడి, వెనీలా ఎసెన్స్, క్రీమ్ చీజ్ జత చేసి మెత్తగా అయ్యేవరకు గిలక్కొట్టాలి. (అవసరమనుకుంటే పాలు జత చేయాలి) మామిడి పండు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సగం ముక్కలను చీజ్ మిశ్రమంలో వేయాలి క్రీమ్ చీజ్ మిశ్రమాన్ని చీజ్ కేక్ బేస్ మీద పోసి, స్పూన్‌తో సర్దాలి మామిడిపండు గుజ్జును పైన వేసి సుమారు గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి చివరగా చీజ్ కేక్ పైన మామిడి పండు ముక్కలతో అలంకరించి, అందించాలి. మ్యాంగో ముసిలీ కావలసినవి: కార్న్ ఫ్లేక్స్ - 100 గ్రా., ఓట్లు - 100 గ్రా. (ఎండబెట్టి వేయించాలి) డ్రై ఫ్రూట్స్ - అర కప్పు (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా పప్పు - పావు కప్పు, నువ్వుపప్పు - పావు కప్పు (వేయించాలి) పెరుగు - అర లీటరు, పచ్చి మామిడికాయ తురుము - 2 కప్పులు, తేనె - 4 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక పాత్రలో కార్న్ ఫ్లేక్స్, వేయించిన ఓట్లు, వేయించిన నువ్వు పప్పు, డ్రై ఫ్రూట్స్ కలిపితే ముసిలీ తయారవుతుంది. ఒక పాత్రలో పెరుగు, తేనె వేసి బాగా గిలక్కొట్టాలి. ఒక గ్లాసులో ముందుగా పెరుగు + తేనె మిశ్రమం ఒక పొరలా వేయాలి. ఆ పైన నాలుగు టేబుల్ స్పూన్లు ముసిలీ మిశ్రమం వేయాలి. ఆ పైన పెరుగు మరో పొరలా వేయాలి. చివరగా పచ్చిమామిడికాయ తురుము, ముసిలీ మిశ్రమం వేయాలి. ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచి తీసి అందించాలి. మ్యాంగో కార్డమమ్ పౌండ్ కేక్ కావలసినవి: మైదా పిండి - ఒకటిన్నర కప్పులు, బేకింగ్ పౌడర్ - టీ స్పూను బేకింగ్ సోడా - పావు టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను ఏలకుల పొడి - టీ స్పూను, అన్ సాల్టెడ్ బటర్ - అర కప్పు పంచదార - ముప్పావు కప్పు, గట్టి పెరుగు - 3 టేబుల్ స్పూన్లు మజ్జిగ - 100 మి.లీ., మామిడి పండు గుజ్జు - అర కప్పు మామిడి పండు ముక్కలు - కప్పు (చిన్న ముక్కలుగా కట్ చేయాలి) ఐసింగ్ సుగర్ - టీ స్పూను (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది) తయారీ: అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసి ఉంచాలి. కేక్ టిన్ తీసుకుని దానిలో ముందుగా అన్ సాల్టెడ్ బటర్, ఆ తరవాత కొద్దిగా మైదా పిండి వేయాలి. ఒక పాత్రలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి. బటర్లో పంచదార వేసి బాగా గిలక్కొట్టాలి. పెరుగు జత చేసి మరోమారు గిలక్కొట్టాలి. పెన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమంలో మజ్జిగ, మామిడిపండు గుజ్జు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. సిద్ధంగా ఉన్న కేక్ టిన్‌లో ఈ మిశ్రమాన్ని పోయాలి. సుమారు 45 నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. బాగా చల్లారాక పైన ఐసింగ్ సుగర్, మామిడిపండు ముక్కలు వే సి అందించాలి. మ్యాంగో అండ్ జింజర్ జామ్ కావలసినవి: మామిడి పండు ముక్కలు - 2 కప్పులు పంచదార - పావు కప్పు ఉప్పు - చిటికెడు అల్లం తురుము - టీ స్పూను నిమ్మరసం - టీ స్పూను తయారీ: అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి స్టౌ (సన్నని మంట) మీద ఉంచి సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. (మాడకుండా ఉండేలా మధ్య మధ్యలో కలుపుతుండాలి) రుచి చూసి పంచదార తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా జత చేయాలి. బాగా చల్లారాక శుభ్రమైన గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే సుమారు నెల రోజులు నిల్వ ఉంటుంది. మ్యాంగో పులిసేరీ కావలసినవి: మామిడిపండు - 1; కొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి - 2; మెంతులు - అర టీ స్పూను; చిక్కటి మజ్జిగ - ఒకటిన్నర కప్పులు; నూనె - 2 టీ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; ఉప్పు - తగినంత తయారీ: ఇది కేరళ వంటకం ముందుగామామిడి పండు తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు, మామిడిపండు ముక్కలు, కరివేపాకు వేసి ఉడికించాలి చిన్న బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి చల్లారాక, మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా చేసి, ఉడుకుతున్న మామిడిపండుగుజ్జులో వేయాలి బాగా ఉడుకుతుండగా మజ్జిగ జత చేసి, కలిపి దించేయాలి చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, కరివేపాకు వేసి వేయించి, మామిడిపండు గుజ్జులో వేయాలి ఇది అన్నంలోకి, వేపుడులోకి బాగుంటుంది. రా మ్యాంగో సలాడ్ కావలసినవి: నువ్వు పప్పు - టేబుల్ స్పూను; పల్లీలు - టేబుల్ స్పూను; బెల్లం - టేబుల్ స్పూను; పచ్చి మామిడికాయ తురుము - కప్పు; రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; ఎల్లో క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; కొత్తిమీర తరుగు - నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; మిరియాల పొడి - తగినంత తయారీ: బాణలిని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక నువ్వుపప్పు, పల్లీలు విడివిడిగా వేసి వేయించి తీసేయాలి చిన్న రోలు వంటి దాంట్లో పల్లీలు, నువ్వుపప్పు, బెల్లం వేసి, పొడిపొడిలా అయ్యేలా దంచి తీసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో పచ్చి మామిడికాయ తురుము, ఎల్లో క్యాప్సికమ్ తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకోవాలి. (ముందుగా వీటిని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడనివ్వాలి) సర్వింగ్ బౌల్స్‌లో కొద్దికొద్దిగా వేసి, పైన కొత్తిమీర, పల్లీలు + నువ్వుపప్పు + బెల్లం మిశ్రమం చల్లి అందించాలి. సేకరణ: డా. వైజయంతి కర్టెసీ: అరుంధతీరావ్