Manipur Election Results
-
ఘోర పరాజయం: రాజకీయాలకు గుడ్ బై
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం చవిచూసిన ఇరోం షర్మిల రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. నేడు వెల్లడించిన మణిపూర్ అసెంబ్లీ ఫలితాల అనంతరం ఆమె రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో ఆర్మీలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని నిరసిస్తూ ఆమె 16 ఏళ్లుగా నిరహార దీక్ష చేశారు. అయితే గతేడాదే ఆ దీక్షకు స్వస్తి చెప్పి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏఎఫ్ఎస్పీఏను రద్దుచేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పదవికి ఆమె పోటీ చేశారు. అయితే ఆమెను నివ్వెరపరుస్తూ కేవలం 90 ఓట్లే ఆమె ఖాతాలోకి వచ్చి చేరాయి. దీంతో భారీగా దెబ్బతిన్న ఇరోం షర్మిల రాజకీయాల నుంచి బయటికి వచ్చేయాలని నిర్ణయించారు. ప్రజలు తనను సపోర్టు చేయడం లేదని పేర్కొంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేముందు కూడా పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. అవేమీ పట్టించుకోని ఇరోం షర్మిల రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యమంత్రి ఓంకార్ ఇబోబీ సింగ్ కు వ్యతిరేకంగా తోబల్ నియోజక వర్గం నుంచి పోటీకి దిగారు. -
16 ఏళ్ల దీక్షకు 90 ఓట్లు
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇరోం షర్మిలకు షాకిచ్చాయి. నిరంతరాయంగా 16 ఏళ్ల పాటు చేసిన దీక్షకు ఆమెకొచ్చిన ఓట్లు ఇరోం షర్మిల నివ్వెరపరిచాయి. కేవలం 90 ఓట్లే ఆమెకు అనుకూలంగా వచ్చాయి. 16 ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షకు స్వస్తి చెప్పిన ఇరోం షర్మిల రాజకీయాల్లోకి దిగనున్నట్టు ప్రకటించారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సీఎం ఓంకార్ ఇబోబీ సింగ్ కు వ్యతిరేకంగా తోబల్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. అయితే సీఎం అభ్యర్థి ఇబోబీ సింగే అఖండ విజయం సాధించారు. 18,649 ఓట్లను ఆయన సొంతం చేసుకున్నారు. నోటాకు వేసినన్నీ ఓట్లు కూడా కనీసం ఇరోం షర్మిలకు రాలేదు. పైన పేర్కొన్న అభ్యర్థెలవరూ తమకు ఇష్టం లేదని పేర్కొంటూ నోటాకు 143 ఓట్లు వేశారు. గతేడాది దీక్షను విరమిస్తున్న సందర్భంగా మణిపూర్ కు ముఖ్యమంత్రిగా గెలుపొంది, ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. అయితే ప్రస్తుత ఫలితాలు ఆమె లక్ష్యాన్ని నెరవేర్చేలా లేవు. ఆర్మీలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇరోం చేసిన నిరసన దీక్షకు మద్దతిచ్చిన పలువురు మహిళా కార్యకర్తలు కూడా ఆమె రాజకీయాలకు దిగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రచార సందర్భంగాను ఇరోం షర్మిల ఒక్కతే సైకిళ్లపై తిరుగుతూ తన పార్టీని ప్రమోట్ చేసుకున్నారు.