Mani palvesan
-
ఎస్‌బీహెచ్‌కు రూ.620 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) 2016–17 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో నష్టాలను చవిచూసింది. ఈ కాలంలో రూ.619.82 కోట్ల నికర నష్టం వాటిల్లింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.185 కోట్ల నికర లాభం ఆర్జించింది. నిర్వహణ లాభం రూ.854 కోట్ల నుంచి రూ.219 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం రూ.1,203 కోట్ల నుంచి రూ.613 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఆదాయం రూ.1,569 కోట్ల నుంచి రూ.1,085 కోట్లకు వచ్చి చేరింది. 2016 ఏప్రిల్–డిసెంబరు కాలంలో ఎస్‌బీహెచ్‌కు రూ.1,368 కోట్ల నికర నష్టం వచ్చింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.812 కోట్ల నికర లాభం పొందింది. మొత్తం వ్యాపారం రూ.2.60 లక్షల కోట్లు, డిపాజిట్లు 16% పెరిగి రూ.1.50 లక్షల కోట్లు నమోదైంది. కాసా డిపాజిట్లు 43% అధికమై రూ.60,309 కోట్లకు చేరాయి. ఎస్బీహెచ్ ఎండీ మణి పల్వేశన్ సోమవారమిక్కడ ఆర్థిక ఫలితాలను విడుదల చేశారు. -
ఎస్బీహెచ్ కొత్త ఎండీగా మణి పల్వేశన్
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా మణి పల్వేశన్ బాధ్యతలు స్వీకరించారు. శనివారంనాడే ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు సోమవారం బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. మణి పల్వేశన్ 1982లో ఎస్‌బీఐహెచ్‌లో ప్రొబేషనరీ అధికారిగా చేరారు. అప్పటి నుంచి బ్యాంకులోని వివిధ విభాగాల్లో పనిచేశారు. ఈ బాధ్యతలు చేపట్టకముందు ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాంకాంగ్ బ్రాంచ్‌కు అక్కడే సీఈఓగా పనిచేశారు. అంతకుముందు ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ ఎండీగా, ముంబయిలోని డీఎండీ కార్యాలయంలో చీఫ్ జనరల్ మేనేజరుగా కూడా పనిచేశారు. -
ఎస్బీహెచ్ సీజీఎంగా మణి పాల్వేశన్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) చీఫ్ జనరల్ మేనేజర్‌గా (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) మణి పాల్వేశన్ విధుల్లో చేరారు. డిసెంబర్ 31న ఎస్బీహెచ్ ఎండీగా రిటైరయిన శంతను ముఖర్జీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1982లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరిన మణి.. ఆ తర్వాత వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్బీఐ హాంకాంగ్ బ్రాంచ్ సీఈవో, ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ ఎండీ తదితర హోదాల్లో సేవలు అందించారు.