మరో సారి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన
పాకిస్థాన్ సైన్యం భారత్ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘనకు మరోసారి పాల్పడింది. జమ్మూ ప్రాంతంలోని సాంబ జిల్లాలోని బీఎస్ఎఫ్ దళాలకు చెందిన మంగు చాక్, కాద్వా చెక్ పోస్ట్లపై ఈ రోజు ఉదయం నుంచి కాల్పులకు తెగబడిందని సీనియర్ పోలీసు ఉన్నతాధికారి బుధవారం వెల్లడించారు. అయితే భారత్ సైన్యం వెంటనే స్పందించిందన్నారు. కాగా ఇరువైపులా ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయన్నారు.
పాక్ సైన్యం నిన్న ఒక్క రోజే హమీర్పూర్ ప్రాంతంలో మూడు సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన సంగతిని పోలీసు ఉన్నతాధికారి ఈ సందర్బంగా గుర్తు చేశారు. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మంగళవారం హైదరాబాద్కు చెందిన లాన్స్ నాయక్ మహ్మద్ ఫిరోజ్ ఖాన్ మరణించిన సంగతి విదితమే. గత వారం రోజుల కాలవ్యవధిలో పాక్ సైన్యం తొమ్మిది సార్లు భారత్ సరిహద్దు పై కాల్పులకు తెగబడిందని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.