ఎస్‌బీహెచ్‌ కొత్త ఎండీగా మణి పల్వేశన్‌ | Palvesan takes charge as managing director in State Bank of Hyderabad | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్‌ కొత్త ఎండీగా మణి పల్వేశన్‌

Published Tue, Jan 17 2017 1:21 AM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

ఎస్‌బీహెచ్‌ కొత్త ఎండీగా మణి పల్వేశన్‌

ఎస్‌బీహెచ్‌ కొత్త ఎండీగా మణి పల్వేశన్‌

సాక్షి, హైదరాబాద్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మణి పల్వేశన్‌ బాధ్యతలు స్వీకరించారు. శనివారంనాడే ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు సోమవారం బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. మణి పల్వేశన్‌ 1982లో ఎస్‌బీఐహెచ్‌లో ప్రొబేషనరీ అధికారిగా చేరారు. అప్పటి  నుంచి బ్యాంకులోని వివిధ విభాగాల్లో పనిచేశారు. ఈ బాధ్యతలు చేపట్టకముందు ఆయన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హాంకాంగ్‌ బ్రాంచ్‌కు అక్కడే సీఈఓగా పనిచేశారు. అంతకుముందు ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ ఎండీగా, ముంబయిలోని డీఎండీ కార్యాలయంలో చీఫ్‌ జనరల్‌ మేనేజరుగా కూడా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement