ఎస్‌బీహెచ్‌కు రూ.620 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) 2016–17 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో నష్టాలను చవిచూసింది. ఈ కాలంలో రూ.619.82 కోట్ల నికర నష్టం వాటిల్లింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.185 కోట్ల నికర లాభం ఆర్జించింది. నిర్వహణ లాభం రూ.854 కోట్ల నుంచి రూ.219 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం రూ.1,203 కోట్ల నుంచి రూ.613 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఆదాయం రూ.1,569 కోట్ల నుంచి రూ.1,085 కోట్లకు వచ్చి చేరింది. 2016 ఏప్రిల్–డిసెంబరు కాలంలో ఎస్‌బీహెచ్‌కు రూ.1,368 కోట్ల నికర నష్టం వచ్చింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.812 కోట్ల నికర లాభం పొందింది. మొత్తం వ్యాపారం రూ.2.60 లక్షల కోట్లు, డిపాజిట్లు 16% పెరిగి రూ.1.50 లక్షల కోట్లు నమోదైంది. కాసా డిపాజిట్లు 43% అధికమై రూ.60,309 కోట్లకు చేరాయి. ఎస్‌బీహెచ్ ఎండీ మణి పల్వేశన్ సోమవారమిక్కడ ఆర్థిక ఫలితాలను విడుదల చేశారు.